Xiaomi phones
-
మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో 3.4 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 86 శాతం వృద్ధి నమోదైంది. షావొమీ 29.2 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర క్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం అధికమై రూ.13,700లకు చేరింది. ధరల పెరుగుదల, 5జీ మోడళ్ల రాకతో సగటు విక్రయ ధర రానున్న త్రైమాసికాల్లో దూసుకెళ్లనుంది. 2020తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి 9 శాతంలోపే ఉంటుందని ఐడీసీ అంచనా వేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు, సరఫరా అడ్డంకులు, పెరుగుతున్న విడిభాగాల ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమని వెల్లడించింది. వినియోగదార్లు ఫీచర్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవడం, తక్కువ, మధ్యస్థాయి ఫోన్లు వాడుతున్నవారు మెరుగైన స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు, 5జీ మోడళ్ల వెల్లువతో 2022లో మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని వివరించింది. ఇక 5జీ మోడళ్ల అమ్మకం విషయంలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. చైనా, యూఎస్, జపాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 50 లక్షల 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5జీ మోడల్ సగటు విక్రయ ధర రూ.30,500 నమోదైంది. ఈ ఏడాది చివరినాటికి రూ.15,000లోపు ధర గల మోడళ్లు వెల్లువెత్తుతాయని ఐడీసీ అంచనా వేస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా. -
పేలిన రెడ్మీ ఫోన్
సాక్షి, శంషాబాద్ : చైనా కంపెనీకి చెందిన షావోమికి చెందిన రెడ్మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. గతంలో విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో రెడ్మీ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు తెలంగాణలోని శంషాబాద్‌కు చెందిన ఓ యువకుడు రెడ్మీ 4ఏ పేలుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు ఇటీవలే రెడ్మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే ఫోన్‌ను కిందికి విసిరేశాడు. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనసైన చిట్టిబాబు సదరు సెల్‌ఫోన్ కంపెనీ ఫిర్యాదు చేశాడు. -
షావోమి కొత్త ఫోన్.. ‘రెడ్మి వై2’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్మి వై2’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో 3 జీబీ ర్యామ్/ 32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.9,999గా, 4 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. అమెజాన్ సహా తమ సొంత వెబ్ పోర్టల్ ఎంఐ.కామ్, అలాగే ఎంఐ హోమ్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లు జూన్ 12 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. వై2 ఫోన్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. ‘మేం మా తొలి సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ వై1ను గతేడాది నవంబర్‌లో మార్కెట్లోకి తెచ్చాం. కస్టమర్ల నుంచి ఈ మోడల్‌కు మంచి ఆదరణ లభించింది. దీనిలానే వై2 కూడా వినియోగదాలకు మరింత చేరువవుతుందని విశ్వాసిస్తున్నాం’ అని షావోమి వైస్ ప్రెసిడెంట్, షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ తన అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఐయూఐ 10 బీటా వెర్షన్‌ను ఈ నెల తరవాత భారత్‌లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. ఇక్కడి ఫోన్లలో ఇక్కడి సర్క్యూట్ బోర్డులే మేడిన్ ఇండియా ఫోన్లలో ఈ ఏడాది మూడో త్రైమాసికానికల్లా స్థానికంగా తయారు చేసిన సర్క్యూట్ బోర్డులనే (పీసీబీ) వాడతామని షావోమి పేర్కొంది. కంపెనీ భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ‘మేం ఇప్పటికే ఇండియాలో పీసీబీల తయారీని ఆరంభించాం. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) నాటికి ఇక్కడ తయారయ్యే అన్ని పరికరాల్లోనూ స్థానికంగా తయారు చేసిన పీసీబీలను అమర్చాలనేది మా లక్ష్యం’ అని షావోమి వైస్ ప్రెసిడెంట్, షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ ఈ సందర్భంగా తెలిపారు. షావోమి ఇటీవల ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో శ్రీపెరుంబుదూర్‌లో కొత్త పీసీబీ (మొబైల్ ఫోన్ మదర్బోర్డ్) యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్ తయారీ వ్యయంలో పీసీబీ వాటానే ఎక్కువ. చాలా కంపెనీలు పీసీబీలను స్థానికంగానే తయారుచేయాలని భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు స్మార్ట్‌ఫోన్ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం విధించడం దీనికి కారణం. స్మార్ట్‌ఫోన్స్ తయారీ కోసం రెండు కేంద్రాలున్న షావోమి ఇటీవలే శ్రీసిటీ (ఆంధ్రప్రదేశ్), శ్రీపెరుంబుదూర్ (తమిళనాడు)లో మరో 3 కేంద్రాలు ఏర్పాటు చేసింది. -
పాత ఫోన్ ఇవ్వండి.. కొత్త ఫోన్ తీసుకోండి
ముంబై : షావోమి 2017 నవంబర్‌లో ప్రారంభించించిన ట్రేడ్ ఇన్ కార్యక్రమాన్ని ఇక మీదట తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా షావోమి తన వినియోగదారులకు ఇన్స్టాంట్ ఎక్స్చేంజ్ కూపన్లను అందిస్తోంది. ఈ కూపన్లతో వినియోగదారులు పాత స్మార్ట్ ఫోన్లను ఇచ్చి, కొత్త ఫోన్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కాషీఫై భాగస్వామ్యంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని తొలుత అన్ని షావోమీ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టోర్లకే పరిమితమైన ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని షావోమి తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లోకి కూడా విస్తరించింది. ఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందడానికి, ఎంఐ.కామ్‌లో దానికి కేటాయించిన ప్రత్యేక పేజీలోకి వెళ్లాలి. అక్కడ ఎక్స్చేంజ్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. షావోమి మీ ఫోన్ కండీషన్, ప్రస్తుతం మార్కెట్లో దాని విలువను బట్టి మీకు ఉత్తమ ఎక్స్చేంజ్ ధరను సూచిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర నచ్చితే మీ ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్ సహాయంతో ఎక్స్చేంజ్ వాల్యూ కూపన్‌ని పొందవచ్చు. ఈ నగదు మీ ఎమ్ఐ అకౌంట్‌కి జమ అవుతుంది. ఆ ఎక్స్చేంజ్ కూపన్ సహాయంతో మీరు మీకు నచ్చిన కొత్త షావోమి ఫోన్‌ను తీసుకోవచ్చు. ఎక్స్చేంజ్లో ఫోన్ కొనాలంటే కచ్చితంగా మీ పాత ఫోన్ పనిచేస్తూ ఉండి, ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా ఉండాలనే నిబంధనను పెట్టింది కంపెనీ. మీ పాత ఫోన్ స్ర్కీన్లాక్ను తీసేసి, మిగతా సీక్రేట్ లాక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అన్‌లాక్ చేసి ఇవ్వాలని పేర్కొంది. షావోమి లిస్ట్‌లో ఉన్న ఫోన్లకే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వినియోగదారుడు ఒక్కసారి ఒక్క ఫోన్‌ను మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్చేంజ్ కూపన్ వాలిడిటి కేవలం 14 రోజులు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం స్మార్ట్ఫోన్లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
నెం. 1 ఎంఐ ఫ్యాన్ సేల్: డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి తన కస్టమర్లకు మరోసారి డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. డిస్కౌంట్ సేల్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్లతో మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న షావోమి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘న్యూ ఇయర్ ' సేల్‌ను ప్రకటించింది. ‘ఎంఐ ఫ్యాన్ సేల్’ ఆఫర్ కింద దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లోని 15 ఎంఐ హోమ్‌లలో డిస్కౌంట్ ధరలలో స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 23న లాంచ్ చేసిన ఈ ఆఫర్ జనవరి 1, 2018 వరకూ ఈ ఆఫర్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఇప్పటివరకూ ఆన్లైన్ ఆఫర్లతో అలరించిన షావోమి తాజాగా ఆఫ్‌లైన్ వేదికగా కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. ముఖ్యంగా పాపులర్ మోడల్స్ ఏ 1, రెడ్మీనోట్ 4, ఎం ఐ మిక్స్ 2, మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఎంఐ ఏ1, ఎంఐ మ్యాక్స్ 2 (32జీబీ వేరియంట్) ధరలు రూ.12,999కే లభ్యం( అసలు ధర రూ.13,999). ఇక రూ.15,999గా ఉన్న ఎంఐ మ్యాక్స్ 2(64జీబీ)ను రూ.14,999కు అందుబాటులో ఉంచింది. అలాగే ఎంఐ మిక్స్2పై మూడు వేల తగ్గింపు అనంతరం రూ.32,999కు లభ్యం కానుంది. వీటితో పాటు రెడ్మి నోట్4 4జీజీ వేరియంట్ రూ.10,999 (అసలు ధర రూ.11,999), రెడ్మి4 32జీబీ వేరియంట్ రూ.8,499(ఎంఆర్పీ రూ.8,999) రెడ్మి4 64జీబీ వేరియంట్ రూ.9,999(అసలు ధర రూ.10,999) విక్రయిస్తోంది. వీటితో పాటు వివిధ యాక్ససరీస్పైనా కూడా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. -
షావోమి స్మార్ట్ఫోన్లకు ఇక అది ఉండదు
షావోమి స్మార్ట్ఫోన్లకు 'నోట్' ట్యాగ్ చాలా ఫేమస్. రెడ్మి నోట్, రెడ్మి నోట్ 2, రెడ్మి నోట్ 3, రెడ్మి నోట్ 4 ఇలా పలు స్మార్ట్ఫోన్లను షావోమి మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే తాజాగా స్మార్ట్ఫోన్లకు ఉపయోగిస్తున్న ఈ 'నోట్' ట్యాగ్‌ను షావోమి తీసివేయాలని చూస్తుందట. షావోమి 'నోట్' పేరుకు స్వస్తి చెప్పబోతుందంటూ ఇప్పటికే పలు రిపోర్టులు కూడా విడుదలయ్యాయి. అంతేకాక రెడ్మి నోట్4కు సక్ససర్‌గా షావోమి రెడ్మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడం ఈ రిపోర్టులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎంఐ ఫోరమ్ 'సూపర్ మోడరేటర్' మిచ్002 ఈ విషయాన్ని తొలిసారి రివీల్ చేసింది. కానీ ఇప్పటి వరకు షావోమి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రెడ్మి 5 ప్లస్‌తో పాటు రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్‌ను కూడా షావోమి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు హ్యాండ్సెట్లు ఫుల్ వ్యూ డిస్ప్లే, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రెండు స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి కూడా రాబోతున్నాయి. రెడ్మి 5 ప్లస్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి 5 ఫీచర్లు 2జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 3జీబీ ర్యామ్, 32జీబీ వెర్షన్ 5.7 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ స్క్రీన్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ -
రూ.4,999కే షావోమి స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా అందుబాటు ధరలో ‘రెడ్మి 5ఏ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.4,999. రెడ్మి 5ఏ ప్రధానంగా 2 జీబీ ర్యామ్/ 16 జీబీ మెమరీ, 3 జీబీ ర్యామ్/ 32 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధర వరుసగా రూ.4999గా, రూ.6,999గా ఉంది. అయితే ఇక్కడ 2 జీబీ ర్యామ్/ 16 జీబీ మెమరీ వేరియంట్ ధర మాత్రం తొలి 50 లక్షల యూనిట్లకు మాత్రమే వర్తిస్తుందని, తర్వాత ఫోన్ ధర రూ.5,999గా ఉంటుందని షావోమి ఇండియా పేర్కొంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి బ్రాండ్‌ను అగ్రస్థానంలో నిలిపినందుకు వినియోగదారులకు రూ.1,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్ అమౌంట్ విలువ రూ.500 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ‘అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. టెక్నాలజీ వల్ల జీవితాలు మెరుగుపడతాయి’ అని షావోమి వైస్ ప్రెసిడెంట్, సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనూ జైన్ వివరించారు. ఫోన్ ప్రత్యేకతలు భారత్‌లోనే తయారైన ‘రెడ్మి 5ఏ’ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల డిస్ప్లే, 1.4 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కామ్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్, మి.కామ్, మి హోమ్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. -
భారత్‌లో ‘షావోమి’ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : కేవలం ఏడేళ్ల క్రితం ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘షావోమి (ఎక్స్ఏఓఎంఐ)’ ప్రపంచ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక భారతీయ మార్కెట్లో అతివేగంగా దూసుకెళుతోంది. భారత మార్కెట్లో ఈ కంపెనీ స్మార్ట్ఫోన్ల అమ్మకాల షేర్ గతేడాది ఆరు శాతం నుంచి ఏకంగా 22 శాతానికి దూసుకుపోయిందని హాంగ్‌కాంగ్‌కు చెందిన మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘కౌంటర్ పాయింట్ రీసర్చ్’ వెల్లడించింది. భారత్‌లో విజయవంతమైన ఐదు స్మార్ట్ఫోన్లలో మూడు ఫోన్లు ఈ కంపెనీ ఉత్పత్తులే అవడం విశేషం. భారత్ మార్కెట్లోకి 1995లో అడుగుపెట్టిన దక్షిణ కొరియా మొబైల్ ఫోన్ల సంస్థ శామ్సంగ్తో సమానంగా షావోమి తన మార్కెట్‌ను విస్తరించుకుంది. 2014లో దేశంలోకి అడుగుపెట్టిన షావోమి కంపెనీ గత రెండేళ్ల కాలంలో భారత ఉప ఖండంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్ డేటా సంస్థ తెలియజేసింది. రానున్న మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలంలో మరో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టడానికి సిద్ధమైంది. ధరకు తగ్గ నాణ్యతను పాటించడమే కాకుండా కేవలం ఈ–వాణిజ్యం ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారానే విక్రయించడం, ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవడం ద్వారా షావోమీ భారతీయ మార్కెట్లో కొత్త చరిత్రను సష్టించింది. ఫ్లాష్ సేల్స్ ద్వారా కొన్ని సెకడ్లలోనే తన ఉత్పత్తులన్నింటిని విక్రయించడం భారత్‌లో ఇప్పటి వరకు ఈ ఒక్క కంపెనీకే చెల్లిందని చెప్పవచ్చు. ఈ కంపెనీ 2014, సెప్టెంబర్‌లో రెడ్మి 1ఎస్ మోడల్ తీసుకొచ్చినప్పుడు 40 వేల స్మార్ట్ఫోన్లు 4.2 సెకండ్లలో అమ్ముడుపోయాయి. కేవలం ఆన్లైన్ మార్కెట్‌నే నమ్ముకున్న ఈ సంస్థ ఇప్పుడు భారత్‌లో 30 శాతం స్మార్ట్ఫోన్ల మార్కెట్‌ను ఆక్రమించింది. మిగతా కంపెనీలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాల ద్వారా కూడా వినియోగదారులను ఇంతగా ఆకర్షించలేకపోతున్నాయి. ఇక ఆఫ్‌లైన్‌లో కూడా తమ అమ్మకాలను కొనసాగించేందుకు షావోమి ‘మి హోమ్’ పేరిట సొంత షాపులను ఏర్పాటు చేస్తోంది. ఆ అవకాశంలేని చోట క్రోమా, యూనివర్సల్, పూర్విక, సంగీత రిటైల్ చైన్లతో ఒప్పందం పెట్టుకుంటోంది. భారత్‌లో షావోమి రెడ్మి నోట్ 42, షావోమి రెడ్మి నోట్ 43, షావోమి రెడ్మి 4ఏ4 మోడళ్లు సూపర్‌గా హిట్టయ్యాయి. -
భారత్‌లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ఫోన్లివే!
షావోమి స్మార్ట్ఫోన్లు ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రయానికి వచ్చిన ప్రతిసారి షావోమి ఫోన్లు సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. 10వేల రూపాయల కన్నా ధర తక్కువగా ఉన్న కేటగిరీలో షావోమి స్మార్ట్ఫోన్లు, శాంసంగ్‌ను బీట్ చేశాయి. బెస్ట్-సెల్లర్ స్లాటును దక్కించుకున్నాయి. 2017 రెండో క్వార్టర్లో భారత్‌లో రూ.10వేల కన్నా తక్కువున్న స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌లలో షావోమి బెస్ట్ సెల్లర్‌గా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. షావోమికు చెందిన రెడ్మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 7.2 శాతం మార్కెట్ షేరును, రెడ్మి 4 స్మార్ట్‌ఫోన్ 4.5 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుని తొలి రెండు స్థానాల్లో నిలవగా... వీటి తర్వాత 4.3 శాతం మార్కెట్ షేరుతో శాంసంగ్ గెలాక్సీ జే2 ఉన్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. రూ.10వేల ధర కలిగిన పోర్ట్‌ఫోలియోలో షావోమికి స్ట్రాంగ్ డిమాండ్ వస్తుందని, 2017 ప్రథమార్థంలో రెడ్మి నోట్ 4 టాప్ సెల్లింగ్ మోడల్‌గా చోటు దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్‌ను వేరే బ్రాండు అధిగమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బెస్ట్-సెల్లర్ స్లాటులో శాంసంగ్ మోడల్సే నిలిచాయని చెప్పారు. కానీ ఈసారి ట్రెండ్ రివర్స్ అయిందన్నారు. అయితే మొత్తంగా స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ల సరుకు రవాణాల్లో శాంసంగ్ కంపెనీనే మొదటి స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ కేటగిరీలో 25.4 శాతం మార్కెట్ షేరు ఉండగా.. స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో 24.1 శాతాన్ని దక్కించుకుంది. -
షియోమి ఫోన్లు విక్రయించుకోవచ్చు
ఒక్కో ఫోన్‌కు రూ.100 రాయల్టీగా డిపాజిట్ చేయాలి ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ ఫోన్లు దిగుమతి చేసుకొని, విక్రయించుకోవడానికి ఢిల్లీ హైకోర్ట్ మంగళవారం అనుమతిచ్చింది. క్వాల్కామ్ ప్రాసెసర్‌పై నడిచే చిప్సెట్లతో తయారైన ఫోన్లకు మాత్రమే వచ్చే నెల 8 వరకూ ఈ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. భారత్‌లో వచ్చే నెల 5 వరకూ విక్రయించే ప్రతి ఫోన్‌కు రూ.100 చొప్పున రాయల్టీగా డిపాజిట్ చేయాలని జస్టిస్ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ ఆర్.కె గౌబలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అనుమతచ్చింది. జనవరి 8న తదుపరి విచారణ జరగనున్నది. షియోమి సంస్థ పేటెంట్ల ఉల్లంఘనకు పాల్పడిందంటూ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ సంస్థ కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిని విచారించిన ఏక సభ్య ధర్మాసనం భారత్‌లో షియోమి ఫోన్ల విక్రయాలపై నిషేధం విధిస్తూ ఈనెల 8న ఆదేశాలు జారీ చేసింది. తాము ఎలాంటి పేటెంట్ల ఉల్లంఘనకు పాల్పడలేదంటూ షియోమి కంపెనీ మంగళవారం ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషన్‌ను దాఖలు చేసింది. క్వాల్కామ్ సంస్థ తన పేటెంట్ టెక్నాలజీకి ఎరిక్సన్ నుంచి లెసైన్స్ పొందిందని షియోమి పేర్కొంది. -
షియోమీ ఫోన్ల అమ్మకాల నిలిపివేత
న్యూఢిల్లీ: చైనాకి చెందిన షియోమీ మొబైల్స్ విక్రయాలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్ వేసింది. భారత్‌లో వీటి విక్రయాలను నిలిపివేయాలంటూ షియోమీతో పాటు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశిస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎరిక్సన్ సంస్థకి చెందిన టెక్నాలజీ పేటెంట్ హక్కులను షియోమీ ఉల్లంఘిస్తోందన్న అభియోగాలు ఇందుకు కారణం. దీంతో, షియోమీ ఫోన్ల దిగుమతులను నిరోధించాలని కస్టమ్స్ అధికారులను కూడా హైకోర్టు ఆదేశించింది. ఇప్పటిదాకా భారత్‌లో విక్రయించిన ఫోన్ల సంఖ్య తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా షియోమీ, ఫ్లిప్‌కార్ట్‌లను ఆదేశించింది. షియోమీ, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలను పరిశీలించేందుకు ముగ్గురు స్థానిక కమిషనర్లను సైతం కోర్టు నియమించింది. వీరి ఖర్చులకయ్యే దాదాపు రూ. 3.5 లక్షల మొత్తాన్ని ఎరిక్సన్ భరించాలి. నాలుగు వారాల్లోగా కమిషనర్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. -
ఇక షాపుల్లో షియోమీ ఫోన్లు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ షియోమీ ఆఫ్‌లైన్ బాట పడుతోంది. ఇప్పటి వరకు కేవలం ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివిధ మోడళ్లను భారత్‌లో విక్రయించిన ఈ చైనా ఆపిల్.. కొద్ది రోజుల్లో దేశీయ మార్కెట్లో రిటైల్ షాపుల్లోనూ దర్శనమీయనుంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో హల్చల్ చేస్తున్న షియోమీ మొబైళ్లు సంప్రదాయ దుకాణాలకు చేరితే సంచలనాలు నమోదవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. తమ కంపెనీ ఫోన్ల కోసం ప్రతివారం 2 నుంచి 3 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయని షియోమీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే రోజున 1.75 లక్షల పీసులు విక్రయించామన్నారు. అయితే ఇటీవల ఆవిష్కరించిన రెడ్మి నోట్ 4జీ మోడల్ ఎయిర్టెల్ ఔట్లెట్లలో డిసెంబర్ నుంచి లభించనున్న సంగతి తెలిసిందే. రెడ్మి నోట్, మి 3, రెడ్మి 1ఎస్ కంపెనీ ఇతర మోడళ్లు. అభిమానులు పెరుగుతున్నారు.. షియోమీ అభిమానులు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా అంటున్నారు. భారత్‌లో ఆఫ్‌లైన్ అమ్మకాల్లోకి త్వరలోనే ప్రవేశిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడి స్టార్టప్, అప్లికేషన్ డెవలపర్లు, సర్వీస్ ప్రొవైడర్లతో కలసి పని చేస్తామని చెప్పారు. ఇండోనేసియాలో గురువారం జరిగిన స్టార్టప్ ఆసియా జకార్తా 2014 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇండోనేసియాలోని ఇరాజయకు చెందిన రెండు స్టోర్లలో ఒకే రోజు 2,000 ఫోన్లు విక్రయించాం. ఆఫ్లైన్లోనూ స్పందన ఉందనడానికి ఇదే నిదర్శనం’ అని చెప్పారు. గూగుల్ వన్ ఫోన్ తయారీ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం ఖాయమన్నారు. కాగా, ఒక ఉత్పత్తిని కొన్ని గంటలు మాత్రమే విక్రయించే ఫ్లాష్ సేల్స్/డీల్ ఆఫ్ ద డే విధానం అన్ని సందర్భాల్లోనూ భారత్‌లో విజయవంతం కాదన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్‌తో షియోమీ జత కలిసిందని వారంటున్నారు.