రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రోలో కూర్చునేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతుంటారు. సీటు కోసం వాదులాడుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం అనేది ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి.
తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడటానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో.. మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయివుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది.
అది కొట్టుకోవడం వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం మరింతగా పెరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట కూడా జరిగింది. కొద్దిసేపటి తరువాత మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో ఆ మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ సమయంలో ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment