ఢిల్లీ: ఢిల్లీలో పెరుగుతున్న నేరాలపై అమిత్‌షాకు మాజీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు. నేరాలకు రాజధానిగా ఢిల్లీ మారిందని.. మహిళలపై నేరాలు, హత్యల్లో ఢిల్లీది మొదటిస్థానం అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయి. ఢిల్లీ శాంతిభద్రతలపై తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు
భారత్‌లోని మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధికంగా ఢిల్లీలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ సంబంధిత నేరాలు 350 శాతం పెరిగాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబు బెదిరింపుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు నిత్యం భయంభయంగా బతుకుతున్నారు. పట్టపగలే హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. రాజధానిలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఈ వైఫల్యాల కారణంగా ఢిల్లీకి ‘రేప్ క్యాపిటల్’, ‘క్రైం క్యాపిటల్’ అనే కొత్త పేర్లు వస్తున్నాయి’’ అని లేఖలో కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ఆ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment