ముంబై : షావోమి 2017 నవంబర్‌లో ప్రారంభించించిన ట్రేడ్ ఇన్ కార్యక్రమాన్ని ఇక మీదట తన వెబ్‌సైట్ ఎంఐ.కామ్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా షావోమి తన వినియోగదారులకు ఇన్‌స్టాంట్ ఎక్స్చేంజ్ కూపన్లను అందిస్తోంది. ఈ కూపన్లతో వినియోగదారులు పాత స్మార్ట్ ఫోన్లను ఇచ్చి, కొత్త ఫోన్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కాషీఫై భాగస్వామ్యంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని తొలుత అన్ని షావోమీ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టోర్లకే పరిమితమైన ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని షావోమి తన వెబ్‌సైట్ ఎంఐ.కామ్‌లోకి కూడా విస్తరించింది.
ఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందడానికి, ఎంఐ.కామ్‌లో దానికి కేటాయించిన ప్రత్యేక పేజీలోకి వెళ్లాలి. అక్కడ ఎక్స్చేంజ్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. షావోమి మీ ఫోన్ కండీషన్, ప్రస్తుతం మార్కెట్లో దాని విలువను బట్టి మీకు ఉత్తమ ఎక్స్చేంజ్ ధరను సూచిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర నచ్చితే మీ ఫోన్ ఐఎమ్‌ఈఐ నంబర్ సహాయంతో ఎక్స్చేంజ్ వాల్యూ కూపన్ని పొందవచ్చు. ఈ నగదు మీ ఎమ్‌ఐ అకౌంట్‌కి జమ అవుతుంది. ఆ ఎక్స్చేంజ్ కూపన్ సహాయంతో మీరు మీకు నచ్చిన కొత్త షావోమి ఫోన్‌ను తీసుకోవచ్చు.
ఎక్స్చేంజ్‌లో ఫోన్ కొనాలంటే కచ్చితంగా మీ పాత ఫోన్ పనిచేస్తూ ఉండి, ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా ఉండాలనే నిబంధనను పెట్టింది కంపెనీ. మీ పాత ఫోన్ స్ర్కీన్‌లాక్‌ను తీసేసి, మిగతా సీక్రేట్ లాక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అన్‌లాక్ చేసి ఇవ్వాలని పేర్కొంది. షావోమి లిస్ట్‌లో ఉన్న ఫోన్లకే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వినియోగదారుడు ఒక‍్కసారి ఒక్క ఫోన్‌ను మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్చేంజ్ కూపన్ వాలిడిటి కేవలం 14 రోజులు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం స్మార్ట్‌ఫోన్లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment