సెల్‌పోయిందా.. గుర్తించండిలా..
విజయనగరం: సెల్‌ఫోన్.. ప్రతి ఒక్కరికీ రోజువారీ కార్యకలాపాల్లో భాగమైపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లు కనిపించడం సర్వసాధారణమైపోయింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ఫోన్ చోరీకి గురవడమో లేదా పోవడమో జరుగుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఈ రకమైన సాఫ్ట్‌వేర్ ఉంటే మన ఫోన్ ఎక్కడున్నా మనం ఇట్టే పట్టుకోవచ్చు. పోయిన ఫోన్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? దాని కోసం ఏం చేయాలి..?
ఐఎంఈఐ నంబర్ తప్పనిసరి...
* మీ సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిఫయర్ నంబర్) ఉండాలి.
* మీరు సెల్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు బిల్‌పై ఈ నంబర్ కచ్చితంగా ఉంటుంది. ఉండేలా చూసుకోవాలి.
* అదే లేకపోతే మీ ఫోన్ నుంచి స్టార్ యాప్ 06 యాష్‌ను డయల్ చేస్తే స్క్రీన్‌పై మీ ఐఎంఈఐ నంబర్ కనిపిస్తుంది.
* దీని ఆధారంగా నెట్‌లోని కొన్ని సైట్లు పోయిన మీ ఫోన్ వివరాలు అందిస్తాయి.
మొబైల్ థెఫ్ట్ యాప్స్
* ఇంటర్నెట్‌లో చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
* వీటిని మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
* ఇక్కడ కూడా మీరు ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ ఇవ్వాలి
* దొంగతనానికి గురైన ఫోన్‌లో సిమ్ వేసి వాడుతుంటే మీరు రిజిస్టర్ చేసిన సమయంలో ఇచ్చిన నంబర్‌కు చోరీ అయిన ఫోన్ నంబర్, ప్రాంతం ఎస్‌ఎంఎస్ ద్వారా అందుతుంది.
వెబ్‌సైట్‌లు :
http://www.trackimel.co.in/
http:www.lookout.com/
https://www.avst.com/enin/freemobilsecurity
https://play.google.com/store/apps/details?idmobile
https://theftspy.com/
పైన పేర్కొన్న వెబ్‌లు మాత్రమే కాకుండా ఇంకా అనేకం ఈ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని పే బిల్ సర్వీసులు ఉన్నాయి. సంబంధిత సైటుల్లో మీ ఫోన్ నంబర్ నమోదు చేసుకుని మీ వ్యక్తిగత వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్ నంబర్ పొందుపరచాలి. పోయిన మీ ఫోన్ వాడుకలో ఉంటే వెంటనే మీకు సమాచారం వస్తుంది.
అంతకుముందే పోయిన మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌తో పోలీసు కంప్లయింట్ ఇవ్వాలి. మీకు వచ్చిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే మీ ఫోన్‌ను తిరిగి పట్టుకోవచ్చు.