goes
-
మెట్రోలో జిమ్నాస్టిక్ స్టైల్లో యువతి స్టంట్స్.. వీడియో వైరల్..
నగరాల్లో వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి మెట్రో ప్రయాణం సులభతరం. అలాంటి మెట్రోలో డ్యాన్సులు చేస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి మెట్రోలో ఏదో ఒక విచిత్రమైన పని చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. మెట్రో ప్రయాణీకులతో రద్దీగా ఉంది. కొందరు ప్రయాణీకులు నిలబడి ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఓ యువతి జిమ్నాస్టిక్ స్టైల్లో స్టంట్స్ చేసింది. ఎంతో నైపుణ్యం కలిగినట్లుగా చాకచక్యంగా ప్రదర్శన ఇచ్చింది. ఈ దృశ్యాలను చూస్తున్న ప్రయాణికులు కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. యువతి ప్రదర్శన చేస్తుండగా.. మరో వ్యక్తి ఫొన్లో ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు. View this post on Instagram A post shared by MISHA SHARMA 🇮🇳 (@mishaa_official_) ఈ వీడియోను మిశా శర్మా అనే యూజర్ తన ఇన్స్టాలో పోస్టు చేసింది. ఇది కాస్త వైరల్ అయింది. 5.2 లక్షల వ్యూస్ వచ్చాయి. 45 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలోని ఘటన ఎక్కడ జరిగిందని పలువురు నెటిజన్లు ప్రశ్నలు వేయగా.. ఓ వ్యక్తి రాజస్థాన్ అని తెలపారు. దీనిపై మరో యూజర్ స్పందిస్తూ.. బెంగళూరులో జరిగిందని వెల్లడించారు. ఆ వీడియో తీసే క్రమంలో తాను మెట్రోలోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇండియా తరుపన ఆడితే మెడల్ తేవొచ్చు.. ఇక్కడ చేస్తూ టైం వేస్టు చేయొద్దని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
Viral Video: పిల్లిని పరిగెత్తించిన ఎలుక
-
రెడ్ మి 4ఏ ఫ్లాష్ సేల్: స్పెషల్ ఆఫర్లు
ముంబై: చైనా మొబైల్ దిగ్గజం షియామి తన జీ ఫోన్ రెడ్మీ 4 ఏ విక్రయాలను మరోసారి ప్రారంభించింది. బుధవారం మధ్నాహ్నం 12గం. లనుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా ఈ అమ్మకాలు మొదలయ్యాయి. అంతేకాదు రెడ్మీ 4ఏ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ తో పాటు రూ. 349 కు కస్టమర్లు ఎంఐ కేసులను ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ. 399 . అలాగే ఆసక్తిగల కస్టమర్లు ఎంఐ బేసిక్ హెడ్ ఫోన్లను 599 రూపాయలు పొందవచ్చు. ముఖ్యంగా మొదటి లక్ష కస్టమర్లకు కిండ్లే యాప్ ద్వారా బుక్స్ కొనుగోలుపై రూ.200 క్రెడిట్ అందిస్తోంది. ఐడియా సెల్యులార్ రెడ్ మి 4ఏ కొనుగోలుపై 28 జీబీ 4జీ డేటాను తన చందాదారులకు అందిస్తోంది. రోజుకు 1జీబీ ఈ డేటాను పొందడానికి కస్టమర్లు 28 రోజుల వాలిడిటీతో రూ .343 తో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతోపాటు అదనంగా రోజుకి 300 నిమిషాల టాక్ టైం ఫ్రీ. -
అవి పాటిస్తే.. నమ్మలేనంత మార్పు..!!
కాలిఫోర్నియాః అమెరికా శాన్ డియాగో కు చెందిన ప్యాట్రిక్ మాగ్నో.. ఇటీవల నిర్వహించిన ఓ ఫిట్నెస్ పోటీలో మొదటి బహుమతిని పొందాడు. 'తక్కువ సమయంలో ఎక్కువ ఫిట్నెస్' అన్న విషయంపై నిర్వహించిన పోటీల్లో కేవలం మూడు నెలల్లో 49 పౌండ్ల బరువు తగ్గడమే కాక, శరీర ఆకారంలోనూ నమ్మలేనంత మార్పును తెచ్చుకొని అందర్నీ ఆకట్టుకున్నాడు. 30 శాతం అధికంగా కొవ్వు ఉండటంతోపాటు, టైప్ 2 మధుమేహం ప్రమాదం ఉందని వైద్యపరీక్షల్లో వెల్లడైన తర్వాత ప్యాట్రిక్.. తన జీవన శైలిలో మార్పు తెచ్చుకునేందుకు నిర్థారించుకున్నాడు. ప్రమాదాల్లో ఉన్నవారిని బయట పడేయడమే ధ్యేయంగా... ఓ సామాజిక కార్యకర్తగా పనిచేయడం ప్యాట్రిక్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎప్పుడూ ఇతరుల యోగక్షేమాలగురించి ఆలోచించే అతడు.. తన ఆరోగ్యం గురించి పట్టించుకోపోవడంతో శరీరంలో మధుమేహం లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అతడు... ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో బాడీబిల్డింగ్ డాట్ కామ్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ పోటీల విషయం తెలుసుకొని ఎలాగైనా పోటీలో గెలుపు సాధించాలన్నదే లక్ష్యంగా కృషి ప్రారంభించాడు. వెబ్ సైట్లో ఇచ్చే వ్యాయామం, మీల్ ప్లాన్, ఫిట్నెస్ సలహాలు పాటించి బరువును తగ్గి బహుమతిని గులుచుకోవాలన్న నిర్వాహకుల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాడు. కేవలం మూడు నెలల్లోనే 49 పౌండ్ల బరువు తగ్గడంతోపాటు.. మంచి శరీరాకృతిని పొంది 'బాడీబిల్డింగ్ డాట్ కామ్ 250 కె' ఛాలెంజ్ లో మొదటి బహుమతిగా 100.000 డాలర్ల నగదును గెలుచుకున్నాడు. మూడు నెలల షెడ్యూల్ లో ప్యాట్రిక్ పూర్తిశాతం తన ఆహార అలవాట్లు మార్చేసుకున్నాడు. ఫిట్నెస్ డాట్ కామ్ అందించే బాడీ స్పేస్ యాప్ ను ఫాలో అయిపోయాడు. ఏదో గుడ్డిగా ఫాలో అయిపోవడం కాదు.. వెబ్ సైట్ లోని వ్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయడంతోపాటు... అందులోని విషయాలను నిర్దుష్గంగా పాటిస్తూ.. అనుకున్న సమయానికి ఆకట్టుకునే శరీరాకృతితోపాటు.. భారీగా బరువు తగ్గి డాట్ కామ్ నిర్వహించిన పోటీల్లో బహుమతి గెలుచుకున్నాడు. ఎటువంటి శిక్షణ, ఖర్చు లేకుండా శరీరంలో అధికంగా ఉన్న 30 శాతం బరువును 6 శాతానికి తెచ్చుకోగలిగాడు. అంతేకాదు మంచి బాడీ బిల్డర్ గా మారాడు. పోటీలో బహుమతి గెలుచుకోవడంతోపాటు.. మ్యాట్రిక్.. ఇప్పుడు ఎంతోమంది ఊబకాయంతో బాధపడుతున్నవారికి మార్గదర్శకమౌతున్నాడు. సామాజిక కార్యకర్తయిన అతడు... ఓ వ్యక్తిగత శిక్షకుడుగా మారి, ఇతరులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసేందుకూ పాటుపడుతున్నాడు. -
'24' నిర్మాత సంచలన నిర్ణయం
చెన్నై: పైరసీ భూతం చలన చిత్రసీమను పట్టిపీడిస్తోంది. పైరసీ వెబ్ లో చిక్కుకున్న పరిశ్రమ ఎనలేని నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుండగా.. చాప కింద నీరులా పైరసీ భూతం విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బెంగళూరులో '24 ' సినిమా విడుదల రోజే పెద్ద ఎత్తున పైరసీ సీడీలు పట్టుబడటం ఆందోళకు దారి తీసింది. పైరసీకి వ్యతిరేకంగా దృఢమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్రా నిర్మాత జ్ఞానవేల్ రాజా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా చిత్రపరిశ్రమ ముందుకు వచ్చి సంబంధిత చర్యలు తీసుకోవాలని రాజా కోరారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాననీ, పరిశ్రమ సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చిందని రాజా మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమ స్పందించి, సరైన చర్యలు చేపట్టేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రముఖ డిజిటల్ సినిమా ప్రొవైడర్ క్యూబ్, ద్వారా జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమా చట్టవిరుద్ధంగా బెంగళూరు పీవీఆర్ ఓరియన్ మాల్ లో మే 6 న 9.45 గంటలకు షో ( విడుదలైన మొదటి రోజు) సమయంలో రికార్డు చేయబడిందని ఆరోపించారు. ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా తాము దీన్ని గుర్తించామని రాజా ఆరోపించారు. ప్రతి థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్ ద్వారా ఇలా గుర్తించడం సాధ్యమని పేర్కొన్నారు. కాగా తమిళ స్టార్ హీరో సూర్య, విక్రం కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయగా, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. టైం మిషన్ బ్యాక్ గ్రౌండ్తో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే.