సాక్షి,హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సంబరాలను (Sankranthi celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ మెట్రో(Metro train) సన్నాహాలు ప్రారంభించింది. నేటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ పేరిట కోఠి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో వేడుకలను ప్రారంభించింది.
సంక్రాంతి పండుగలో భాగంగా సంక్రాంతి మెట్రో ఫెస్ట్‌ను బుధవారం మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకలకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఇతర మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ (hyderabad) మెట్రో ఇంజనీరింగ్ అద్భుతం. మెట్రోలను రైల్వే ఇంజనీర్లు ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టుగా చేపడతారు. కానీ మేం హైదరాబాద్ మెట్రోను కేవలం ట్రాన్స్‌పోర్ట్ మోడ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ ఆత్మ ప్రతిబింబించేలా హైదరాబాద్ మెట్రోను నిర్మించాం.
2013లో ప్రపంచంలోని టాప్ 100 ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకదానిలో మెట్రో రైల్ నిలిచింది. హైదరాబాద్ నగరంలో వున్న 90 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తే రోడ్లన్నీ జామ్ అవుతాయి. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మాత్రమే ఉపయోగపడుతుంది. మెట్రో లాంటి వ్యవస్థలు అందులో చాలా ముఖ్యమైనవి.
మెట్రో రైలు జర్నీనీ ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు. వారి కోసం మీ టైం ఆన్ మై మెట్రో క్యాంపెయిన్‌ను అందుబాటులోకి తెచ్చాం. మెట్రో స్టేషన్లలో మీ టాలెంట్ చూపించేలా మెట్రో అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మెట్రో స్టేషన్లలో మీ టాలెంటును షోకేస్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తాం. డాన్సులు సంగీతం వంటి అంశాలు మీరు ప్రదర్శించవచ్చు.
సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ మెట్రో ప్రాజెక్టు పై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా హైద్రాబాద్ మెట్రో విస్తరణ చేయాలన్నారు. హైదరాబద్ విశ్వ నగరాన్ని చేయడానికి మెట్రో కీలక పాత్ర పోషిస్తుంది. హబ్‌ను ఏర్పాటు చేసి మెట్రోను డెవలప్ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కేంద్రానికి మెట్రో విస్తరణపై సీఎం అనేక అంశాలను ఉంచారు. మెట్రోతో పాటు హైద్రాబాద్ అభివృద్ధి ప్రపోజల్స్‌ను కేంద్రానికి పంపించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment