
సాక్షి, శంషాబాద్ : చైనా కంపెనీకి చెందిన షావోమికి చెందిన రెడ్‌మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. గతంలో విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో రెడ్‌మీ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు తెలంగాణలోని శంషాబాద్‌కు చెందిన ఓ యువకుడు రెడ్‌మీ 4ఏ పేలుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు ఇటీవలే రెడ్‌మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. కూరగాయల మార్కెట్‌లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే ఫోన్‌ను కిందికి విసిరేశాడు. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనసైన చిట్టిబాబు సదరు సెల్‌ఫోన్ కంపెనీ ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment