రెడ్మిని తలదన్నేలా మోటో కొత్త ఫోన్లు
రెడ్మిని తలదన్నేలా మోటో కొత్త ఫోన్లు
Published Thu, May 11 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
భారత్ లో విక్రయాల్లో సంచనాలు సృష్టిస్తున్న షియోమి రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ ను తలదన్నేలా మోటో కొత్త ఫోన్లను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ తేదీలను మోటోను సొంతం చేసుకున్న లెనోవో కంపెనీ అధికారికంగా నిర్ణయించనప్పటికీ, జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 8000 రూపాయల లోపే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి, తాజాగా షియోమి లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ఏ కు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాన్ బ్లాస్ ముందస్తు లీకేజీలను ధృవీకరిస్తూ మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లు జూన్ లో భారత్ లో లాంచ్ అవుతాయనే దానిపై సంబంధిత వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ నోగట్ తో రన్ అవుతాయని తెలుస్తోంది. రెడ్ మి 4ఏ రెండేళ్ల కిందటి ఆండ్రాయిడ్ మార్ష్ మాలోతోనే రన్ అవుతోంది. గోల్డ్, సిల్వర్, బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుందని, 5 అంగుళాల డిస్ ప్లేతో ఇది మార్కెట్లోకి వస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మోటో సీ ఫోన్ కు 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉండగా.. మోటీ సీ ప్లస్ కు 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 8ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ షూటర్, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో సీ ఫోన్ కలిగి ఉంటుందని టెక్ వర్గాల టాక్.
Advertisement
Advertisement