write letter
-
హారిజాంటల్ రిజర్వేషన్లు దారుణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలతో పాటు దివ్యాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం చేసేలా ఉన్న జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీకి రాసిన లేఖలను కవిత సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టీకల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం జీవో 41, 56లను జారీ చేసిందన్నారు. పాత విధానం ప్రకారం మహిళలకు కచ్చితంగా 33 శాతం ఉద్యోగాలతో పాటు అదనంగా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉండేందన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ విధానంతో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. -
1,950కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి లేఖ రాశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో రూ.9,749 కోట్లతో పట్టణాభివృద్ధి చేపట్టనున్నామని, ఇందులో 20% కేంద్రం వాటాగా బడ్జెట్లో రూ.1,950 కోట్లు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, హౌసింగ్ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, నగర భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మురుగునీటి ప్రవాహ వ్యవస్థను అభివృద్ధి చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సీవరేజి మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రణాళిక, సర్వే, డిజైన్, అంచనాల తయారీని పూర్తి చేసిందని, మూడు ప్యాకేజీల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు) డీపీఆర్‌లు సిద్ధం సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగునీటి ట్రంక్ లైన్ల ఏర్పాటు పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు. సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీ), సీవరేజ్ కలెక్షన్ నెట్వర్క్ ట్రంక్, సివర్ లైన్ల నెట్వర్క్ మొత్తం 2,232 కిలోమీటర్ల మేర ఉంటుందని, రూ. 3722 కోట్లతో 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్లో కనీసం 20 శాతం వాటాగా రూ.750 కోట్లను ఈ పనులకు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో వరదలు ముంచెత్తడానికి ప్రధాన కారణమైన నాలాల అభివృద్ధికి రూ.1,200 కోట్ల అంచనాలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, దీనికి రూ.240 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నియో మెట్రో రైలుకు రూ.210 కోట్లు వరంగల్ నగరంలో నియో మెట్రో రైల్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. 15 లక్షలున్న వరంగల్ జనాభా 2051 నాటికి 35 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరంగల్ నియో మెట్రో డీపీఆర్ సిద్ధం అయిందని, సుమారు 15.5 కిలోమీటర్ల ఉండే వరంగల్ మెట్రో కారిడార్‌కి రూ.1,050 కోట్ల ఖర్చు అవుతుందని, కేంద్రం వాటాగా రూ.210 కోట్లను ఈక్విటీ లేదా గ్రాంట్ రూపంలో కేటాయించాలని కోరారు. చదవండి: (నేర, మావో రహిత తెలంగాణే లక్ష్యం) డ్రైనేజి పనులకు రూ.750 కోట్లు కేటాయించండి ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని 57 పురపాలికల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు చేపట్టేందుకు రూ.13,228 కోట్లు అవసరమవుతాయని, తొలి దశలో 30 పట్టణాల్లో రూ.2,828 కోట్లతో పనులు చేపట్టనున్నామని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. పురపాలికల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనుల కోసం రూ.258 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ పురపాలికల్లో పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్ టన్నుల లెగసి డంప్‌ను రూ.520 కోట్లతో బయో మైనింగ్, రెమేడియేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించి రూ.250 కోట్లతో ఇప్పటికే 76 పురపాలికల్లో పనులు పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడాది రూ.3,777 కోట్లతో పురపాలికల్లో వివిధ పనులు చేపట్టనున్నామని, కనీసం 20 శాతం వాటాగా రూ.750 కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని పేర్కొన్నారు. -
‘నువ్వు పిసినారివి రా’..
భోపాల్: దొంగతనం అంటే మాటలా..? ముందుగా దానికి ఓ పక్కా ప్లాన్ ఉండాలి. దానికి అనుగుణంగా స్కెచ్ గీసుకోవాలి. అలా చేస్తే గానీ అనుకున్న పని అవ్వదు. సరిగ్గా ఓ దొంగ ఇలానే చేశారు. పక్కా ప్లాన్‌తో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అక్కడ దొంగకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో ఓ దొంగ రాత్రంతా ఎంతో కష్టపడి ప్రభుత్వ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పర్వేష్‌సోని ఇంట్లోకి అతికష్టం మీద కిటికీలు తొలగించి ప్రవేశించాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే షాక్‌కు గురయ్యాడు. ఇళ్లు మొత్తం వెతికినా దోచుకెళ్లడానికి కావాల్సిన విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. ఇంతవరకు తాను పడిన కష్టానికి ఫలితం దక్కనందుకు కోపంతో ఇంటి యజమానికి ఒక లేఖ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఆ లేఖలో ‘నువ్వు చాలా పిసినారివిరా.. కనీసం కిటికీ తొలగించడానికి పడిన శ్రమకు కూడా తగిన ఫలితం దక్కలేదు. ఈ రాత్రంతా వృథా అయ్యింది’ అని హిందీలో రాసి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం పర్వేష్ ఇంట్లో పనికి వచ్చిన మహిళ ఇంటిలోని వస్తువులన్నీ కిందపడి ఉండటంతో షాక్ అయ్యింది. టేబుల్ మీద ఉన్న లేఖ చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చేతిరాత పరిశీలన నిపుణులకు పంపారు. పర్వేశ్ ఇల్లు జాయింట్ కలెక్టర్, న్యాయమూర్తి ఇంటికి దగ్గరలో ఉండడంతో కేసుని సీరియస్‌గా తీసుకుని, సీసీ టీవీ పుటేజ్‌ని కూడా పరిశీలిస్తున్నారు. -
రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి ‘స్థానికత’!
లేఖ రాయూలని ఏపీ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల స్థానికత నిర్ధారణకు అవసరమైన నిబంధనలు రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అంశంపై రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టు సమాచారం. తె లంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై బుధవారం ఆయన లేక్‌వ్యూ అతిధి గృహంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భేటీ తర్వాత మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన స్థానికత అంశంపై కోర్టుకు వెళతామని చెప్పారు. -
'ఆరు నెలల్లో రూ. 10 వేల కోట్లు సంపాదించాడు'
మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కొత్త పార్టీ అంటూ డ్రామా లాడుతున్నారని మాజీ మంత్రి డొక్కా మణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. కిరణ్ అవినీతిపై విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం గవర్నర్‌కు మాణిక్యవర ప్రసాద్ లేఖ రాశారు. ఆరు నెలలుగా అవినీతి ఫైళ్లపై కిరణ్ రెండు చేతులతో సంతకాలు చేశారని విమర్శించారు. ఆరు నెలల కాల వ్యవధిలో రూ. 5 నుంచి 10 వేల కోట్లు కిరణ్ సంపాదించారన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను కూడా వదిలిపెట్టకుండా సీఎంగా కిరణ్ మాముళ్లు వసూళ్లు చేశారన్నారు. కిరణ్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారన్నారు. కిరణ్ బ్యాక్ అఫీస్ ద్వారా ఆయన తమ్ముడు వసూళ్లు చేశారని డొక్కా మణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. కిరణ్‌కు డొక్యా మాణిక్యవరప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఆయన మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే కిరణ్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే డొక్యా మణిక్యవర ప్రసాద్ సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ప్రముఖ రచయిత గోపిచంద్ వ్రాసిన అసమర్థుని జీవ యాత్ర నవలలోని సీతారామరావు పాత్రకు కిరణ్ అచ్చుగుద్దినట్లు సరిపోతారని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.