metro city
-
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం
సాక్షి,హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సంబరాలను (Sankranthi celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ మెట్రో(Metro train) సన్నాహాలు ప్రారంభించింది. నేటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ పేరిట కోఠి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో వేడుకలను ప్రారంభించింది. సంక్రాంతి పండుగలో భాగంగా సంక్రాంతి మెట్రో ఫెస్ట్‌ను బుధవారం మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకలకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఇతర మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ (hyderabad) మెట్రో ఇంజనీరింగ్ అద్భుతం. మెట్రోలను రైల్వే ఇంజనీర్లు ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుగా చేపడతారు. కానీ మేం హైదరాబాద్ మెట్రోను కేవలం ట్రాన్స్పోర్ట్ మోడ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ ఆత్మ ప్రతిబింబించేలా హైదరాబాద్ మెట్రోను నిర్మించాం.2013లో ప్రపంచంలోని టాప్ 100 ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకదానిలో మెట్రో రైల్ నిలిచింది. హైదరాబాద్ నగరంలో వున్న 90 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తే రోడ్లన్నీ జామ్ అవుతాయి. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం మాత్రమే ఉపయోగపడుతుంది. మెట్రో లాంటి వ్యవస్థలు అందులో చాలా ముఖ్యమైనవి.మెట్రో రైలు జర్నీనీ ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు. వారి కోసం మీ టైం ఆన్ మై మెట్రో క్యాంపెయిన్‌ను అందుబాటులోకి తెచ్చాం. మెట్రో స్టేషన్లలో మీ టాలెంట్ చూపించేలా మెట్రో అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మెట్రో స్టేషన్లలో మీ టాలెంటును షోకేస్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తాం. డాన్సులు సంగీతం వంటి అంశాలు మీరు ప్రదర్శించవచ్చు.సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ మెట్రో ప్రాజెక్టు పై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా హైద్రాబాద్ మెట్రో విస్తరణ చేయాలన్నారు. హైదరాబద్ విశ్వ నగరాన్ని చేయడానికి మెట్రో కీలక పాత్ర పోషిస్తుంది. హబ్‌ను ఏర్పాటు చేసి మెట్రోను డెవలప్ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కేంద్రానికి మెట్రో విస్తరణపై సీఎం అనేక అంశాలను ఉంచారు. మెట్రోతో పాటు హైద్రాబాద్ అభివృద్ధి ప్రపోజల్స్‌ను కేంద్రానికి పంపించినట్లు చెప్పారు. -
మెట్రో మార్గాల్లో ‘డబుల్ డెక్కర్లు’
సాక్షి, హైదరాబాద్: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద నిర్మంచబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రోరైలు వచ్చే ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరపనున్నారు. హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రహదారుల విస్తరణ తదితర పనులకు ప్రభుత్వం రూ.7,032 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల పనులకు రూ.837 కోట్లు పరిపాలన అనుమతులు జారీ చేశారు. వాటిల్లో విప్రో సర్కిల్ దగ్గర రెండు మార్గాల్లో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. విప్రో గేట్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ ‘యాక్సెంచర్’కు ముందుగా దిగనుంది. ఇదే మార్గంలో మెట్రో రైలు రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వెళ్లే మార్గం రానుంది. ఈ నేపథ్యంలో హై సిటీ పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం, మెట్రో అధికారులు జంక్షన్ వద్ద మెట్రోరైలు మార్గాన్ని ఫ్లై ఓవర్ పైనుంచి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. అందుకనుగుణంగా డిజైన్లు రూపొందించనున్నారు. అలాగే క్రాస్‌రోడ్, మియాపూర్ జంక్షన్ల మధ్య 2.28 మీటర్ల మేర ఆరులేన్ల ఫ్లై ఓవర్, లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి వైపు 800 మీటర్ల మేర మూడు లేన్ల అండర్‌పాస్ రానుంది. ఈ పనుల కోసం రూ.530 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఇక్కడ ఫ్లై ఓవర్ మార్గంలోనే మియాపూర్ నుంచి పటాన్చెరు వెళ్లే మెట్రో మార్గం రానుంది. దీంతో ఇక్కడ కూడా మొదటి వరుసలో ఫ్లై ఓవర్, రెండో వరుసలో మెట్రోమార్గం నిరి్మంచాలనే ఆలోచనలో అధికారులున్నారు. దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్లే మెట్రో మార్గంలోనూ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాల్లో డబుల్డెక్కర్గా నిర్మాణాలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇలా మెట్రో రెండోదశ మార్గాల్లో జీహెచ్ఎంసీ కొత్త ఫ్లై ఓవర్లు నిరి్మంచాల్సిన ప్రాంతాల్లో ‘డబుల్’ డెక్కర్ ఆలోచనలు చేస్తున్నారు. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే జంక్షన్లలో ఒకటైన పంజగుట్ట ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద ఒక ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఐటీ కారిడార్ల నుంచి జూబ్లీహిల్స్ వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో వేగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు వస్తున్న వాహనాల వేగం అక్కడి నుంచి మందగిస్తోంది. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్దకొచ్చేటప్పటికి ఇది మరింత తీవ్రమవుతోంది. దీంతో ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చట్నీస్ దగ్గర నుంచి జలగం వెంగళ్రావు పార్కు వరకు వన్‌వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఐటీ కారిడార్ల నుంచి బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నంల వైపు వెళ్లే వారికి ఈ ఫ్లైఓవర్ వల్ల సాఫీ ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. -
జీబీలకు జీబీలు వాడేస్తున్నారు!
స్వాతి వైజాగ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తాజా ట్రెండ్స్ చూసేందుకు గంటల కొద్దీ సమయం గడుపుతుంది. ఇక రాయ్‌పూర్‌లో ఉబెర్ ఆటో డ్రైవర్ కిశోర్ సాహు అయితే సిటీలో తిరిగే 12 గంటల్లో యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌లోనే మునిగితేలుతాడు. రోజువారీ మొబైల్ డేటా లిమిట్ 1.5–2 జీబీ డేటా అయిపోతే, మళ్లీ డేటా టాపప్ కూడా చేస్తాడు. చిన్న నగరాల్లో సైతం డేటా వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే!4జీ.. 5జీ పుణ్యమా అని దేశంలో మొబైల్ డేటా వాడకం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇదేదో మెట్రోలు, బడా నగరాలకే పరిమితం అనుకుంటే పొరబాటే! ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు డేటా వాడకంలో మెట్రోలను మించిపోతుండటం విశేషం. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలు ‘టాప్’లేపుతున్నాయి. ఇక్కడ యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 38–42 జీబీగా ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇది 30–42 జీబీ మాత్రమే కావడం గమనార్హం. అప్పుడైతే పీక్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఇతరత్రా ముఖ్యమైన క్రీడా ఈవెంట్ల సమయంలో అయితే డేటా వాడకం పీక్స్‌కు వెళ్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు నెలవారీ వినియోగం 50–58 జీబీలను తాకుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అధిక రోజువారీ డేటా ఉండే ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవడమే కాకుండా.. డేటా టాపప్‌లు కూడా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయట! సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, షోలు, గేమ్ స్ట్రీమింగ్‌తో పాటు క్రీడా ఈవెంట్లు దేశంలో డేటా వినియోగానికి బూస్ట్ ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చౌక స్మార్ట్ ఫోన్లు, డేటా రేట్లు దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. 2029 నాటికి మనమే టాప్... అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ అంచనా ప్రకారం 2023లో భారత్‌లో ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా విని యోగం 29 జీబీలుగా ఉంది. నోకియా మాత్రం దీన్ని 24.1 జీబీగా అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో 21.1% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది. కాగా, 2029 నాటికి నెలవారీ సగటు వాడకం 68 జీబీకి చేరుతుందని, చైనాను సైతం అధిగమించి డేటా వాడకంలో భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని ఎరిక్సన్ చెబుతోంది.జీడీపీకి దన్నుపెద్ద నగరాల్లో ఇంట్లో, ఆఫీసుల్లో వైఫై బాగా అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, పీసీల్లో వైఫై డేటాతోనే పనైపోతుంది. అయితే ద్వితీయ శ్రేణి మార్కెట్ల విషయానికొస్తే యూజర్లు ఎక్కువగా డేటా ప్యాక్‌లపైనే ఆధారపడుతున్నారని, అక్కడ మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగేందుకు ఇది కూడా కారణమని టెలికం కన్సల్టెంట్, నెట్వర్క్ స్పెషలిస్ట్ పరాగ్ కర్ చెప్పారు. కాగా, టెలికం కంపెనీలకు మాత్రం ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020–21లో ఒక్కో జీబీ డేటాపై రూ.10.82 చొప్పున ఆదాయం లభించగా, 2023–24లో ఇది రూ.9.12గా తగ్గిందని ట్రాయ్ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క, మొబైల్ కనెక్టివిటీ పెరగడం, బ్రాండ్‌బ్యాండ్ విస్తరణ వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు ఎకానమీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు గ్లోబల్ టీఎంటీ కన్సలి్టంగ్ సంస్థ ఎనాలిసిస్ మేసన్‌కు చెందిన అశ్విందర్ సేథి చెప్పారు.అత్యధిక మొబైల్ డేటా వినియోగ మార్కెట్లు: తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు50-58జీబీ : గ్రామీణ, పట్టణ మార్కెట్ రెండింటిలో గరిష్ట స్థాయి (పీక్) నెలవారీ వినియోగంప్రతి 10%: బ్రాడ్‌బ్యాండ్ విస్తరణతో జీడీపీ 1% వృద్ధి చెందుతుందని అంచనా సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, గేమ్ స్ట్రీమింగ్: డేటా వాడకం జోరుకు ప్రధాన కారణం– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెట్రోలో మహిళలు
రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రోలో కూర్చునేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతుంటారు. సీటు కోసం వాదులాడుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం అనేది ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి.తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడటానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో.. మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయివుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది.అది కొట్టుకోవడం వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం మరింతగా పెరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట కూడా జరిగింది. కొద్దిసేపటి తరువాత మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో ఆ మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ సమయంలో ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మెట్రోలో కేజ్రీవాల్‌కు బెదిరింపు మెసేజ్ రాసిన బ్యాంకర్ అరెస్ట్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మెట్రోలో బెదిరింపు సందేశాలు రాసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని పేరు అంకిత్ గోయల్. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దానిలో నిందితుడు బెదిరింపు సందేశం రాస్తూ కనిపించాడు. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు బరేలీ వాసి అని, ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को सरेआम दी जा रही जान से मारने की धमकी ‼️PMO, BJP और नरेंद्र मोदी के इशारे पर राजीव चौक, पटेल नगर मेट्रो स्टेशन पर लिखी गई धमकी।अरविंद केजरीवाल जी को कुछ भी होता है तो इसके लिए सीधे तौर पर बीजेपी और नरेंद्र मोदी ज़िम्मेदार होंगे। pic.twitter.com/vbbybDFSfJ— AAP (@AamAadmiParty) May 20, 2024 నిందితుడు అంకిత్ గోయల్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అతను మానసికంగా బాగానే ఉన్నాడని, గతంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా జరిగిన పలు ర్యాలీలలో కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో కేజ్రీవాల్‌పై నిందితుడు ఆంగ్లంలో సందేశం రాశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాతలకు బీజేపీనే కారణమని ఆరోపించింది. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #WATCH | Police arrest accused Ankit Goyal, 33 for writing death-threatening graffiti against Delhi CM Arvind Kejriwal at a metro station. The Metro Unit of Delhi Police had registered an FIR and was investigating the matter: Delhi Police (CCTV visuals confirmed by Police) pic.twitter.com/p0Z8D1h16c— ANI (@ANI) May 22, 2024 -
ఢిల్లీ మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వార్తా సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన వీడియోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చుట్టూ భద్రతా అధికారులు నిలుచుని ఉన్నారు. మెట్రో నిర్వహణ గురించి డీఎంఆర్సీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ముర్ముకు తెలియజేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. #WATCH | President Droupadi Murmu takes a metro ride in Delhi. pic.twitter.com/Elc2pdUmHJ — ANI (@ANI) February 7, 2024 -
ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 515 మంది గాయపడ్డారు. 102 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే బీజింగ్‌లో మెట్రో రైళ్లు క్షణం గడువు లేకుండా నడుస్తుంటాయి. నగరంలో 27 రైల్వే లైన్లలో ప్రతిరోజూ 13 మిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రెండు నిమిషాలకో రైలు నడుస్తుంది. బీజింగ్‌లో శుక్రవారం భారీగా మంచు కురిసింది. రైల్వే ట్రాక్‌లు తడిసి ఉన్నాయి. ఈ క్రమంలో సబ్వే వద్ద ఓ రైలు బ్రేక్ వేసింది. వెనకనే వస్తున్న రైలు బ్రేక్ వేయడంలో విఫలమైన నేపథ్యంలో రెండు రైళ్లు ఢీ కొన్నాయని బీజింగ్ మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడిపోయామని స్థానికులు తెలిపారు. కొందరు ఎముకలు విరిగి ఆర్తనాదాలు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 515 మంది గాయపడగా ఆస్పత్రికి తరలించారు. 102 మందికి ఎముకలు విరిగి పరిస్థితి తీవ్రంగా ఉందని వెైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి -
ఓటు పట్టని మెట్రో
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపాలిటీ.. ఎన్నికలేవైనా అర్బన్ ప్రజలలో ఎక్కువ శాతం ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఎన్నికల రోజున నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఇంట్లోనో, మరోచోటో సెలవును ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. గత రెండు శాసనసభ ఎన్నికల నుంచి ముంబై మినహా అన్ని మెట్రో నగరాల్లోనూ పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల ప్రాముఖ్యత, ఓటు హక్కు గురించి ఎంతగా ప్రచా రం చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. పెరిగిన అర్బన్ ఓటర్లు 1951–52లో దేశంలో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికలలో 17.3 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా.. ఇందులో 17 శాతం ఓటర్లు మాత్రమే పట్టణాలలో నివసించేవారు. కాలక్రమేణా ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస రావడం పెరిగింది. ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం, మెరుగైన జీవనశైలి వంటి రకరకాల కారణాలతో పట్టణాలకు వస్తూ స్థిరపడిపోతున్నారు. దేశంలో 543 లోక్‌సభ స్థానాలుండగా.. 100 స్థానాలలో పట్టణ జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్‌లోనే తక్కువ దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదవుతోంది. హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ, జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోలింగ్ 50 శాతం కూడా మించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. 2009లో 58 శాతం, 2014లో 53, 2018లో 50.86 శాతం పోలింగ్ నమోదయింది. తాజా ఎన్నికలలో భాగ్యనగరంలోని 15 నియోజకవర్గాలలో నమోదైన పోలింగ్ కేవలం 46.65 శాతమే కావడం గమనార్హం. నగరంలోని యాకుత్‌పురాలో 39.6 శాతం పోలింగ్ నమోదు కావడం శోచనీయం. ఈ ఏడాది మేలో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బెంగళూరు అర్బన్‌లో 54.6 శాతం పోలింగ్ జరిగింది. 2018లో ఇది 56 శాతంగా ఉంది. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలో 59.06 శాతం పోలింగ్ జరిగింది. ఎందుకిలా..? నిర్లిప్తత, నిర్లక్ష్యం, సెలవు రోజును ఇతర పనులకు ఉపయోగించుకోవాలనే అభిప్రాయం, సరదాగా గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి కారణాలతో పాటు.. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండటం కూడా పోలింగ్ శాతం తగ్గడానికి ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతూరు, పనిచేసే ప్రాంతం రెండు చోట్లా ఓటు ఉన్న అర్బన్ ఓటర్లు ఎన్నికల రోజున వివిధ కారణాలతో సొంతూళ్లకు తరలిపోవడంతో అర్బన్ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తగ్గుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి రావడం వల్ల కూడా అర్బన్ ఓటర్లు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏం చేయాలి మరి? ♦ ఓటు వేసిన వారికి మాత్రమే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. ♦ అర్బన్ ప్రాంతాలలో ఒకరికి ఒకచోటే ఓటు హక్కు ఉండేలా చూడాలి. ♦ ఓటర్లకు సాధ్యమైనంత చేరువలోనే పోలింగ్ కేంద్రం ఉండాలి. ♦ పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలి. పొడవాటి క్యూలు నివారించాలి. ♦ క్యూలైన్, పోలింగ్ సరళి సమాచారం ఓటర్లకు మెసేజ్ రూపంలో ఇవ్వాలి. ♦ పోలింగ్ బూత్‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను ఓటర్లకు పంపించాలి. -
మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు!
ఐటీ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరులో.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసినా తోటి ప్రయాణికులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితుడు జనంలో కలిసిపోయి, తేలిగ్గా అదృశ్యమయ్యాడు. బాధితురాలి ఫ్రెండ్ ఈ హృదయ విదారక సంఘటనను సోషల్ మీడియా ప్లాట్ఫారం రెడ్డిట్‌లో షేర్ చేశారు. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన స్నేహితురాలు కళాశాలకు రోజూ బస్సులో వెళతారని, అయితే ఆమె సోమవారం (నవంబర్ 20) మెట్రోలో ప్రయాణించారన్నారు. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్‌లోని మెట్రోలో జనం ఎక్కువగా ఉన్నారని, దీంతో తోపులాటలు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత, నా స్నేహితురాలికి అసౌకర్యంగా అనిపించింది. ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తి ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. అతను ఆమెను అసభ్యంతా తాకడంతోపాటు గోర్లతో ఆమెను గుచ్చాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అయినా తోటి ప్రయాణికులెవరూ పట్టించుకోలేదు. ఇంతలో అతను పారిపోయాడని ఆ ఫ్రెండ్ పోస్ట్‌లో రాశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు యూజర్స్ స్పందిస్తూ , తమకు తోచిన సలహాలిస్తున్నారు. ఒక యూజర్ తాను మెట్రోలోనే పనిచేస్తున్నానని, మెట్రో అంతటా సీసీటీవీ నిఘాలో ఉన్నందున చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారన్నారు. ఈ వేధింపుల విషయమై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా అతను సహాయం అందిస్తాడని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడి ఎంట్రీ.. ఆ తర్వాత..
ఢిల్లీ: వివాదాలతో, చిత్రవిచిత్రాలతో తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఘటన జరిగింది. అసభ్య డ్యాన్సులు, ఫైటింగ్‌లు, వైరల్ కావడానికి కొందరు చేసే పిచ్చి పనులతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం కఠిన నిబంధనలు విధించింది. మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. మహిళ విభాగంలోకి పురుషులకు అనుమతి ఉండదు.. అయినప్పటికీ నియమాలను ఉల్లంఘిస్తూ వెళ్లడంపై రైలులో ఓ యువతి ప్రశ్నించింది. యువకునికి తోడుగా వచ్చిన మరో మహిళ.. ఆ యువతిపై దురుసుగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ కొట్టేంత పని చేసింది. Kalesh b/w Ladies and a Guy over He Stepped up Into ladies Coach in Delhi Metro pic.twitter.com/wzks795oqW — Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ, యువకుడిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే.. తాను తోడుగా ఉన్న మహిళకు సహాయంగా మాత్రమే మహిళల విభాగంలోకి వెళ్లానని, అంతకు మించి వేరే ఉద్దేశం లేదని ఆ యువకుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: 'విక్రమ్ ల్యాండర్ నేనే తయారు చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి.. -
మెట్రోలో జిమ్నాస్టిక్ స్టైల్లో యువతి స్టంట్స్.. వీడియో వైరల్..
నగరాల్లో వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి మెట్రో ప్రయాణం సులభతరం. అలాంటి మెట్రోలో డ్యాన్సులు చేస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి మెట్రోలో ఏదో ఒక విచిత్రమైన పని చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. మెట్రో ప్రయాణీకులతో రద్దీగా ఉంది. కొందరు ప్రయాణీకులు నిలబడి ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఓ యువతి జిమ్నాస్టిక్ స్టైల్లో స్టంట్స్ చేసింది. ఎంతో నైపుణ్యం కలిగినట్లుగా చాకచక్యంగా ప్రదర్శన ఇచ్చింది. ఈ దృశ్యాలను చూస్తున్న ప్రయాణికులు కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. యువతి ప్రదర్శన చేస్తుండగా.. మరో వ్యక్తి ఫొన్లో ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు. View this post on Instagram A post shared by MISHA SHARMA 🇮🇳 (@mishaa_official_) ఈ వీడియోను మిశా శర్మా అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇది కాస్త వైరల్ అయింది. 5.2 లక్షల వ్యూస్ వచ్చాయి. 45 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలోని ఘటన ఎక్కడ జరిగిందని పలువురు నెటిజన్లు ప్రశ్నలు వేయగా.. ఓ వ్యక్తి రాజస్థాన్ అని తెలపారు. దీనిపై మరో యూజర్ స్పందిస్తూ.. బెంగళూరులో జరిగిందని వెల్లడించారు. ఆ వీడియో తీసే క్రమంలో తాను మెట్రోలోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇండియా తరుపన ఆడితే మెడల్ తేవొచ్చు.. ఇక్కడ చేస్తూ టైం వేస్టు చేయొద్దని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
మెట్రోలు, హిల్ స్టేషన్లకే మొగ్గు
ముంబై: దేశీయంగా మెట్రో నగరాలు, హిల్స్టేషన్లతో కూడిన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలలపై ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ‘బుకింగ్ డాట్ కామ్’ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, మనాలీ, రిషికేశ్, వారసత్వ సంపదకు నిలయమైన జైపూర్ తదితర ప్రాంతాలను ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా చూస్తే, దుబాయి, బ్యాంకాక్, లండన్, సింగపూర్, కౌలాలంపూర్, హోచిమిన్హ్, ప్యారిస్, హనోయ్ ప్రాంతాలను సందర్శించేందుకు భారత పర్యాటకులు ఎక్కువ మంది బుకింగ్ చేసుకున్నారు. హోటళ్లకు అదనంగా, రిసార్ట్లు, గెస్ట్ హౌస్‌లు, ఆతిథ్య గృహాలు పర్యాటకుల ప్రాధాన్యంగా ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎక్కువగా.. మొదటి ఆరు నెలల్లో యూఎస్, బంగ్లాదేశ్, రష్యా, యూఏఈని నుంచి ఎక్కువ మంది భారత్‌ను సందర్శించారు. అలాగే, విదేశీ పర్యాటకులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు మెట్రోలను ఎక్కువగా చూశారు. 86 శాతం భారత పర్యాటకులు వచ్చే 12 నెలల్లో తమ పర్యటనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘‘స్థూల ఆర్థిక సమస్యలను పర్యాటక రంగం ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. హోటళ్లే కాకుండా పర్యాటకులు ప్రత్యామ్నాయ ఆతిథ్యాలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు’’అని బుకింగ్ డాట్ కామ్ కంట్రీ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. -
మెట్రోలో యువకుని చెంప చెల్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్న ఘటన అనంతరం ప్రస్తుతం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మెట్రోలో ఓ యువతి ఓ యువకున్ని చెంప చెల్లుమనిపించింది. ఏమైందో తెలియదు.. కానీ యువకున్ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. మిగిలిన ప్రయాణికులు వారికి దూరంగా ఉండి చూస్తూ ఉండి పోయారు. Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) - Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem — Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023 మెట్రోలో ప్రయాణికులందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉన్న ఓ యువకుని వైపు దూసుకొచ్చి... అతని చెంప చెల్లుమనిపించింది. బూతులు తిడుతూ మరల యువకునిపై దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయింది. ఇదంతా చూస్తున్న జనాలు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలా భావించి దూరంగా ఉండిపోయారు. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్టు చేశాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. వ్యూయర్స్ రకరకాలుగా స్పందించారు. వారిద్దరి మధ్యలోకి చొరవ తీసుకోనందుకు తోటి ప్రయాణికులకు కొందరు ధన్యవాదాలు తెలిపారు. మెట్రోలో ఇలా ప్రవర్తిస్తే అందరికి ఇబ్బంది కలగదా? అని మరికొందరు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..! -
ఏపీలో మరో మెట్రో నగరం...
-
టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ప్రత్యేకతలివే..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
ఎల్పీజీ ధరలో నెంబర్–2, పాట్నా తర్వాత హైదరాబాద్ టాప్
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజానీకాన్ని బాదేస్తోంది. దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే గృహోపయోగ సిలిండర్ ధర విషయంలో నగరం రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆ తర్వాత మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా, లక్నో కంటే హైదరాబాద్‌లోనే ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ ధర అధికంగా ఉంది. విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న మహానగరానికి ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం దృష్ట్యా వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న కుటుంబాలతో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ వినియోగం బాగా పెరిగింది. అదే స్థాయిలో వాణిజ్య సిలిండర్లకు డిమాండ్ అధికమైంది. మార్కెట్ ధర ఇలా... మెట్రో నగరాల మార్కెట్‌తో పోల్చితే హైదరాబాద్ మార్కెట్లో సిలిండర్ రీఫిల్ ధర మండిపోతోంది. చమురు సంస్థలు రాష్ట్రానికోవిధంగా రవాణా దూరాన్ని బట్టి ధరను నిర్ణయించి అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.52 అధికంగా ఉంది. డొమెస్టిక్ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం మొత్తాన్ని భరించాల్సి వస్తోంది. ఐదు శాతం పన్నుల మోత వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్‌కు రవాణా, పన్నులు మరింత భారంగా మారాయి. చమురు సంస్థలు రవాణా, జీఎస్టీ పన్నులు కలుపుకొని ప్రస్తుత మార్కెట్ ధర అనుసరించి హైదరాబాద్‌లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ సరఫరాకు రూ.1,105 వసూలు చేస్తున్నాయి. వాస్తవంగా సిలిండర్ ధర రూ.1052.38 ఉండగా దానిపై సీజీఎస్టీ 2.5 శాతం కింద రూ.26.31, ఎస్జీఎస్టీ 2.5 శాతం కింద రూ. 26.31 పన్నుల భారం పడుతోంది. రవాణా చార్జీలను బట్టి.. చమురు సంస్థలు గ్యాస్ రవాణా దూరాన్ని బట్టి సిలిండర్ ధర నిర్ణయిస్తున్నాయి. హైదరాబాద్ నగరం కంటే ఎల్పీజీ ధర ఆదిలాబాద్‌లో రూ. 25 అధికంగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం కనీసం రూ. 20 నుంచి రూ. 27 వరకు అధికంగా ధర పలుకుతోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ టాప్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర కూడా మోత మోగిస్తోంది. ఢిల్లీ కంటే సుమారు రూ. 204 అధికంగా పలుకుతోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ రూ. 1973 ఉండగా, చెన్నైలో రూ. 1971, కోల్‌కతాలో రూ.1870 ఢిల్లీలో రూ. 1,769, ముంబయిలో రూ.1721 ప్రకారం ధర పలుకుతోంది. 28.21 లక్షలపైనే... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన చమురు సంస్థలకు సంబంధించి సుమారు 28.21 లక్షల గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త ఏడాదిలో మెట్రో చార్జీల మోత
-
హైదరాబాద్ : మెట్రో రైల్ రెండవ దశకు ముహూర్తం ఖరారు
-
వరంగల్ కు మహర్దశ..
-
నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్
ముంబై: సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిసిన ఉద్దవ్.. షిండే అసలైన సీఎం కాదని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం ముందుకెళ్లరాదని హెచ్చరించారు. ముంబైలోని సేన భవన్లో ఉద్దవ్ శుక్రవారం మాట్లాడుతూ.. మెట్రో కార్ షెడ్‌ను ఆరే కాలనీకి మార్చవద్దని కోరారు. ముంబై పర్యావరణాన్ని నాశనం చేయొద్దని సూచించారు. ‘నాకు ద్రోహం చేసినా పర్లేదు కానీ ముంబైకు ద్రోహం చేయకండి. నా మీద కోపాన్ని ముంబై ప్రజలపై చూపించొద్దు. మెట్రో షెడ్ ప్రతిపాదనను మార్చవద్దు. మేము అభివృద్ధికి అడ్డుపడటం లేదు కానీ ముంబైని వెనుకబాటు గురి చేయకుండా పాలించండి. ముంబై పర్యావరణంతో ఆటలాడకండి. పర్యావరణానికి హాని చేసే ఈ నిర్ణయం మంచిది కాదు. మేం దానికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించాం. పర్యావరణ సహితంగా నిర్ణయం తీసుకోండి నేడు సీఎం పదవిని బీజేపీ కాదనుకుంది. నేను రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాను. శివసేన, భాజపా ముఖ్యమంత్రి పదవిని సగం కాలం పంచుకోవాలని నాకు, అమిత్ షా అదే ఫార్ములా నిర్ణయించుకున్నాం. 2019లో కుర్చీల పంపకాన్ని ఎందుకు తిరస్కరించింది. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంది’ అని ఠాక్రే ప్రశ్నించారు. చదవండి: మహారాష్ట్ర: షిండే రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం.. ప్రాజెక్టు వివాదం ఏంటీ ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మించాలని అప్పట్లో ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు బీఎంసీ, మెట్రోరైల్ కార్పొరేషన్ అనుమతులు కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లు నరకాల్సి వస్తుంది. దీనిపై పర్యావరణ వేత్తలనుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. తర్వాత 2019లో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో లైన్ 3 కారిడార్ షెడ్‌ను ఆరే కాలనీలో నిర్మించడాన్ని వ్యతిరేకించింది. దీన్ని కుంజుర్‌మార్గ్‌కు మార్చాలని నిర్ణయం తీసుకుంది. అఘాడి ప్రభుత్వం ఆరే కాలనీని రిజర్వ్ అటవీ ప్రాతంగా గుర్తించింది. అయితే మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే మెట్రో కార్ షెడ్‌పై ఉద్దవ్ నిర్ణయాన్ని పక్కనపెట్టి తిరగి ఆరే కాలనీలో చేపట్టాలని నిర్ణయించారు. కంజుర్మార్గ్ నుంచి మళ్లీ ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్‌ను మారుస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు. -
సామాజిక భద్రతలో సిటీ భేష్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల కేసులు నిత్యం పెరుగుతున్నప్పటికీ.. వారి సామాజిక భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్లో పరిస్థితి కాస్త మెరుగేనని తాజా సర్వేలో వెల్లడైంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేసే మహిళల విషయానికి వస్తే సిటీలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని.. అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్అవే అనే రెంటల్ సంస్థ ఆన్లైన్ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేల్చింది. ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో మహిళా నెటీజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవారంగాల్లో పని చేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లు సాధించిన పుణె రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంది. మూడో స్థానంలో ఉన్న బెంగళూరు స్కోరు 3.9 పాయింట్లు. 3.4 పాయింట్లు సాధించిన ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచిందని ప్రకటించింది. జీవన వ్యయమూ అందుబాటులోనే.. నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్, మియాపూర్, కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇంటి అద్దెలు, హాస్టల్ రెంట్లు పనిచేసే మహిళలకు ఆర్థిక భారంగా పరిణమించడంలేదని వెల్లడించింది. పలు మెట్రో నగరాల్లో ఉద్యోగంచేసే ఒంటరి మహిళలు తమకు లభిస్తోన్న వేతనంలో 50 శాతం వరకు నివాస వసతి, భోజనం ఇతరత్రా జీవన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు తేలింది. ఇక వసతి విషయంలో హైదరాబాద్ నగరంలోని పలు హాస్టళ్లలో రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు లభ్యమవుతున్నాయని పేర్కొంది. పనిచేసే ప్రదేశానికి అయిదు లేదా పది కిలోమీటర్ల పరిధిలోని హాస్టళ్లు, ఇళ్లలో నివాసం ఉండేవారికి ఇతర అవసరాలకు చేసే జీవన వ్యయం కూడా అందుబాటులోనే ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడినట్లు వెల్లడించింది. నగరంలో ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఇంటి అద్దెలు మహిళలకు అందుబాటులో ఉన్నట్లు తేలింది. హాస్టళ్లలో ఉండే వసతులను బట్టి పురుషుల నుంచి వసూలు చేస్తున్న అద్దెలతో పోలిస్తే మహిళలు చెల్లిస్తున్న అద్దెలు కూడా వారికి ఏమాత్రం భారంగా పరిణమించడంలేదని.. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష ఎదుర్కోవడం లేదని పలువురు వర్కింగ్ ఉమెన్స్ అభిప్రాయపడ్డారని తెలిపింది. ఆయా నగరాల్లో జీవనవ్యయాలిలా... హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివాస వసతి పొందేందుకు ఒక మహిళ సగటున సుమారు రూ.6 నుంచి రూ.7 వేలు ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. పుణె నగరంలో సగటున రూ.8 నుంచిరూ.9 వేలు, బెంగళూరులో సగటున రూ.9 నుంచి 10వేలు, ఢిల్లీలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చుచేస్తున్నట్లు ఈసర్వే తెలిపింది. (చదవండి: రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు) -
హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.4.8 లక్షల ఇళ్ల యూనిట్లు నిర్మాణం పూర్తి కాకుండా నిలిపోయాయి. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మార్కెట్‌కు సంబంధించి నిర్మాణం కాకుండా నిలిచిపోయిన యూనిట్లు 11,450 యూనిట్లు కూడా ఉన్నాయి. వీటి విలువ రూ.11,310 కోట్లుగా ఉందని అనరాక్ నివేదిక వెల్లడించింది. పూర్తయినవి 2014, అంతకు ముందు సంవత్సరాల్లో ఆరంభమై, పూర్తికాని ప్రాజెక్టులను అనరాక్ ఈ నివేదికలోకి తీసుకుంది. వీటిల్లో ఈ ఏడాది జనవరి–మే మధ్య కాలంలో 36,830 యూనిట్లను బిల్డర్లు పూర్తి చేసినట్టు అనరాక్ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె పట్టణాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. ‘‘ఇలా నిలిచిన ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యంతో డెవలపర్లు ఉన్నారు. ప్రస్తుతం రెడీ టు మూవ్ ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను వారు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు’’అని అనరాక్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. నివేదికలోని అంశాలు.. - 2021 చివరికి నిర్మాణం కాకుండా నిలిచిన ఇలాంటి ఇళ్లు 5.17లక్షల యూనిట్లుగా ఉన్నాయి. - భారీ సంఖ్యలో ఇళ్ల ప్రాజెక్టులు నిలిచిపోయినందున.. పెద్ద డెవలపర్లు, ప్రభుత్వరంగ ఎన్బీసీసీ వాటిని తమ నిర్వహణలోకి తీసుకుని పూర్తి చేస్తున్నట్టు అనరాక్ తెలిపింది. - దీంతో 2022 జనవరి నుంచి మే వరకు 36,830 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. - అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల యూనిట్లలో 77 శాతం ఢిల్లీ ఎన్సీఆర్, ఎంఎంఆర్లోనే ఉన్నాయి. ఈ రెండు పెద్ద మార్కెట్లు కావడం గమనార్హం. - పుణెలో 9 శాతం, కోల్‌కతాలో 5 శాతం చొప్పున ఇళ్ల యూనిట్లు నిర్మాణం కాకుండా ఉన్నాయి. - దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో నిర్మాణం కాని యూనిట్లు మొత్తం యూనిట్లలో 9 శాతంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్.. 2014, అంతకుముందు నిర్మాణం ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాని ఇళ్లు హైదరాబాద్‌లో 11,450 యూనిట్లు కాగా, వీటి విలువ రూ.11,310 కోట్లు. 2021 డిసెంబర్ నాటికి ఇలాంటి యూనిట్లు 13,160 ఉండగా, వీటి విలువ రూ.12,995 కోట్లుగా ఉంటుందని అనరాక్ నివేదిక తెలిపింది. వీటిల్లో 2022 జనవరి నుంచి మే మధ్య 1,710 యూనిట్ల నిర్మాణాన్ని డెవలపర్లు పూర్తి చేశారు. చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? -
హైదరాబాద్‌లో ఇళ్ల రేట్లు రయ్...
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు గణనీయంగా 7 శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది మెట్రో నగరాల్లో 2021 సంవత్సరంలో ఇళ్ల ధరలు 3–7 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్‌టైగర్.కామ్ రూపొందించిన ‘రియల్ ఎస్టేట్ ఇన్సైట్ రెసిడెన్షియల్ – యాన్యువల్ రౌండప్ 2021’ నివేదిక తెలియజేసింది. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్ తదితర రేట్లు పెరగడమే ఇళ్ల ధరల వృద్ధికి దారితీసినట్టు పేర్కొంది. గతేడాది హైదరాబాద్ మార్కెట్లో 22,239 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 36 శాతం వృద్ధి నమోదైంది. నివేదికలోని అంశాలు.. ► ఎనిమిది నగరాల్లో ఇళ్ల విక్రయాలు 2021లో 13 శాతం పెరిగి 2,05,936 యూనిట్లుగా ఉన్నాయి. 2020లో విక్రయాలు 1,82,639 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ► కొత్తగా ఆరంభించిన ఇళ్ల యూనిట్లు 75 శాతం పెరిగి 2.14 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు 7 శాతం పెరగ్గా, బెంగళూరులో 6 శాతం, పుణేలో 3 శాతం, ముంబైలో 4 శాతం, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా మార్కెట్లలో 5 శాతం చొప్పున ధరలు 2021లో పెరిగాయి. ► బెంగళూరు మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 24,983 యూనిట్లుగా ఉన్నాయి. ► చెన్నై మార్కెట్లో 25 శాతం వృద్ధితో 13,055 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్లో ఒక శాతమే పెరిగి 17,907 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతా మార్కెట్లో 9% వృద్ధితో 9,896 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ముంబైలో 8 శాతం పెరిగి 58,556 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► పుణేలో 9% మేర విక్రయాల్లో వృద్ధి నమోదైంది. 42,425 ఇళ్లు విక్రయమయ్యాయి. ధరలు ఇంకా పెరుగుతాయి 55% మంది కొనుగోలుదారుల అభిప్రాయం సీఐఐ అనరాక్ సర్వే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలే కాదు.. కొనుగోలుదారులూ అభిప్రాయపడుతున్నారు. నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్.. సీఐఐతో కలసి వినియోగదారుల అభిరుచులపై ఒక సర్వే నిర్వహించింది. 2021 జూలై నుంచి డిసెంబర్ మధ్య ఈ సర్వే జరిగింది. ఈ వివరాలను అనరాక్ వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 5,210 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిర్మాణ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతాయని అంచనాతో ఉన్నట్టు 55 శాతం మంది చెప్పారు. అయితే ధరలు పెరగడం 10 శాతం లోపు ఉంటే డిమాండ్‌పై మోస్తరు నుంచి, తక్కువ ప్రభావమే ఉంటుందని.. 10 శాతానికి మించి పెరిగితే మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్‌పై గట్టి ప్రభావమే చూపిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. రియల్ ఎస్టేట్‌ను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నవారి సంఖ్య 2021 తొలి ఆరు నెలల్లో 54 శాతంగా ఉండగా, ద్వితీయ ఆరు నెలల్లో 57 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో వడ్డీ రేట్లు పెరగడం కొనుగోళ్ల వ్యయాన్ని పెంచుతుందన్న అంచనా వ్యక్తం అయింది. ఇంటి యజమానులు కావాలన్న ధోరణిలోనూ పెరగుదల కనిపించింది. 63 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ 2021 ద్వితీయ ఆరు నెలల్లో 40% నుంచి 27 శాతానికి తగ్గింది. 32% మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. -
జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూన్‌తో పోలిస్తే జూలైలో నియామకాలు 4 శాతం పెరిగాయని మాన్స్టర్.కామ్ వెల్లడించింది. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. గతేడాదితో పోలిస్తే జూలైలో జాబ్ పోస్టింగ్స్ 8 శాతం అధికమయ్యాయి. 2021 జూన్‌తో పోలిస్తే గత నెలలో ట్రావెల్, టూరిజం విభాగంలో 16 శాతం, షిప్పింగ్, మెరైన్ 14, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఆటోమేషన్ 9, రియల్ ఎస్టేట్‌లో నియామకాలు 9 శాతం పెరిగాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో 8 శాతం, హైదరాబాద్, పుణే 7, చెన్నై 6, బెంగళూరులో 6 శాతం అధికమయ్యాయి. 0–3 ఏళ్ల అనుభవం కలిగిన ఎంట్రీ లెవెల్ ఉద్యోగ నియామకాలు 5 శాతం పెరిగాయి. మధ్యస్థ (4–6), మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ (7–10) కోసం నియామకాలు 7 శాతం పెరిగితే, సీనియర్ ప్రొఫెషనల్స్ (11–15) కోసం 4 శాతం అధికం అయ్యాయి. టాప్ మేనేజ్మెంట్ కోసం నియామకాలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో సానుకూల వాతావరణం ఉంటుందనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ అని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రాచెల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి : బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు -
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో మూడవ స్టోర్, ఎక్కడంటే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపార దిగ్గజం మెట్రో క్యాష్ అండ్ క్యారీ తాజాగా గుంటూరులో స్టోర్‌ను ఏర్పాటు చేసింది. 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నెలకొంది. 9,000 పైచిలుకు రకాల ఆహార, ఆహారేతర ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థకు ఇది మూడవ కేంద్రం కాగా, దేశవ్యాప్తంగా 30వ ఔట్లెట్. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఏపీలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో స్టోర్స్ ఉన్నాయి. దక్షిణాదిన కంపెనీ ఔట్లెట్ల సంఖ్య 14కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. -
దేశవ్యాప్తంగా ఉత్తమ సిటీగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: సుందర నగరి, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన మహా విశాఖ మెట్రో నగరాల సరసన నిలిచింది. దేశవ్యాప్తంగా ఉత్తమ నివాస యోగ్య నగరాల జాబితాలో 15వ స్థానం సాధించింది. రాష్ట్రం నుంచి ఈ క్యాటగిరీలో టాప్ 20లో నిలిచిన ఏకైక నగరంగా మెరిసింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 111 నగరాలతో పోటీ పడిన విశాఖ 15వ స్థానం సాధించగా విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్–2020’ పేరుతో గురువారం ఈ ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో విశాఖపట్నం 15వ స్థానం దక్కించుకుంది. సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితులను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. ఇందులో 15 కేటగిరీల్లో 78 సూచీలను విభజించి సర్వే నిర్వహించారు. ఇనిస్టిట్యూషనల్, భౌతిక పరిస్థితుల పరంగానూ విశాఖ నగరం మంచి ర్యాంకు సాధించింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో మొత్తం 100 పాయింట్లకు గాను 57.28 పాయింట్లు సాధించింది. 2018లో విడుదల చేసిన ర్యాంకుల్లో విశాఖ 17వ స్థానంలో నిలవగా ఈసారి రెండు ర్యాంకుల్ని మెరుగుపరచుకుంది. మున్సిపల్ పెర్ఫార్మెన్స్లో 9వ ర్యాంకు... ఇక 10 లక్షలకుపైగా జనాభా కేటగిరీలో మున్సిపల్ పెర్ఫార్మెన్స్ విభాగంలో 52.77 పాయింట్లుతో విశాఖ నగరం 9వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుల్ని 2020 ఆగస్టులో ప్రకటించాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. 2020 నుంచి విశాఖ నగరం వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2018–19లో 23వ స్థానంలో నిలిచిన విశాఖ నగరం 2019–20లో 14 ర్యాంకుల్ని మెరుగు పరచుకొని 9వ ర్యాంకులోకి దూసుకెళ్లింది. 2019లో స్మార్ట్ సిటీ నగరాల జాబితాలో 9వ ర్యాంకులో ఉండగా.. 2020లో టాప్–7లో నిలిచింది. తాజాగా నివాస యోగ్య నగరాల జాబితాలోనూ విశాఖ నగరం ర్యాంకుని మెరుగు పరచుకుంది. వివిధ విభాగాల్లో విశాఖ దూసుకెళ్లిన విధానాన్ని ఓసారి పరిశీలిస్తే... ఈజ్ ఆఫ్ లివింగ్... – ఓవరాల్ ర్యాంకు – 15 – సస్టైన్‌బులిటీ విభాగంలో 65.18 మార్కులతో 2వ స్థానం – ఎకనమిక్ ఎబిలిటీలో 19.42 మార్కులతో 18వ స్థానం – ప్రజావగాహన(సిటిజన్ పర్సిప్షన్)లో 77.20 మార్కులతో 23వ స్థానం – జీవన ప్రమాణాల విభాగంలో 51.93 మార్కులతో 25వ స్థానం మున్సిపల్ పెర్ఫార్మెన్స్.... ఓవరాల్ ర్యాంకు– 09 – ప్లానింగ్ విభాగంలో 71.81 మార్కులతో 1వ స్థానం – సేవలందించే విభాగంలో 63.35 మార్కులతో 8వ స్థానం – ఆర్థిక స్థితిగతుల విభాగంలో 59.87 మార్కులతో 11వ స్థానం – టెక్నాలజీ వినియోగంలో 34.64 మార్కులతో 12వ స్థానం – గ్రీవెన్స్ విభాగంలో 29.13 మార్కులతో 49వ స్థానం తిరుపతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి – మున్సిపల్ పర్ఫామెన్స్లో 2వ ర్యాంకు తిరుపతి తుడా: ఆథ్యాత్మిక నగరం తిరుపతికి మరో గౌరవం దక్కింది. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయ స్థాయిలో తిరుపతి రెండో ర్యాంకు సాధించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఇదే కేటగిరీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆథ్యాత్మిక నగరానికి దక్కిన ఈ గుర్తింపు పట్ల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష సంతోషం వ్యక్తం చేశారు. -
ఆగ్రా మెట్రోని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రా మెట్రో రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తొలి విడతగా మూడు మెట్రో స్టేషన్లను ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖులు పాల్గొంటారని ఆగ్రా జిల్లా మెజిస్టే్ట్ ఎన్ ప్రభుసింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. తొలివిడతలో తాజ్‌ఈస్ట్‌గేట్, బసాయ్, ఫతేహాబాద్ రోడ్డు స్టేషన్లు ఉన్నాయి. రూ.273 కోట్లతో ఫతేహాబాద్ 26 నెలల్లో పూర్తవుతుందని అంచనా. కేంద్ర క్యాబినెట్ మెట్రో ప్రాజెక్ట్‌కి ఫిబ్రవరి 28, 2019లోనే ఆమోదం తెలిపింది. అనుకూలమైన అర్బన్, సిటీ ప్రాంతాల్లో మొదటగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజారవాణాకు అనుగుణంగా షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాలను ఎంచుకుని తోలి విడతలో ఫతేహాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీఆర్పీ ప్రకారం రెండు కారిడార్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాయి. నగరంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాలైనా తాజ్‌మహల్, ఆగ్రాపోర్ట్, ఎత్మదుల్లా, సికింద్రాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉన్నాయి. మొత్తం నగరంలో 27 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. నగరంలో29.4 కి.మీ మేర మెట్రో రైల్వే కారిడార్‌ను నిర్మించనున్నారు. -
కోలుకుంటున్న మెట్రో నగరాలు..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి మెట్రో నగరాలు క్రమంగా కోలుకుంటున్నాయి. కరోనా క్రీనీడ నుంచి బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతి ఉన్న గత నెలలతో పోల్చితే అక్టోబర్‌లో మెట్రోనగరాల్లో జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అవకాశాలు సంబంధిత కార్యకలాపాలు (హైరింగ్ యాక్టివిటీస్) ఐదు శాతానికిపైగా పెరిగినట్టు జాబ్ పోర్టల్ ‘స్కై కీ’(ఎస్సీఐ కేఈవై) తాజా నివేదికలో వెల్లడైంది. పండుగల సీజన్‌తోపాటు కోవిడ్ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నా భారత్‌లోని మెట్రో నగరాల్లో హైరింగ్ యాక్టివిటీస్, జాబ్ పోస్టింగ్‌లు సెపె్టంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో 5.55 శాతం పెరిగినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశంలోని వివిధ రంగాలు నెమ్మదిగా పట్టాలెక్కి కరోనాకు పూర్వస్థితిని చేరుకునే దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైరింగ్ యాక్టివిటీస్ ఏ నెలకు ఆ నెలకు పెరుగుతూ వస్తున్నట్టు, రాబోయే నెలల్లో ఇది మరింత పుంజుకోనున్నట్టు ‘స్కై కీ’సహ వ్యవస్థాపకుడు అక్షయ్ శర్మ స్పష్టం చేశారు. పుంజుకుంటున్న ఐటీ రంగం కోవిడ్ మహమ్మారి కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం మరింత పుంజుకుంటోంది. ఈ రంగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జాబ్ పోస్టింగ్‌లు పెరుగుతున్నాయి. సుదీర్ఘ లాక్డౌన్ విధింపు కారణంగా ఐటీ సెక్టార్‌తోపాటు దాదాపుగా అన్ని రంగాల్లో ‘వర్క్ ఫ్రం హోం’ పనివిధానాన్ని ప్రవేశపెట్టడం కూడా ఐటీ, దాని ఆధారిత సేవల రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రధానంగా టెలికం సెక్టార్లో హైరింగ్ యాక్టివిటీస్ పెరగడానికి ఇంటి నుంచి పనిచేసే పద్ధతి దోహదపడినట్టు ఈ రిపోర్ట్ తెలిపింది. సేల్స్, స్ప్రింగ్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్స్, ఆటోమేషన్ టెస్టింగ్, మైక్రో సర్వీసెస్‌లలో జాబ్ పోస్టింగ్స్ అవకాశాలు వృద్ధి చెందినట్టు ఈ నివేదిక వెల్లడించింది. (చదవండి: నిరుద్యోగ యువతకు ఊరట..) ముందంజలోని రంగాలు ఇవే... రంగాలవారీగా చూస్తే వివిధ రంగాలకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్లలో హైరింగ్ యాక్టివిటీస్ గణనీయంగా పెరిగాయి. ఈ కామర్స్, ఫార్మాసూటికల్స్, ప్యాకేజింగ్, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్, కన్సల్టింగ్, ఐటీ సర్వీసెస్, రెన్యువబుల్ ఎనర్జీ, హాస్పాటాలిటీతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగాలు ఉద్యోగ అవకాశాల కల్పన, హైరింగ్ యాక్టివిటీస్‌లో అగ్రభాగాన ఉన్నట్టుగా ‘స్కై కీ’నివేదిక స్పష్టం చేసింది. -
ఒడిసి పట్టు.. మునగదు ఒట్టు!
సాక్షి, హైదరాబాద్: ఏటా సెప్టెంబర్‌లో 5 సెం.మీ. వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నిండా మునుగుతోంది. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు గ్రేటర్ మునకకు అన్నే కారణాలున్నాయి. వందకుపైగా ముంపు ప్రాంతాలున్నాయి. ఇటీవల కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు రావడంతో దారులు ఏరులను తలపిం చాయి. వరద కారణంగా వాహనదారులు విలవిల్లాడారు. నగరంలో 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించిన మురుగునీటి కాల్వలు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటి సామర్థ్యం సరిపోవడంలేదు. పలు చోట్ల మురుగునీటి పైపులైన్లలో నిర్మాణ వ్యర్థాలు పోగుపడటంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతున్నాయి. అలాగే 1,500 కి.మీ. మేర విస్తరించిన నాలాలపై సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జడివాన కురిసిన ప్రతిసారి జనం బయటకు రావద్దని బల్దియా హెచ్చరికలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ముంపు సమస్య ఇలా... నగరంలో ఏటా నమోదవుతున్న వర్షపాతంలో సింహభాగం ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతూనే ఉంది. రామంతాపూర్, భండారీ లే అవుట్, నందీకాలనీ.. లాంటి ప్రాంతాలు నీటమునగడం సర్వసాధారణంగా మారింది. ఈ వరద ముప్పును తప్పించేందుకు చక్కటి ప్రత్యామ్నాయం ఉందని ఐఐటీ బాంబే నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని పదిలంగా ఒడిసిపట్టడమే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేసింది. ఇలా చేస్తే ముంపు నుంచి విముక్తి.. గ్రేటర్ విస్తీర్ణం 625 చ.కి.మీటర్లు. నివాసాల సంఖ్య సుమారు 25 లక్షలు. ఏటా నమోదయ్యే వర్షపాతం 800–1000 మిల్లీమీటర్లు. ఏడాదికి సుమారు 50–90 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో 25 లక్షల నివాసాలపై కురిసిన వర్షపు నీటిని వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఇంకుడు గుంతలు తవ్వి నిల్వ చేస్తే 43 శాతం ముంపు ముప్పు తప్పుతుందని ఐఐటీ బాంబే నిపుణుల బృందం స్పష్టం చేసింది. కనీసం ఇంటికి 500 లీటర్ల మేర వర్షపు నీటిని నిల్వ చేసినా.. 35 శాతం వరదముప్పు తప్పుదుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 200 లీటర్ల నిల్వచేస్తే 22 శాతం.. ఇంటికి వంద లీటర్లయినా నిల్వచేస్తే 11 శాతం ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడించింది. నేలలోకి ఇంకితే.. నగరంలోని ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో... కాంక్రీట్, టైల్స్, బండరాళ్లతో కప్పివేయకుండా మధ్యలో ఖాళీ స్థలాలు వదిలిపెడితే వర్షపు నీరు నేలలోకి ఇంకుతుందని.. వరద తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. సుమారు 185 చెరువుల్లోకి వరద నీటిని చేర్చే ఇన్ ఫ్లో చానల్స్, నాలాలను ప్రక్షాళన చేస్తే ముంపు నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని, వాటిల్లో నీటి మట్టం కూడా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. కాగితాలపైనే కిర్లోస్కర్ నివేదిక.. నగరానికి ముంపు సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు 2003లో నివేదిక అందించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అలాగే 2007 గ్రేటర్ మొత్తానికీ సమస్య తీరేందుకు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్ .. సూక్ష్మస్థాయి వరద నీటి పారుదల నెట్వర్క్ ప్లాన్ .. మేజర్, మైనర్ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు’(డీపీఆర్) తయారు చేసే బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్ ్స ప్రైౖ వేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10,000 కోట్లు అవసరం. బల్కాపూర్ నాలా, కూకట్పల్లి, ముర్కినాలా, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. కానీ ఈ పనులన్నీ నిధుల లేమితో కునారిల్లుతున్నాయి. తక్షణం చేయాల్సిన పనులివీ.. ► గ్రేటర్లో 1,500 కి.మీ. మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించాలి. ► నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే.. టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. దీనికి రాజకీయ పార్టీల, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ► స్టార్మ్ వాటర్ డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్ ను పరిగణనలోకి తీసుకొని టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. ఇతర మెట్రో నగరాల్లో ఇలా.. చెన్నై, ముంబై మహానగరాల్లో 50 సెం.మీ.పైగా భారీ వర్షాలు కురిసినా ముంపు తప్పించేందుకు అక్కడి నాలా వ్యవస్థలో భారీ సామర్థ్యంగల పైపులైన్ల ఏర్పాటుతో వరదనీటికి చక్కటి పరిష్కారం చూపారు. ఆ నీటిని సముద్రంలోకి మళ్లించడంతో ఆయా నగరాలకు ముంపు ముప్పు తప్పింది. హైదరాబాద్‌కు సముద్రం లేకపోయినా వర్షపు నీటిని చెరువులు, కుంటలకు మళ్లించడంతోపాటు,లోతట్టు ప్రాంతాల్లో ఇంకుడు కొలనుల ఏర్పాటుచేసి వాటిలోకి మళ్లిస్తే ముంపు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
జన.. ఘన..నగరాలు!
సాక్షి, హైదరాబాద్: గుంపులు.. సమూహాలుగా జన సంచారం.. ఇసుకేస్తే రాలనంత జనం... మాల్ అయినా.. హోటల్ అయినా ఎటు చూసినా ఇదే పరిస్థితి. ప్రపంచంలో అత్యంత జన సాంద్రత కలిగిన నగరాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. కరోనా మహమ్మారి మానవాళికి పెనుసవాలు విసురుతున్న ఈ తరుణంలో మన మెట్రో నగరాల్లో ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తేస్తే... అంత మంది జనాన్ని అదుపుచేసే యంత్రాంగం... వైరస్‌ను కట్టడిచేసే వ్యూహం... కరోనా రక్కసికి చిక్కి విలవిల్లాడే వారికి సకాలంలో వైద్య సదుపాయాలు అందించే పరిస్థితి మనకుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మాయదారి వైరస్ అదుపులోకి వచ్చే వరకు దశలవారీగా లాక్డౌన్ కొనసాగిస్తేనే మేలని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మన మెట్రో నగరాల్లో రోజురోజుకూ పదుల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కరాళ నృత్యమే... సిటీ మేయర్స్ సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత జనసాంద్రత ఉన్న నగరం ముంబై. ఇది 484 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ప్రతి చదరపు కిలోమీటర్‌కు ఉన్న జనసాంద్రత 29,650. ఇక రెండో స్థానంలోని కోల్‌కతా విస్తీర్ణం 531 చ.కి.మీ. కాగా.. జనసాంద్రత 23,900. ఇక మన పొరుగునే ఉన్న చెన్నై ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ సిటీ విస్తీర్ణం 414 చ.కి.మీ. కాగా జనసాంద్రత 14,350. దేశ రాజధాని ఢిల్లీది ఈ జాబితాలో 13వ స్థానం. ఈ నగర విస్తీర్ణం 1295 చ.కి.మీ. కాగా జనసాంద్రత 11,050. ఇక 19వ స్థానంలోని బెంగళూరు సిటీ విస్తీర్ణం 534 చ.కి.మీ. కాగా జనసాంద్రత 10,100. ఈ జాబితాలో 24వ స్థానంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగరం విస్తీర్ణం 625 చ.కి.మీ. కాగా జనసాంద్రత 9,100. అంటే ప్రపంచంలో అత్యంత జన రద్దీ సిటీలుగా మన నగరాలే అగ్ర ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఒక్కసారిగా ఎత్తేస్తే జనబాహుళ్యంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. పెరుగుతోన్న వైరస్ కేసులు... ఇక మెట్రో నగరాల్లో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలతో పోలిస్తే మహా నగరాలకే వైరస్ ముప్పు పొంచి ఉందని ఈ విషయం స్పష్టం చేస్తోంది. పలు చోట్ల లాక్డౌన్ నిబంధనలను ఆయా నగరాల్లో సిటిజన్లు తరచూ ఉల్లంఘిస్తుండటం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి ప్రధన కారణం. ఇక, కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మెట్రో సిటీల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై అగ్రస్థానంలో ఉండగా, పుణే, కోల్‌కతా, బెంగళూర్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. అదుపులోకి వచ్చే వరకు లాక్డౌన్.. కరోనా కట్టడి అయ్యే వరకు లాక్డౌన్ కొనసాగించాలి. కేసులు అత్యధికంగా నమోదైన రెడ్‌జోన్ ప్రాంతాలను గుర్తించి ఏప్రిల్ 14 తరవాత మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేయాలి. పారిశ్రామిక వాడలను మినహాయిస్తే ఉత్పాదకత పెరుగుతుంది. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. కొరియాలో ఈ విధానాన్నే అమలు చేస్తున్నారు. – పద్మనాభ రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ -
భవిష్యత్‌లో ఫ్లై ఓవర్లు ఇవే!
సాక్షి, హైదరాబాద్ : మహానగరం రూపురేకలు సమూలంగా మార్చేందుకు.. తక్కువ స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇకపై ఏ ప్రభుత్వ విభాగం ఫ్లై ఓవర్ నిర్మించాల్సి వచ్చినా.. మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాల్సి వచ్చినా.. ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) వరకు డబుల్ డెక్కర్‌గా ఒకే పిల్లర్‌పై రెండు వరుసలకు వీలుగా నిర్మాణం చేపట్టాలంటున్నాయి జీహెచ్ఎంసీ వర్గాలు. తద్వారా భూసేకరణ, నిర్మాణ వ్యయంతో సహా ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతాయని ఈ ఆలోచన చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ అధికారుల బృందం ఇటీవల నాగ్‌పూర్, పుణే తదితర నగరాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించి రావడం తెలిసిందే. నాగ్‌పూర్‌లో ఒకే పిల్లర్‌పై రెండు వరుసలతో వంతెనను నిర్మించారు. కింది వరుసలో వాహనాలు, పైవరుసలో మెట్రోరైలు ప్రాణానికి అనువుగా మార్చారు. అక్కడి నిర్మాణాన్ని చూసి నగరంలోనూ అలాంటి విధానాన్నే అమలు చేయాలని భావించారు. గ్రేటర్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు నేషనల్ హైవే, తదితర విభాగాలు ఆయా మార్గాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించనున్నాయి.మెట్రో రైలు రెండో దశలో భాగంగా వివిధ మార్గాల్లో పనులు చేపట్టనున్నారు. దీంతో అన్ని విభాగాలు ఫ్లైఓవర్లు నిర్మించేటప్పుడు ఒకే పిల్లర్‌పై రెండు వరుసల్లో ప్రయాణాలు సాగేలా నిర్మిస్తే భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. మెట్రో రైలు మార్గాల్లో పైవరుసను మెట్రో కకోసం వినియోగిస్తారు. మెట్రో లేని మార్గాల్లో తొలుత ఒక వరుసలో నిర్మించాక, మరో వరుసలో కూడా నిర్మించేందుకు వీలుగా తగిన ఆధునిక సాంకేతికతతో పిల్లర్లను నిర్మిస్తారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సదరు మార్గంలో రెండో వరుసలో కూడా వాహనాల కోసం మరో ఫ్లై ఓవర్ నిర్మించవచ్చునని మేయర్ పేర్కొన్నారు. ఒకవేళ మెట్రోరైలు మార్గమే తొలుత నిర్మిస్తే, దిగువ వరుసలోని మార్గాన్ని వాహనాల కోసం వదిలి పైవరుసలో మెట్రో కోసం నిర్మాణం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సైతం ఈ విధానం బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని, త్వరలో జీఓ వెలువడే అవకాశం ఉందని రామ్మోహన్ తెలిపారు. బెస్ట్ సిటీ కోసం.. నగరాన్ని వివిధ అంశాల్లో బెస్ట్ సిటీగా నిలిపేందుకు ఆయా నగరాల్లో అమల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిశీలిస్తున్నామని మేయర్ తెలిపారు. ఢిల్లీలో చెత్త సేకరణ, నిర్వహణ మాదిరిగా హైదరాబాద్‌లోనూ చెత్త తరలింపు కోసం వినియోగించే వాహనాలు చెత్త బయటకు కనపడకుండా పూర్తిగా ఉండేవాటిని తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్
ఢిల్లీ.. ఊపిరి కూడా పీల్చుకోలేని అత్యంత కాలుష్య నగరం. ముంబై, చెన్నైలలో వరదలు, సునామీ.. బెంగళూరులో రాజకీయ అస్థిరత. కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్‌లో కొరవడిన స్థలాల లభ్యత, అధిక ధరలు. ఇక, మిగిలింది హైదరాబాదే! మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, కట్టుదిట్టమైన భద్రత, కాస్మోపాలిటన్ కల్చర్.. అన్నింటికీ మించి స్థిరమైన ప్రభుత్వం.. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్ అడ్వాంటేజెస్! సాక్షి, హైదరాబాద్: 2019 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నగరంలో 40 లక్షల గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 గృహాలు విక్రయమయ్యాయి. 190 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులొచ్చాయి. ఏ నగరం అభివృద్ధికైనా సరే కావాల్సింది ఉద్యోగ అవకాశాలే. ఇప్పటివరకు కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అందుకే గత కొంత కాలంగా ప్రభుత్వం నగరం నలువైపులా సమాంతర అభివృద్ధి చర్యలు చేపడుతుంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ రంగాల్లో ప్రత్యేక పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తుంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లను ప్రారంభించింది కూడా. ఈస్ట్ జోన్ అభివృద్ధికి త్వరలోనే లుక్ ఈస్ట్ పాలసీని తీసుకురానుంది. వినూత్న నిర్మాణాలతో స్వాగతం.. కాస్మోపాలిటన్ సిటీకి తగ్గట్టుగానే ఇక్కడి డెవలపర్లు కూడా వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. బిల్డింగ్ సైజ్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ కిరణ్ చెప్పారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంతో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లతో సిటీకి అదనపు అందాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు. ఫార్మా సిటీ, ఐటీ హబ్‌లను సరిగ్గా వినియోగించుకుంటే 10–15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో బెంగళూరు బీట్.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో ఉంది. అయితే ఇది తాత్కాలికమేనని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10–15 శాతం ధరలు పెరిగాయని ఏషియా పసిఫిక్ ఎండీ ఎస్ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటూ త్రిబుల్ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్‌లను పట్టాలెక్కించగలిగితే.. వచ్చే రెండేళ్లలో బెంగళూరును బీట్ చేయడం ఖాయమని పేర్కొన్నారు. -
ముంబై నీళ్లు అమోఘం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేసిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద ముంబై నగర నల్లా నీళ్లే స్వచ్ఛమైనవని తేలింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైతోపాటు 20 రాష్ట్రాల రాజధానుల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనిపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. సర్వే జరిపిన అన్ని నగరాల్లోకెల్లా ఒక్క ముంబై నగర నమూనాల్లోనే అవసరమైన 11 బీఎస్ఐ పరామితుల నాణ్యత ఉన్నట్లు తేలిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైపులు, నల్లాల నాణ్యతను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. బీఐఎస్ ప్రమాణాలు అందుకోవడంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలు విఫలమయ్యాయని తేలగా, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అమరావతి, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా, చండీగఢ్, గుహవాటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్మూ, డెహ్రాడూన్ కూడా ఈ ప్రమాణాలు అందుకోలేకపోయాయని తెలుస్తోంది. సర్వే జరిపిన బీఐఎస్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. మూడో దశ సర్వేను ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, 100 స్మార్ట్ సిటీల్లో జరపనున్నట్లు తెలిపారు. -
మెట్రో రైలులో ఊడిపడిన సీలింగ్!
సాక్షి, హైదరాబాద్ : అత్యంత రద్దీగా ఉన్న ఓ మెట్రోరైలు బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్) ఊడిపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళుతున్న మెట్రో రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో పలువురు పైకప్పునకు ఉన్న హ్యాండిల్‌ను పట్టుకొని నిలుచున్నారు. పరిమితికి మించి జనం దాన్ని పట్టుకోవడంతో కొంత భాగం ఊడి తమపై పడినట్లు కొందరు తెలిపారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో రైలును కొద్దిసేపు నిలిపినట్లు సమాచారం.అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. బోగీలోపలి భాగాలు అత్యంత తేలికైన ఫైబర్‌తో తయారు చేసినవి కావడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలుస్తోంది. దీనిపై హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డిని వివరణ కోరగా..మెట్రో బోగీలో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. -
మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో త్వరలో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటామని, దేశంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రవాణా, సమాచారశాఖ మంత్రిగా ఆయన గురువారం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. దివ్యాంగులు ఒకసారి బస్‌పాస్ తీసుకుంటే మూడేళ్ల పాటు చెల్లుబాటయ్యే ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ రవాణాశాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సులకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ చేయాలని, 24 గంటల్లోగా ఆర్టీవో అనుమతులివ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు మంత్రి చెప్పారు. ఫిట్నెస్ లేకుంటే సీరియస్‌గా పరిగణిస్తాం .. ఈ నెల 13 నుంచి ఫిట్నెస్ లేని వాహనాల విషయంలో తనిఖీలు చేపట్టి 624 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేశామని.. ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా విద్యా సంస్థల బస్సులు పట్టుబడితే ఇకపై సీరియస్‌గా పరిగణిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, తమ బస్సులకు ఫిట్నెస్ లేదని చెప్పకుండా రవాణాశాఖ అధికారులపై తప్పులు నెడుతున్నాయన్నారు. ఫిట్నెస్ లేని విద్యా సంస్థల బస్సుల విషయంలో తల్లిదండ్రులు తమకు సహకరించాలని మంత్రి కోరారు. -
వచ్చే శని, ఆదివారాల్లో సాక్షి ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లేని ప్రాపర్టీలను వెతకడం సవాలే. అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయడం కష్టమే. వీటన్నింటికి పరిష్కారం చూపించనుంది ‘సాక్షి ప్రాపర్టీ షో’. ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలు.. అన్ని రకాల ప్రాపర్టీ లను ఒకే వేదికగా ప్రదర్శించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మే 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ప్రారంభ సమయం ఉదయం 10 గంటలు. ప్రవేశం ఉచితం. ప్రధాన స్పాన్సర్: అపర్ణ కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: రాంకీ, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ, ఎన్సీసీ, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇతర పాల్గొనే సంస్థలు: అక్యురేట్ డెవలపర్స్, ప్రావిడెంట్ హౌసింగ్, రాజపుష్ప ప్రాపర్టీస్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సాకేజ్ ఇంజనీర్స్, ఆర్వీ నిర్మాణ్, ఆర్క్ బిల్డర్స్, ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్, వర్టెక్స్ హోమ్స్, గిరిధారి హోమ్స్. స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. -
బిర్యానీకి ఫిదా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ ఇలా మెట్రో నగరం ఏదైనా లక్షలాది మంది నగరవాసులు చికెన్ బిర్యానీపైనే మనసు పారేసుకుంటున్నారట. లంచ్.. డిన్నర్.. లేట్‌నైట్.. ఇలా సమయం ఏదైనా వేడివేడి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసేందుకే మౌస్‌ను క్లిక్ మనిపిస్తున్నారట. ఆహార ప్రియులు చికెన్ బిర్యానీకే ఓటేస్తుండటంతో ఆర్డర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగి ఈ వంటకం నంబర్ వన్ స్థానంలో నిలిచిందట. మసాలా దోశ, బటర్ నాన్, తందూరీ రోటీ, పన్నీర్ బటర్ మసాలా ఐటమ్స్ ఆ తర్వాత నాలుగు స్థానాలు దక్కించుకున్నాయట. ఇక పిజ్జా, బర్గర్, చికెన్, కేక్, మోమోస్‌కు కూడా ఆర్డర్లు పెరుగుతున్నాయట. 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 9 మధ్య ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థకు అందిన ఆర్డర్లపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థ ప్రధానంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో తమ సంస్థకు అందుతున్న ఫుడ్ ఆర్డర్లపై ఈ సర్వేను నిర్వహించింది. ఈ వంటకాలకు భలే గిరాకీ.. ముంబై: చికెన్ బిర్యానీకే ముంబై నగరవాసులు మొగ్గు చూపుతుండటం విశేషం. ఆ తర్వాత పావ్‌భాజీని ఇష్టపడుతున్నారు. రోస్టెడ్ చికెన్ సబ్, చికెన్ మోమోస్‌కు గిరాకీ బాగుంది. ప్రధానంగా బాంద్రా వెస్ట్, పోవాయ్, అంధేరీ వెస్ట్ నుంచి ఫుడ్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ, గుర్గావ్: ధాల్ మకానీ, నాన్, బటర్ చికెన్లకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఆ తర్వాత పాస్తాకు గిరాకీ బాగుంది. జనక్‌పురి, గ్రేటర్ కైలాశ్, ద్వారక, పాలమ్ విహార్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్: బిర్యానీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రధానంగా 20 రకాల బిర్యానీ రుచులను గ్రేటర్ నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత చికెన్ 65ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జూన్, అక్టోబర్ నెలల్లో స్విగ్గీకి ఫుడ్ ఆర్డర్ల సంఖ్య పెరిగింది. మాదాపూర్, బంజారాహిల్స్, కొండాపూర్ నుంచి అధికంగా ఆర్డర్లు వస్తున్నాయి. బెంగళూరు: చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపప్స్, మంచోసూప్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. కోల్‌కతా: బిర్యానీ, ఫ్రైడ్‌రైస్, కచోరిలకు ఆర్డర్లు బాగున్నాయి. చెన్నై: పొంగల్, బిర్యానీ, చికెన్ లాలీపప్స్కు గిరాకీ బాగుంది. పుణే: దాల్ కిచిడి, బిర్యానీ, మ్యాంగో, స్ట్రాబెర్రీ, చాక్లెట్ షేక్స్‌కు గిరాకీ ఎక్కువ. ఏ సమయంలో ఏ వంటకం తింటున్నారంటే.. బ్రేక్‌ఫాస్ట్: మసాలా దోశ, ఇడ్లీ, వడ అగ్రస్థానంలో ఉన్నాయి. ఉదయం 9.30 గంటలకు ఆర్డర్లు బాగున్నాయి. లంచ్, డిన్నర్: చికెన్ బిర్యానీ, ఆ తర్వాత మటన్, వెజ్ బిర్యానీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటలకు.. రాత్రి 8.58 గంటలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. స్నాక్స్: పావ్‌భాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, చికెన్ రోల్, చికెన్ బర్గర్, భేల్పూరికి ఆర్డర్లు బాగున్నాయి. సాయంత్రం 5.03 గంటలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. లేట్ నైట్: చికెన్ బిర్యానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, బటర్ చికెన్, న్యూటెల్లా బ్రౌనీ ముందున్నాయి. లేట్ నైట్ ఆర్డర్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి. మెట్రో సిటిజన్లు ఇష్టపడుతున్న స్వీట్లివే.. గులాబ్ జామూన్, డబుల్ కా మీటా, రస్మలాయ్, టెండర్ కోకోనట్ ఐస్‌క్రీమ్‌లు. -
నవ్యాంధ్రలో ఆధునిక భవనాలు
నవ్యాంధ్రకు నూతన హంగులు.. ఆధునిక సాంకేతిక విధానాలు.. ఉరకలేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. మెట్రో సిటీలకు దీటుగా నూతన భవనాలు వంటి ఎన్నెన్నో శుభ పరిణామాలు రాజధాని ప్రాంతం గుంటూరులో చోటు చేసుకుంటున్నాయి.. రాజధాని నేపథ్యంలో నగర ముఖచిత్రం పూర్తిగా మారనుంది.. బహుళ అంతస్తులు శరవేగంతో రూపుదిద్దుకుంటున్నాయి.. ఆధునిక హుందాతో నగరం నలుదిశలు వ్యాపిస్తున్నాయి.. కార్పొరేట్ సంస్థలు తమదైన పంథాలో నగరంలో వివిధ సంస్థలు నెలకొల్పి నగరవాసులను ఆకట్టుకోనున్నాయి.. వీకెండ్ సరదాలకు, నిరంతరం బిజీగా జీవించే వారు ఉత్సాహంగా గడపటానికి ప్రత్యామ్నాయ వనరులు ఏర్పడనున్నాయి. - కార్పొరేట్ సంస్థల ఆసక్తి - చురుగ్గా నిర్మాణ పనులు - నగరవాసులకు వినోద సౌకర్యాలు గుంటూరు కల్చరల్ నవ్యాంధ్ర రాజధాని నూతన సాంకేతిక పరిజ్ఞానం దిశగా అడుగులేస్తోంది. మెట్రోసిటీల వసతులకు తీసిపోని విధంగా రూపొందుతోంది. గుంటూరు నగరంలో బహుళ అంతస్తుల సముదాయాలు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. వినోదాలకు మల్టీఫ్లెక్స్ థియేటర్లు, టైంపాస్‌కు షాపింగ్ కాంప్లెక్స్‌లు, విశ్రాంతికి హోటళ్లు, ఉల్లాసానికి స్విమింగ్ పూల్స్, శరీర వ్యాయామానికి ఇండోర్ జిమ్,ప్లే గ్రౌండ్లు వంటి వి ఒకే భవనంలో నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా నగరంలోకి అడుగిడుతున్నాయి. లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఇప్పటికే నూతన హంగులతో థియేటర్లు, భారీ సముదాయాల్లో వస్త్ర, నగల దుకాణాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు కొలువుదీరాయి. కళానికేతన్ వారి భారీ బహుళ అంతస్తు ఈ రోడ్డులో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. విశాలమైన ఆరు అంతస్తుల్లో వస్త్ర, వజ్రాభరణాలు, కిడ్స్ వినోద శాలలు ఇక్కడ నెలకొల్పనున్నారు. రింగ్‌రోడ్డుల్లో ఓ ప్రైవేట్ యాజమాన్యం వారు చేపట్టినా ఒకే బహుళంతస్తు భవనంలో హైదరాబాద్ మహానగరంలో ఐమాక్స్ థియేటర్లకు దీటుగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, భవనం టాప్‌లో స్విమ్మింగ్ పూల్స్, సాంకేతిక పరిజ్ఞానంతో ఐమాక్స్ థియేటర్లు వంటివి ఈ భవనంలో కొలువు దీరనున్నాయి. విడిది కేంద్రాలు ఇవిగో.. నగరవాసులకు వీకెండ్ విశ్రాంతికి నగరం శివారు ప్రాంతాలు సిద్ధమౌతున్నాయి. అమరావతి రోడ్డు, మంగళగిరి రోడ్డు, గుజ్జనగుండ్ల, చిలకలూరిపేట బైపాస్ వంటి నగర శివారు ప్రాంతాలలో వినోదాలకు, విలాసాలకు కొన్ని ప్రైవేట్ సంస్థలు విడిది కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి రోడ్డులో ఇప్పటికే మెట్రో నగరాలకు దీటుగా ఓ ప్రైవేట్ యాజమాన్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో థియేటర్‌ను పునరుద్ధరించి ఆకట్టుకుంటోంది. సిటీకి ప్రప్రథమంగా డాల్బీ అట్మాస్ సౌండ్ వ్యవస్థను థియేటర్ల్లో ఏర్పాటు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. గుంటూరు 1 టౌన్లో నాలుగు థియేటర్లలో, టూ టౌన్ నాలుగు ధియేటర్లలో 2 కె విజువల్స్‌తో సాంకేతికతో కూడిన డీటీఎస్ సౌండ్‌ను పునరుద్ధరించారు. -
రోడ్లకు కొత్తరూపు
సాక్షి, సిటీబ్యూరో : పేరుకే మహానగరం.. ఏ రోడ్డు చూసినా గోతుల మయం.. అడుగుకో మ్యాన్‌హోల్.. హడలగొట్టే రంధ్రం.. ఎప్పుడే రహదారి కుంగుతుందో.. ఏ రోడ్డు కింద నాలా, పైప్‌లైన్ ఉన్నాయో తెలియని అయోమయ స్థితి.. పట్టుమని కిలోమీటర్ ప్రయాణం కూడా సాఫీగా సాగించలేని దుస్థితి. ఈ నేపథ్యంలో రహదారుల స్థితిగతులను మార్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇకపై నిర్మించే రోడ్లు పక్కాగా ఉండేందుకు అధికారులు పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రహదారుల నిర్మాణంతోపాటే తగిన కేంబర్, పేవ్మెంట్ వరకు రీకార్పెటింగ్, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల మరమ్మతులు, నీటినిల్వ ప్రాంతాల్లో దిద్దుబాట్లు, మురుగునీరు, పొంగిపొర్లే నీటిని అరికట్టడం, రోడ్డు కటింగ్‌లు పూడ్చివేయడం, భవిష్యత్‌లో నాలుగైదేళ్లపాటు తిరిగి కటింగ్‌లు లేకుండా చూడటం, టేబుల్ డ్రెయిన్ మరమ్మతులు, రోడ్డుకు సమతలంగా మ్యాన్‌హోళ్లు ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలో ఇంజనీర్ల కొరత ఉండటంతో.. ఈ పనులన్నీ కాంట్రాక్టుకు ఇవ్వడంతోపాటు.. ఒప్పందం మేరకు నిర్ణీత కాలం వరకు రోడ్ల నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టు పొందే సంస్థకే ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా తరచూ దెబ్బతినే రహదారుల సమస్యలకు పరిష్కారం దొరకుతుందని భావిస్తున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా రద్దీ ఎక్కువగా ఉండే 53 రహదారులను తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఆయా మార్గాల్లో అవసరమైన పనులకు రూ. 229 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అవసరాల్ని బట్టి వీటిలో మార్పుచేర్పులు చేయనున్నారు. స్టాండింగ్కమిటీ ఆమోదం పొందాక వీటికి టెండర్లు పిలవనున్నారు. అధికారుల అంచనాలు ఫలిస్తే.. ఈ ఏడాది నగర ప్రజలకు రహదారుల ఇక్కట్లు తప్పుతాయి. ఎంపిక చేసిన మార్గాలు.. ఈస్ట్‌జోన్ పరిధిలో.. 1.కాప్రా సర్కిల్లో శ్రీనివాసనగర్ చౌరస్తా - కంది గూడ చౌరస్తా 2.జ్యోతిరావు పూలే విగ్రహం- డిఫెన్స్ కాలనీ 3.ఎల్బీనగర్ సర్కిల్లో సిరీస్రోడ్డు, బిగ్‌బజార్-మన్సూరాబాద్ 4.ఎన్‌హెచ్-65 ప్రధాన రహదారుల నిర్వహణ, వనస్థలిపురం కమాన్-బీఎన్‌రెడ్డి కాలనీ చౌరస్తా, ఎన్జీవోల కాలనీ, ఎస్కేడినగర్ 5. హుడా కాంప్లెక్స్-ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు 6.సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్ రోడ్డు 7. విరాట్‌నగర్ బస్టాప్-ఇన్నర్ రింగ్‌రోడ్డు మసీదు జంక్షన్. సెంట్రల్‌జోన్ పరిధిలో.. 8. అశోక్‌నగర్ బ్రిడ్జి-పీపుల్ స్కూల్ 9. సబర్మతి బ్రిడ్జి- అశోక్‌నగర్ బ్రిడ్జి 10.కవాడిగూడ రోడ్డు 11.లోయర్‌ట్యాంక్‌బండ్ (తెలుగుతల్లి వరకు) 12.వీఎస్టీ చౌరస్తా- రామ్‌నగర్ చౌరస్తా 13.బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్- ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా 14.శివం రోడ్డు(చే నెంబర్ చౌరస్తా-ఓయూ చౌరస్తా) 15.టూరిస్ట్హోటల్-బర్కత్‌పురా చౌరస్తా 16. శ్రీరమణ థియేటర్- సీపీఎల్ రోడ్డు 17. హిమాయత్‌నగర్ చౌరస్తా- ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా 18. జిందా తిలిస్మాత్- గోల్నాక (చేనెంబర్ జంక్షన్ రోడ్డు) 19. కోఠి ఆంధ్రాబ్యాంకు- పుత్లిబౌలి 20. నాంపల్లి టి జంక్షన్- యూసుఫైన్ దర్గా 21. మాసాబ్‌ట్యాంక్-రియాన్కేఫ్ 22. లంగర్‌హౌస్ గాంధీ విగ్రహం-పిల్లర్‌నెంబర్ 102 వరకు 23.మిరాజ్కేఫ్-బోయిగూడ కమాన్ 24. మిరాజ్కేఫ్-తాళ్లగడ్డ 25.అయోధ్య జంక్షన్- బజార్‌ఘాట్ 26.ఎస్సార్‌నగర్ మెయిన్‌రోడ్డు 27. బల్కంపేట మెయిన్‌రోడ్డు 28. ఎస్సార్‌నగర్ చౌరస్తా- రాజీవ్‌నగర్ చౌరస్తా 29.యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు- మోతీనగర్ 30. ఏజీకాలనీ రోడ్డు 31. ఫిల్మ్‌నగర్ రోడ్డునెం.78- విస్పర్‌వ్యాలీ 32. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్లు 2, 3, 14, 9 ఇతరత్రా 33. గ్రీన్‌బావర్చి(శ్రీనగర్‌కాలనీ)-షాలిమార్ చౌరస్తా. వెస్ట్‌జోన్‌లో.. 34.ఐఐటీ చౌరస్తా- హోటల్ ఆదిత్య సరోవర్ 35. మెరిడియన్ స్కూల్- జూబ్లీహిల్స్ రోడ్డునెం.36, జూబ్లీహిల్స్ 36. పటాన్చెరు ఈఎస్ఐ, అన్నమయ్య ఎన్క్లేవ్ 37. జేఎన్టీయూ- హైటెక్‌సిటీ రోడ్డు ఇతరత్రా ప్రాంతాల్లో రీకార్పెటింగ్. నార్త్‌జోన్‌లో.. 38.సుచిత్రా చౌరస్తా- జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ కార్యాలయం 39. సెలెక్ట్ టాకీస్- ఈఎల్ఎస్సార్(మచ్చబొల్లారం), ఓల్డ్‌అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం- ఈసేవ 40. సఫిల్‌గూడ రైల్వేస్టేషన్-జ్యోతినగర్ ఆర్యూబీ 41. హరిహర కళాభవన్- బైబిల్‌హౌస్ 42. సంగీత్- ప్యారడైజ్ 43. సన్‌షైన్ హాస్పిటల్-మినిస్టర్రోడ్డు 44. రసూల్‌పురా- రాణిగంజ్ 45.చిలకలగూడ- తార్నాక 46. సీతాఫల్మండి- జామైఉస్మానియా రైల్వేస్టేషన్ సౌత్జోన్లో.. 47.టీవీ టవర్- అంబర్‌పేట కాజ్వే 48. ఉప్పర్‌పల్లి- హైదర్‌గూడ 49. అత్తాపూర్ నెం.9 చౌరస్తా- హుడాకాలనీ 50 మైలార్‌దేవ్‌పల్లి- సెయింట్ ఫియాజ్స్కూల్. వీటితోపాటు మరో మూడు మార్గాలు.