లేఖ రాయూలని ఏపీ సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల స్థానికత నిర్ధారణకు అవసరమైన నిబంధనలు రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అంశంపై రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టు సమాచారం. తె లంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై బుధవారం ఆయన లేక్‌వ్యూ అతిధి గృహంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భేటీ తర్వాత మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన స్థానికత అంశంపై కోర్టుకు వెళతామని చెప్పారు.
రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి ‘స్థానికత’!
Published Thu, Jul 31 2014 2:11 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement
Advertisement