Moto C Plus
-
రూ.499కే మోటో స్మార్ట్‌ఫోన్.. అదెలా?
మోటో సీ ప్లస్ పేరుతో ఈ నెల మొదట్లో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే ప్రవేశపెట్టారు. దీని ధర కూడా బడ్జెట్లో రూ.6,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ కంపెనీ. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువగా 499రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా? ఎక్స్చేంజ్ ఆఫర్లో. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6,500 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ లిస్టు చేసింది. అంటే దీని ధర తక్కువగా 499 రూపాయలకి దిగొస్తున్నట్టే కదా..! మూడు కలర్ వేరియంట్లు-ఫైన్ గోల్డ్, పెర్ల్ వైట్, స్టార్రి బ్లాక్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను మరే ఇతర స్మార్ట్‌ఫోన్ ద్వారానైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్ బట్టి ఈ ఆఫర్ అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకైతే, అదనంగా 5 శాతం కూడా తగ్గింపును ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాక రిలయన్స్ జియోతో కూడా భాగస్వామ్యంతో ఈ ఫోన్ కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు అదనంగా 30జీబీ 4జీ డేటా కూడా అందుబాటులోకి రానుంది. అయితే పాత ఫోన్ పికప్ చార్జీ కింద 100 రూపాయలను ఫ్లిప్‌కార్ట్ వేయనుంది. దీంతో కొనుగోలుదారులు మొత్తంగా ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు 599 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మోటో సీ ప్లస్ స్పెషిఫికేషన్లు.... 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 720 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మార్కెట్లోకి ‘మోటో సీ ప్లస్’ ధర రూ.6,999
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మోటరోలా’ తాజాగా ‘మోటో సీ ప్లస్’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఆండ్రాయిడ్ నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ‘మోటో సీ ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌లో ఐదు అంగుళాల స్క్రీన్, 1.3 గిగాహెర్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మొమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. కాగా ఈ స్మార్ట్ఫోన్లు జూన్ 20 నుంచి కేవలం ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. -
రెడ్మిని తలదన్నేలా మోటో కొత్త ఫోన్లు
భారత్ లో విక్రయాల్లో సంచనాలు సృష్టిస్తున్న షియోమి రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ ను తలదన్నేలా మోటో కొత్త ఫోన్లను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ తేదీలను మోటోను సొంతం చేసుకున్న లెనోవో కంపెనీ అధికారికంగా నిర్ణయించనప్పటికీ, జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 8000 రూపాయల లోపే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి, తాజాగా షియోమి లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ఏ కు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాన్ బ్లాస్ ముందస్తు లీకేజీలను ధృవీకరిస్తూ మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లు జూన్ లో భారత్ లో లాంచ్ అవుతాయనే దానిపై సంబంధిత వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ నోగట్ తో రన్ అవుతాయని తెలుస్తోంది. రెడ్ మి 4ఏ రెండేళ్ల కిందటి ఆండ్రాయిడ్ మార్ష్ మాలోతోనే రన్ అవుతోంది. గోల్డ్, సిల్వర్, బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుందని, 5 అంగుళాల డిస్ ప్లేతో ఇది మార్కెట్లోకి వస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మోటో సీ ఫోన్ కు 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉండగా.. మోటీ సీ ప్లస్ కు 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 8ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ షూటర్, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో సీ ఫోన్ కలిగి ఉంటుందని టెక్ వర్గాల టాక్.