రెడ్ మి 4ఏ సేల్..ఎక్స్క్లూజివ్ గా వారికే! | Xiaomi Redmi 4A to Go on Sale in India Today, Exclusively for Amazon Prime Subscribers | Sakshi
Sakshi News home page

రెడ్ మి 4ఏ సేల్..ఎక్స్క్లూజివ్ గా వారికే!

Published Thu, May 11 2017 12:30 PM | Last Updated on Fri, May 25 2018 7:14 PM

రెడ్ మి 4ఏ సేల్..ఎక్స్క్లూజివ్ గా వారికే! - Sakshi

రెడ్ మి 4ఏ సేల్..ఎక్స్క్లూజివ్ గా వారికే!

అతి తక్కువ ధరలో లాంచ్ అయిన షియోమి రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్, విక్రయాల్లో సంచలనాలు రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ ఫోన్ నేడు విక్రయానికి వస్తోంది. ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రిటైల్ పార్టనర్ అమెజాన్ ఇండియాల్లో షియోమి దీన్ని విక్రయానికి ఉంచుతోంది. అయితే ముందస్తు మాదిరిగా కాకుండా.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ పరిమితంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నేటి నుంచి అమెజాన్ డిస్కౌంట్ల పండుగ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమైన నేపథ్యంలో రెడ్ మి 4ఏ కూడా విక్రయానికి వస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ ఫోన్ సేల్ ను కంపెనీ చేపట్టనుంది.
 
గ్రేట్ ఇండియన్ సేల్ లో సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ ఆఫర్లు దీనికి వర్తించవు. గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా సిటి బ్యాంకు కార్డులపై డెస్క్ టాప్ సైట్ ద్వారా కొనుగోలుచేసే ప్రొడక్ట్స్ పై అదనంగా 10 శాతం, యాప్ ద్వారా కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అందించే డేటా ఆఫర్లు మాత్రం నేటి సేల్ లో అందుబాటులో ఉంటాయి. 343 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై యూజర్లు 28జీబీ 4జీ డేటాను పొందవచ్చు. డేటాతో పాటు రెడ్ మి 4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 ఉచిత ఎస్టీడీ, లోకల్ ఎస్ఎంఎస్ లు పొందుతారు. 28 రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్లు వాలిడ్ లో ఉంటాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement