నగరాల్లో వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి మెట్రో ప్రయాణం సులభతరం. అలాంటి మెట్రోలో డ్యాన్సులు చేస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి మెట్రోలో ఏదో ఒక విచిత్రమైన పని చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది.
మెట్రో ప్రయాణీకులతో రద్దీగా ఉంది. కొందరు ప్రయాణీకులు నిలబడి ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఓ యువతి జిమ్నాస్టిక్ స్టైల్‌లో స్టంట్స్ చేసింది. ఎంతో నైపుణ్యం కలిగినట్లుగా చాకచక్యంగా ప్రదర్శన ఇచ్చింది. ఈ దృశ్యాలను చూస్తున్న ప్రయాణికులు కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. యువతి ప్రదర్శన చేస్తుండగా.. మరో వ్యక్తి ఫొన్‌లో ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు.
ఈ వీడియోను మిశా శర్మా అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇది కాస్త వైరల్ అయింది. 5.2 లక్షల వ్యూస్ వచ్చాయి. 45 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలోని ఘటన ఎక్కడ జరిగిందని పలువురు నెటిజన్లు ప్రశ్నలు వేయగా.. ఓ వ్యక్తి రాజస్థాన్ అని తెలపారు. దీనిపై మరో యూజర్ స్పందిస్తూ.. బెంగళూరులో జరిగిందని వెల్లడించారు. ఆ వీడియో తీసే క్రమంలో తాను మెట్రోలోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇండియా తరుపన ఆడితే మెడల్ తేవొచ్చు.. ఇక్కడ చేస్తూ టైం వేస్టు చేయొద్దని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు..
Comments
Please login to add a commentAdd a comment