సాక్షి, ఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టింగ్ చైర్‌పర్సన్ విజయభారతిని వైఎస్సార్‌సీపీ మహిళా నేతల బృందం మంగళవారం కలిసింది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. మహిళా నేతల బృందంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టరు తనుజారాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవి ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలో 77 మంది మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరిగిన విషయాన్ని కమిషన్ దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకెళ్లింది. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక దందాల్లో సీఎం హోంమంత్రి బీజీగా ఉన్నారని.. మహిళల రక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన దిశా యాప్‌ను నిరుపయోగం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు.
దిశా యాప్ నిర్వీర్యం చేయడంతో మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ అంశాల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ నేతలు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment