Redmi 4A
-
పేలిన రెడ్మీ ఫోన్
సాక్షి, శంషాబాద్ : చైనా కంపెనీకి చెందిన షావోమికి చెందిన రెడ్మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. గతంలో విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో రెడ్మీ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు తెలంగాణలోని శంషాబాద్‌కు చెందిన ఓ యువకుడు రెడ్మీ 4ఏ పేలుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు ఇటీవలే రెడ్మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే ఫోన్‌ను కిందికి విసిరేశాడు. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనసైన చిట్టిబాబు సదరు సెల్‌ఫోన్ కంపెనీ ఫిర్యాదు చేశాడు. -
రెడ్మి 4ఏలో కొత్త వేరియంట్ లాంచ్
రెడ్మి 4ఏ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌ను షావోమి మంగళవారం లాంచ్ చేసింది. ఒరిజినల్ హ్యాండ్‌సెట్‌కు అదనపు ర్యామ్, స్టోరేజ్‌తో ఈ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ వేరియంట్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర 6,999 రూపాయలు. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, పేటీఎం, టాటా క్లిక్‌లలో గురువారం నుంచి ఈ ఫోన్ విక్రయానికి వస్తోంది. '' సర్ప్రైజ్, మేము అద్భుతమైన ధర రూ.6,999లో రెడ్మి 4ఏ(3జీబీ ర్యామ్+32జీబీ ఫ్లాష్ మెమరీ) కొత్త వేరియంట్‌ను లాంచ్ చేస్తున్నాం'' అని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, షావోమి వైస్‌ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో రెడ్మి 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.5,999. లాంచ్ చేసినప్పుడు ఈ ఫోన్‌కు 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ప్రస్తుతం స్టోరేజ్‌ను, ర్యామ్‌ను మరింత పెంచుతూ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్మి 4ఏ ఫీచర్లు... హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్ ఎంఐయూఐ 8 ఆధారిత ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 425ఎస్ఓసీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ 3120 ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు పెంపు -
రెడ్ మి 4ఏ ఫ్లాష్ సేల్: స్పెషల్ ఆఫర్లు
ముంబై: చైనా మొబైల్ దిగ్గజం షియామి తన జీ ఫోన్ రెడ్మీ 4 ఏ విక్రయాలను మరోసారి ప్రారంభించింది. బుధవారం మధ్నాహ్నం 12గం. లనుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా ఈ అమ్మకాలు మొదలయ్యాయి. అంతేకాదు రెడ్మీ 4ఏ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ తో పాటు రూ. 349 కు కస్టమర్లు ఎంఐ కేసులను ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ. 399 . అలాగే ఆసక్తిగల కస్టమర్లు ఎంఐ బేసిక్ హెడ్ ఫోన్లను 599 రూపాయలు పొందవచ్చు. ముఖ్యంగా మొదటి లక్ష కస్టమర్లకు కిండ్లే యాప్ ద్వారా బుక్స్ కొనుగోలుపై రూ.200 క్రెడిట్ అందిస్తోంది. ఐడియా సెల్యులార్ రెడ్ మి 4ఏ కొనుగోలుపై 28 జీబీ 4జీ డేటాను తన చందాదారులకు అందిస్తోంది. రోజుకు 1జీబీ ఈ డేటాను పొందడానికి కస్టమర్లు 28 రోజుల వాలిడిటీతో రూ .343 తో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతోపాటు అదనంగా రోజుకి 300 నిమిషాల టాక్ టైం ఫ్రీ. -
రెడ్ మి 4ఏ సేల్..ఎక్స్‌క్లూజివ్ గా వారికే!
అతి తక్కువ ధరలో లాంచ్ అయిన షియోమి రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్, విక్రయాల్లో సంచలనాలు రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ ఫోన్ నేడు విక్రయానికి వస్తోంది. ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రిటైల్ పార్టనర్ అమెజాన్ ఇండియాల్లో షియోమి దీన్ని విక్రయానికి ఉంచుతోంది. అయితే ముందస్తు మాదిరిగా కాకుండా.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ పరిమితంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నేటి నుంచి అమెజాన్ డిస్కౌంట్ల పండుగ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమైన నేపథ్యంలో రెడ్ మి 4ఏ కూడా విక్రయానికి వస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ ఫోన్ సేల్ ను కంపెనీ చేపట్టనుంది. గ్రేట్ ఇండియన్ సేల్ లో సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ ఆఫర్లు దీనికి వర్తించవు. గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా సిటి బ్యాంకు కార్డులపై డెస్క్ టాప్ సైట్ ద్వారా కొనుగోలుచేసే ప్రొడక్ట్స్ పై అదనంగా 10 శాతం, యాప్ ద్వారా కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అందించే డేటా ఆఫర్లు మాత్రం నేటి సేల్ లో అందుబాటులో ఉంటాయి. 343 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై యూజర్లు 28జీబీ 4జీ డేటాను పొందవచ్చు. డేటాతో పాటు రెడ్ మి 4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 ఉచిత ఎస్టీడీ, లోకల్ ఎస్ఎంఎస్ లు పొందుతారు. 28 రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్లు వాలిడ్ లో ఉంటాయి. -
రెడ్మిని తలదన్నేలా మోటో కొత్త ఫోన్లు
భారత్ లో విక్రయాల్లో సంచనాలు సృష్టిస్తున్న షియోమి రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ ను తలదన్నేలా మోటో కొత్త ఫోన్లను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ తేదీలను మోటోను సొంతం చేసుకున్న లెనోవో కంపెనీ అధికారికంగా నిర్ణయించనప్పటికీ, జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 8000 రూపాయల లోపే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి, తాజాగా షియోమి లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ఏ కు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాన్ బ్లాస్ ముందస్తు లీకేజీలను ధృవీకరిస్తూ మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లు జూన్ లో భారత్ లో లాంచ్ అవుతాయనే దానిపై సంబంధిత వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ నోగట్ తో రన్ అవుతాయని తెలుస్తోంది. రెడ్ మి 4ఏ రెండేళ్ల కిందటి ఆండ్రాయిడ్ మార్ష్ మాలోతోనే రన్ అవుతోంది. గోల్డ్, సిల్వర్, బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుందని, 5 అంగుళాల డిస్ ప్లేతో ఇది మార్కెట్లోకి వస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మోటో సీ ఫోన్ కు 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉండగా.. మోటీ సీ ప్లస్ కు 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 8ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ షూటర్, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో సీ ఫోన్ కలిగి ఉంటుందని టెక్ వర్గాల టాక్. -
రెడ్ మి 4 ఏ ఫ్లాష్ సేల్, మరోసారి
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ దారు షియామి విడుదల చేసిన తాజా స్టార్ట్‌ఫోన్ రెడ్ మి 4 ఏ ను మిస్ అయ్యామని బాధపడుతున్నారా? అయితే మీకో శుభవార్త. అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మరోసారి విక్రయానికి రానుంది. కంపెనీ ఈ నెల 13న ఫ్లాష్ సేల్ నిర్వహస్తోంది. దాదాపు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో కేవలం రూ. 5,999లకే అందిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ పై ఇప్పటికే ఫోన్ లవర్స్‌లో మాంచి క్రేజ్ నెలకొంది. సేల్ ప్రకటించిన ప్రతీసారి హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్షల యూనిట్ల విక్రయాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. డార్క్ గ్రే , గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ లో ఏప్రిల్ 13 మూడోసారి విక్రయించబోతోంది. మధ్యాహ్నం 12 గంటలనుంచి, ఎం.కామ్, అమెజాన్ ద్వారా ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చని షియామి ప్రకటించింది. రెడ్ మీ 4 ఏ లాంచ్ ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720×1280 పిక్సెల్ రిజల్యూషన్, 6.0 ఆండ్రాయిడ్ మార్షమల్లౌ, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 చిప్సెట్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,120 ఎంఏహెచ్‌బ్యాటరీ -
నిమిషాల్లోనే ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్!
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి ఇటీవల ప్రవేశపెడుతున్న స్మార్ట్ ఫోన్లకు ఆన్ లైన్ లో అనూహ్య స్పందన వస్తోంది. సంచలన విక్రయాలు నమోదుచేసిన రెడ్ మి నోట్ 4 అనంతరం, నేడు ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై తీసుకొచ్చిన తన లేటెస్ట్ మోడల్ రెడ్ మి4 ఏ ఫోన్‌కు భలే గిరాకి వచ్చింది. అమెజాన్ ప్లాట్‌ఫామ్ పైకి విక్రయానికి వచ్చిన ఆ ఫోన్, నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయింది. రెడ్మి 4ఏ తొలి సేల్ కూడా నేడే కావడం విశేషం. తర్వాతి సేల్ మార్చి 30న కంపెనీ నిర్వహిస్తోంది. రెడ్ మి3 విజయంతో రెడ్మి 4ఏ ను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ కొన్నవారికి లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ రెజుల్యూషన్(720పీ), క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 64-బిట్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 13ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3120 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ప్రత్యేకతలు. దీని ధర కూడా రూ.5,999లే కావడం విశేషం. -
షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్
⇒ రెడ్మి 4ఏ ..ధర రూ.5,999 ⇒ భారత్‌లో చౌక ధర షావోమి ఫోన్ ⇒ భారత్‌లో షావోమి రెండో ప్లాంట్.. శ్రీ సిటీలో ఏర్పాటు న్యూఢిల్లీ: చైనా మొబైల్ ఫోన్ కంపెనీ షావోమి కొత్త స్మార్ట్ ఫోన్, రెడ్మి 4ఏను మార్కెట్లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,999 అని షావోమి ఇండియా తెలిపింది. భారత్‌లో తమ కంపెనీ అందిస్తున్న చౌక ధర ఫోన్ ఇదేనని షావోమి ఇండియా హెడ్ మను జైన్ పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ 4జీ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 అంగుళాల హెచ్డీ డీస్ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్. 3120 ఎంఏహెచ్ బ్యాటరీ, తదితర ఫీచర్లున్నాయని వివరించారు. అమెజాన్ ఇండియా, మిడాట్‌కామ్ వెబ్సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ 4జీ ఫోన్ రూ.7,000 ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో ఎక్కు వగా అమ్ముడవుతున్న మైక్రోమ్యాక్స్ ఫోన్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. శ్రీ సిటీలో ప్లాంట్.. భారత్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మను జైన్ పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడి వివరాలను ఆయన వెల్లడించలేదు. రెండో ప్లాంట్ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే, భారత్‌లో ఒక సెకన్‌కు ఒక ఫోన్‌ను తయారు చేయగలమని మను జైన్ పేర్కొన్నారు. ఈ రెండు ప్లాంట్లు కలసి 5 వేల మంది వరకూ ఉపాధిని కల్పిస్తాయని, వీరిలో 90 శాతం మంది మహిళలే అని వివరించారు. భారత్‌లో తమ ఫోన్లకు ఉన్న డిమాండ్‌ను ఈ రెండు యూనిట్లు 95 శాతం వరకూ తీర్చగలవని పేర్కొన్నారు. -
రెడ్ మీ 4 ఏ లాంచ్..ధర వింటే
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి మరో సరికొత్త మొబైల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలో దీని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ. 5,999లుగా నిర్ణయించింది. రెడ్ 4 ఏ పేరుతో ప్రత్యేక ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డార్క్ గ్రే , గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ అందుబాటులోకి తెచ్చింది. డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాంటి ఇతర అన్ని ప్రధాన ఫీచర్లన్నీ ఇందులో పొందుపరచింది. మార్చి 23 మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్ మీ 4 ఏ లాంచ్ ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1280 పిక్సెల్ రిజల్యూషన్, 6.0 ఆండ్రాయిడ్ మార్షమల్లౌ, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425 చిప్ సెట్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,120 ఎంఏహెచ్ బ్యాటరీ