మెట్రోలో కేజ్రీవాల్‌కు బెదిరింపు మెసేజ్‌ రాసిన బ్యాంకర్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

మెట్రోలో కేజ్రీవాల్‌కు బెదిరింపు మెసేజ్‌ రాసిన బ్యాంకర్‌ అరెస్ట్‌

Published Wed, May 22 2024 11:11 AM

Arvind Kejriwal Threatening Message in Delhi Metro Arrested

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మెట్రోలో బెదిరింపు సందేశాలు రాసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని పేరు అంకిత్ గోయల్. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దానిలో నిందితుడు బెదిరింపు సందేశం రాస్తూ కనిపించాడు. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు బరేలీ వాసి అని,  ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
  

 నిందితుడు అంకిత్ గోయల్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అతను మానసికంగా బాగానే ఉన్నాడని, గతంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా జరిగిన పలు ర్యాలీలలో కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో కేజ్రీవాల్‌పై నిందితుడు ఆంగ్లంలో సందేశం రాశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాతలకు బీజేపీనే కారణమని ఆరోపించింది. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో విభాగం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
  

Advertisement
 
Advertisement
 
Advertisement