రూ.499కే మోటో స్మార్ట్‌ఫోన్.. అదెలా?
రూ.499కే మోటో స్మార్ట్‌ఫోన్.. అదెలా?
Published Sat, Jul 1 2017 9:14 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
మోటో సీ ప్లస్ పేరుతో ఈ నెల మొదట్లో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే ప్రవేశపెట్టారు. దీని ధర కూడా బడ్జెట్‌లో రూ.6,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ కంపెనీ. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువగా 499రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా? ఎక్స్చేంజ్ ఆఫర్‌లో. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6,500 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ లిస్టు చేసింది. అంటే దీని ధర తక్కువగా 499 రూపాయలకి దిగొస్తున్నట్టే కదా..! మూడు కలర్ వేరియంట్లు-ఫైన్ గోల్డ్, పెర్ల్ వైట్, స్టార్రి బ్లాక్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను మరే ఇతర స్మార్ట్‌ఫోన్ ద్వారానైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్ బట్టి ఈ ఆఫర్ అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకైతే, అదనంగా 5 శాతం కూడా తగ్గింపును ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాక రిలయన్స్ జియోతో కూడా భాగస్వామ్యంతో ఈ ఫోన్ కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు అదనంగా 30జీబీ 4జీ డేటా కూడా అందుబాటులోకి రానుంది. అయితే పాత ఫోన్ పికప్ చార్జీ కింద 100 రూపాయలను ఫ్లిప్‌కార్ట్ వేయనుంది. దీంతో కొనుగోలుదారులు మొత్తంగా ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు 599 రూపాయలు కట్టాల్సి ఉంటుంది.
మోటో సీ ప్లస్ స్పెషిఫికేషన్లు....
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
720 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్,
128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement