రెడ్‌ మి 4ఏ ఫ్లాష్‌ సేల్‌: స్పెషల్‌ ఆఫర్లు | Xiaomi Redmi 4A goes on flash sale today on Amazon | Sakshi
Sakshi News home page

రెడ్‌ మి 4ఏ ఫ్లాష్‌ సేల్‌: స్పెషల్‌ ఆఫర్లు

Published Thu, Jun 1 2017 1:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

రెడ్‌ మి 4ఏ ఫ్లాష్‌ సేల్‌:  స్పెషల్‌ ఆఫర్లు

రెడ్‌ మి 4ఏ ఫ్లాష్‌ సేల్‌: స్పెషల్‌ ఆఫర్లు

ముంబై:   చైనా మొబైల్‌ దిగ్గజం  షియామి తన జీ ఫోన్‌ రెడ్‌మీ 4 ఏ  విక్రయాలను మరోసారి  ప్రారంభించింది.  బుధవారం మధ్నాహ్నం 12గం. లనుంచి అమెజాన్‌ లో ప్రత్యేకంగా ఈ అమ్మకాలు మొదలయ్యాయి. అంతేకాదు  రెడ్‌మీ 4ఏ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను  కూడా అందిస్తోంది. ​

ఈ ఫ్లాష్ సేల్‌ తో పాటు  రూ. 349 కు కస్టమర్లు  ఎంఐ  కేసులను ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ. 399 . అలాగే ఆసక్తిగల కస్టమర్లు  ఎంఐ బేసిక్ హెడ్‌ ఫోన్లను 599 రూపాయలు పొందవచ్చు.

ముఖ్యంగా మొదటి లక్ష కస్టమర్లకు కిండ్లే యాప్‌ ద్వారా  బుక్స్‌ కొనుగోలుపై రూ.200 క్రెడిట్‌ అందిస్తోంది.  ఐడియా సెల్యులార్ రెడ్‌ మి 4ఏ  కొనుగోలుపై 28 జీబీ 4జీ  డేటాను తన చందాదారులకు అందిస్తోంది.   రోజుకు 1జీబీ ఈ డేటాను పొందడానికి కస్టమర్లు 28 రోజుల వాలిడిటీతో రూ .343 తో రీఛార్జ్ చేసుకోవాలి.  దీంతోపాటు  అదనంగా  రోజుకి 300  నిమిషాల టాక్‌ టైం ఫ్రీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement