IMEI number
-
మీరు ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పోయిందా? ఇలా కనిపెట్టేయొచ్చు!
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పోతే. ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా అందులో ఉండే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు వేరే వాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. అందుకే ఫోన్ పోయిందని తెగ హైరానా పడిపోతుంటాం. గతంలో ఫోన్ పోయిందంటే.. కొత్త ఫోన్ కొనుక్కోవడం తప్పా..పోయిన ఫోన్‌ను తిరిగి దక్కించుకునే అవకాశం ఉండేది కాదు. ఇదిగో ఈ తరహా సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర టెలికాం విభాగం (dot), సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (ceir) పేరుతో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల సాయంతో పొగొట్టుకున్న ఫోన్‌ను వెతికి పట్టుకోవచ్చు. తొలిసారిగా 2019 సెప్టెంబర్ నెలలో కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. ముందుగా కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా - నగర్ హవేలీ,గోవా, మహరాష్ట్రలో,అదే ఏడాది డిసెంబర్ నెలలో ఢిల్లీలో లాంచ్ చేసింది. చదవండి👉 ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్! ఐఎంఈఐ నెంబర్ ఉందా? కేంద్రం నిర్వహణలో సీఈఐఆర్ వెబ్ సైట్, యాప్స్ పనిచేస్తాయి. వీటిద్వారా కాణీ ఖర్చు లేకుండా ఐఎంఈఐ నెంబర్ సాయంతో మీ ఫోన్‌ను దక్కించుకోవచ్చు. *#06# డయల్ చేస్తే ఐఎంఈఐ నెంబర్‌ను పొందవచ్చు. పొగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి ఎలా పొందాలి? ►సీఈఐఆర్ డేటా బేస్‌లో అన్నీ సంస్థల మొబైల్ ఆపరేటర్లు ఐఎంఈఐ డేటా ఉంటుంది. ఇందుకోసం కేంద్రం మొబైల్ బ్రాండ్స్, నెట్ వర్క్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తుంది. ►సీఈఐఆర్ IMEI నంబర్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. సిమ్ కార్డ్ మార్చినా ఆ ఫోన్ పనిచేయదు. ►ఒక వేళ ఫోన్‌ను పొగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఫోన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకోవాలి. ►తర్వాత సీఈఐఆర్ పోర్టల్ ఓపెన్ చేస్తే అందులో బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అదే ఆప్షన్లో డివైజ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మీ ఫోన్‌కు సంబంధించిన మొత్తం వివరాలతో పాటు మీరు మీ ఫోన్‌ను చివరి సారిగా పోగొట్టుకున్న సమయం వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం ఎఫ్ఐఆర్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ►యూజర్ సమర్పించిన వివరాల ఆధారంగా పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్ బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేసిన ఫోన్లో సిమ్ మార్చి వేరే సిమ్ వేసినా, వినియోగించినా ఐఎంఈఐ సాయంతో ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టేస్తుంది. ►ఫోన్ దొరికిన వెంటనే ఆ ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసేందుకు సీఈఐఆర్ పోర్టల్‌లో అన్ బ్లాక్ ఫౌండ్ మొబైల్‌పై క్లిక్ చేసి రిక్వెస్ట్ ఐడీ, ఫోన్ నంబర్ వివరాలు సమర్పిస్తే ఫోన్‌ను వాడుకోవచ్చు. చదవండి👉 టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే! -
ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్లు.. పొరపాటా లేక స్పష్టత కోసమా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో భాగంగా జారీ చేసిన నోటీసులలో గందరగోళం నెలకొంది. సోమవారం హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్లు లక్ష్మీ జనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇరువు రూ విచారణకు వచ్చేటప్పుడు వారు వినియోగించే మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వెంట తీసుకురావాలని నోటీసులో సిట్ పేర్కొంది. ఫలానా ఫోన్ నంబరు, ఫలానా ఐఎంఈఐ నంబరు గల సెల్‌ఫోన్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని ఆదేశించింది. ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం లేదా చెరపడం కానీ చేయరాదని పేర్కొంది. అయితే బీఎల్ సంతోష్, శ్రీనివాస్.. ఇద్దరికీ సిట్ జారీ చేసిన నోటీసులలో పేరొన్న ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబర్లు ఒకటే ఉండటం గందరగోళానికి తెరతీసింది. ముద్రణలో పొరపాటేనా.. ఇరువురు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సిట్ విచారణాధికారి, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ బి.గంగాధర్ ఈ నెల 16న నోటీసులు జారీ చేశా రు. అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరికీ నోటీసులు జారీ చేసే క్రమంలో ముద్రణలో పొరపాటు జరిగిందా? లేక దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నంబరు ఎవరి దగ్గర ఉంది? ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకోవటానికే అలా ఇద్దరి నోటీసుల్లోనూ ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్ల ను పేర్కొన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబరుకు ‘సాక్షి’ కాల్ చేసేందుకు ప్రయత్నించగా.. ట్రూ కాలర్‌లో బీఎల్ సంతోష్ అనే పేరు రావటం గమనార్హం. దీంతో శ్రీనివాస్‌కు జారీ చేసిన నోటీసు ముద్రణలో సిట్ అధికారు లు పొరపాటు చేసి ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ఈనెల 29లోగా దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సమయం తక్కువగా ఉండటంతో నోటీసుల జారీలో పొరపాట్లు దొర్లి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్కా పట్టణం కాగా.. సిట్ అధికారులు మాత్రం బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎవరికీ భౌతికంగా అందించలేదు.. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు హరియాణాలోని ఫరీదాబాద్ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహాయాజీలను విచారించి న పోలీసులు వారి నుంచి మరింత సమాచారా న్ని రాబట్టారు. వీటి ఆధారంగా సంతోష్, శ్రీనివాస్‌లతో పాటు కేరళలో బీజే పీకి మిత్రపక్షమైన భరత్ ధర్మజనసేన(బీడీజేఎస్) అధినేత తుషార్ వెల్లపళ్లి, రామచంద్రభారతికి మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామికి కూడా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కూడా సిట్ అధికారులు భౌతికంగా నోటీసులు అందించకపోవటం గమనార్హం. శ్రీనివాస్, జగ్గు స్వామి ఇళ్లకు నోటీసులు అతికించగా, తుషార్ ఇంట్లో లేకపోవటంతో ఆయన ఆఫీసు సెక్రటరీకి నోటీసులు అందించారు. అయితే ఈనెల 3న సీఎం కేసీఆర్.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి సంభాషించిన ఆడియో, వీడి యో రికార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో రామచంద్రభారతి, బీఎల్ సంతోష్, సునీల్‌కుమార్ బన్సల్, తుషార్ పేర్లను పలుమార్లు ప్రస్తావించారు. ఇందులో సంతోష్, తుషార్లకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. బన్సల్‌కు నోటీసులు జారీ చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత కోసమేనా? కాగా.. అరెస్టు సమయంలో రామచంద్రభా రతి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోని కాంటాక్ట్‌లను పరిశీలించగా.. ‘సంతోష్ బీజేపీ’ పేరిట ఉన్న ఫోన్ నంబర్‌కు ఇంగ్లీషులో పంపిన సందేశాలను పోలీసులు గుర్తించారు. ‘నేను రామచంద్రభారతిస్వా మీజిని, హరిద్వార్ బైఠక్‌లో మిమ్మల్ని కలిశా. తెలంగాణలో కీలకాంశాలపై చర్చించాలి. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ అపాయింట్మెంట్ కావాలి, ఆ ముగ్గురికీ కొంత విట మిన్ ఎం అవసరం.. వంటి పలు సందేశాలను పోలీసులు గుర్తించారు. సంతోష్ బీజేపీ నుంచి మాత్రం రామచంద్రభారతికి ఎలాంటి రిప్లైలు వచ్చినట్లు పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత కోసమే సిట్ అధికారులు బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌లకు ఇరువురికీ ఒకే ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబరును తీసుకురావాలని సూచించినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. అసలు ఆ ఫోన్‌ను ఎవరు వినియోగిస్తున్నారో బయటపడుతుందని చెపుతున్నారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్! -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల అమ్మకానికి ముందే ఐఎంఈఐ నంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ ఆదేశాలు వెలువరించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. దేశీయంగా తయారైన లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్‌కూ ఈ నిబంధన వర్తిస్తుంది. అమ్మకానికి ముందే టెలికం శాఖకు చెందిన ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ పోర్టల్ నుంచి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ధ్రువీకరణ పొందాల్సిందే. ప్రతి మొబైల్‌కూ 15 అంకెల ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది. మొబైల్ పరికరాల గుర్తింపు సంఖ్యను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం నెట్‌వర్క్‌లో ఒకే ఐఎంఈఐతో నకిలీ పరికరాలు ఉండటం వల్ల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సాధ్యం కావడం లేదు. కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి హ్యాండ్సెట్ల విస్తరణను అరికట్టడానికి నకిలీ పరికరాల నియంత్రణకై ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ వ్యవస్థను జోడించింది. దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్‌ను నిరోధించే సౌకర్యం మాత్రమే ప్రస్తుతం పోర్టల్‌లో అందుబాటులో ఉంది. చదవండి: బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు! -
మీ ఫోన్ పోయిందా? అయితే ఇలా కనిపెట్టండి!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లను పోగొట్టుకోవడం, లేదంటే వాటిని దొంగతనం చేయడం సర్వ సాధారణమైంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ ఫోన్ థెప్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు, గతేడాది ముంబైలో ఎన్ని ఫోన్లు పోయాయి? వాటిపై ఎన్ని కేసులు నమోదయ్యాయో? తెలుపుతూ తాజాగా ఓ డేటా విడుదలైంది. ఆ డేటా ప్రకారం.. ►2021లో ముంబై నగరంలో మొత్తం 48,856 ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగతనం జరిగాయి ►ఇలా యూజర్లు ప్రతి రోజు కనీసం 134 ఫోన్లను కోల్పోయారు ►దొంగిలించిన, పోగొట్టున్న మొత్తం 52,883 ఫోన్లను ఇతరులు వినియోగింస్తున్నట్లు తేలింది. ►దొంగతనం జరిగిన ఫోన్లపై 3.5శాతంతో 1,853 ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనట్లు ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ తరుణంలో ఫోన్ దొంగతనం జరిగిందంటే ఐఎంఈఐ నెంబర్‌తో పోగొట్టుకున్న ఫోన్‌ను ఈజీగా గుర్తించవచ్చని, పోగొట్టుకున్న ఫోన్‌కు ఐఎంఈఐ (imei) నెంబర్ థంబ్ ప్రింట్లా ఉపయోగ పడుతుందని హ్యాకింగ్ నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు మనం ఆ ఐఎంఈఐ నంబర్ అంటే ఏమిటి? ఆ నెంబర్‌ను ఎలా గుర్తించాలి? ఆ నెంబర్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఐఎంఈఐ అంటే? ఐఎంఈఐ అంటే International Mobile Equipment Identity. ఇది ఒక ప్రత్యేకమైన 15-అంకెల సంఖ్య. ఈ నెంబర్‌తో సాయంతో పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడ ఉంది. వారి వివరాల్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్‌ను వినియోగిస్తే. మీకు రెండు ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి. ప్రతి సిమ్ స్లాట్‌కు ఒక ఐఎఈఐ నెంబర్ ఉంటుంది. మీ ఫోన్లో ఐఎంఈఐ నెంబర్ని ఎలా గుర్తించవచ్చు? ఐఎంఈఐ నెంబర్ సాధారణంగా మీ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.. ఆ నెంబర్‌ను స్టిక్లరపై ముంద్రించి ఫోన్ బాక్స్‌లో ఉంచి ఇస్తారు.మీ ఐఎంఈఐ నెంబర్‌ను గుర్తించేందుకు మరొక మార్గం. మీ మొబైల్లో *#06# డయల్ చేయడం. డయల్ చేస్తే ఐఎంఈఐతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఐఎంఈఐ ఎలా ఉపయోగపడుతుంది? మీ స్మార్ట్ ఫోన్ పోయినా లేదా దొంగిలించినా నెట్వర్క్ ప్రొవైడర్లు IMEI నంబర్ని ఉపయోగించి దాన్ని ట్రాక్ చేయవచ్చు. ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా..మీరు ఉపయోగిస్తున్న ఫోన్ పోతే.. ఇతరులు ఏ నెట్ వర్క్‌లకు పోర్టబుల్ అవ్వకుండా డిస్ కనెక్ట్ చేయోచ్చు. ఇతర ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. దీంతో మీ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్,ఇన్ కమింగ్ కాల్స్ రావు. ఇంటర్నెట్ కూడా పనిచేయదు. సౌకర్యాలతో పాటు ఈ ఐఎంఈఐ కోడ్ బ్రాండ్, మోడల్, విడుదలైన సంవత్సరం, స్పెసిఫికేషన్లతో సహా మొబైల్ గురించిన అనేక ఇతర వివరాల్ని వెల్లడిస్తుంది. మీరు https:// www imei .info/ని సందర్శించి అందులో మీ IMEI నంబర్ని నమోదు చేసుకుంటే ఫలితం ఉంటుంది. మీ ఫోన్ పోతే ఏం చేయాలి? ♦ పొరపాటు మీరు మీ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే ముందుగా అది రింగ్ అవుతుందో లేదో చెక్ చేయడం. మన అదృష్టం బాగుంటే మీరు ఫోన్ చేసినప్పుడు చేసినప్పుడు అవతల వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేస్తే.. మీ ఫోన్‌ను మీరు పొందవచ్చు. ♦ మీరు మీ iCloud లేదా Googleయాక్సెస్ చేయడం ద్వారా మీ డేటాను ఆన్లైన్లో తొలగించవచ్చు. ♦ దొంగతనం జరిగిందని భావిస్తే వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ♦ మీ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా సంప్రదించి, మీ సిమ్ కార్డ్‌ని బ్లాక్ చేయించండి. ఇతరులు మీ నెంబర్‌ను వినియోగించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా నిలిపివేయమని వారిని అడగండి. ♦ మీ ఫోన్‌కి కనెక్ట్ అయిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్, జీమెల్స్ పాస్‌వర్డ్‌లను మార్చండి. చదవండి👉 భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్లు ‘బ్యాన్’, స్పందించిన కేంద్రం! -
మీ ఫోన్ పోయిందా? అయితే ఇలా చేయండి
బయటి నుంచి వచ్చిన పూర్ణ (పేరు మార్చడమైనది) బ్యాగుని పక్కన పడేసి, మంచినీళ్లు తాగి సోఫాలో కూలబడింది. కాస్త సేదతీరగానే ఫోన్‌కోసం చూసింది. టేబుల్ మీద లేదు. బ్యాగులో వెదికింది. కనిపించలేదు. ఆందోళనగా అనిపించింది. షాపింగ్ బ్యాగ్స్ అన్నీ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. షాపింగ్ మాల్స్, ఆటో.. ఎక్కడ మర్చిపోయిందో, లేక పడిపోయిందో కూడా గుర్తులేదు. ఖరీదైన ఫోన్ అనుకున్న కాసేపట్లోనే, అందులో అంతకన్నా విలువైన కాంటాక్ట్ నెంబర్లు, ఫొటోలు, వీడియోలు... డేటా ఉంటుంది కదా! అన్న ఆలోచన ఆమెను క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు. ఆ తర్వాత ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలిసి, కాస్త స్థిమిత పడింది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం. ఇదే కాకుండా... httpr://cybercrime.gov.inలో జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. సైబర్ క్రైమ్ ఫిర్యాదును నమోదు చేయడానికి సంబంధిత కాల్ సెంటర్ నంబర్ 155260 (ఇప్పుడు 1930కి మార్చబడింది)కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయచ్చు. భారతీయ టెలికాం డిపార్ట్మెంట్ httpr://ceir.gov.inలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ను నేరుగా బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు. ముఖ్యమైన విషయం గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, IMEI నంబర్ ప్రత్యేకమైన మొబైల్ హ్యాండ్‌సెట్‌కు కేటాయించబడింది. ఇఉఐఖపోర్టల్లో రిజిస్టర్ ద్వారా మీ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేస్తే, దొంగిలించబడిన మీ మొబైల్ హ్యాండ్సెట్ ఏ మొబైల్ నెట్వర్క్ కంపెనీతోనూ ఎటువంటి నెట్వర్క్ కవరేజీని ప్రారంభించదు. మీ మొబైల్ (KYM) గురించి సెకండ్ హ్యాండ్ లేదా బాగు చేసిన ఫోన్ లను కొనుగోలు చేసే ముందు మీరు KYM ఫీచర్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మొబైల్ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నదా, నకిలీదా లేదా ఇప్పటికే వేరొకరు ఉపయోగిస్తున్నారా.. అనేది దాని స్థితిని చూపుతుంది. మీరు కొనుగోలుచేసే ఫోన్ తప్పనిసరిగా ప్యాకేజింగ్ బాక్స్/ మొబైల్ బిల్లు/ఇన్ వాయిస్‌లో IMEI రాసి ఉండాలి. ప్రత్యామ్నాయంగా మీరు *#06# డయల్ చేయడం ద్వారా మీ మొబైల్ IMEI నంబర్‌ను తనిఖీ చేయవచ్చు. మొబైల్ ఫోన్ అన్‌బ్లాక్ ►మొబైల్ ఫోన్ బ్లాక్, అన్‌బ్లాక్, ప్రస్తుత స్థితి కనుక్కోవడానికి httpr://ceir.gov.in/Qequert/CeirUrerUnblockQequertDirect.jrp ►ఆండ్రాయిడ్ ఫోన్లో డేటాను తొలగించడానికి.. https://support.google.com/accounts/answer/6160491?hl=en ►Erase a device in Find My iPhone on iCloud.comలో పోయిన ఐఫోన్‌ను కనుక్కోవచ్చు, బ్లాక్ చేయవచ్చు. ►ఆండ్రాయిడ్ పరికరాన్ని కనుక్కోవడానికి httpr://www.google.com/android/find కి లాగిన్ అయ్యి, వివరాలన్నీ నమోదు చేసి, మొబైల్లో డేటా తొలగించవచ్చు. ►ఆపిల్ పరికరాన్ని కనుక్కోవడానికి https://support.apple.com/en-in/guide/icloud/ mmfc0ef36f/icloud కి లాగిన్ అయ్యి, వివరాలన్నీ నమోదు చేసి, డేటా తొలగించవచ్చు. -
13 వేల ఫోన్లకు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్
మీరట్ : 13,500 మొబైల్ ఫోన్లు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్(ఇంటర్ నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) కలిగి ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌కు చెందిన ఓ పోలీసు అధికారి సెల్‌ఫోన్ కొద్దిరోజుల క్రితం పాడైంది. అయన దాన్ని రిపేరు చేయించారు. అయినప్పటికి అది సరిగా పనిచేయలేదు. దీంతో దాన్ని సైబర్ క్రైం విభాగానికి చెందిన ఓ సిబ్బందికి అప్పగించి, సమస్య ఎంటో చూడమన్నారు. ఈ నేపథ్యంలో ఐఎమ్‌ఈఐల విషయం వెలుగులోకి వచ్చింది. ( కొడుకు కళ్లెదుటే.. భర్త దారుణం ) దీంతో సదరు మొబైల్ కంపెనీ, సర్వీస్ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మీరట్ ఎస్పీ అఖిలేష్ ఎన్. సింగ్ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 13,500 ఫోన్లు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్‌పై పనిచేస్తున్నాయి. ఇది భద్రతకు సంబంధించిన సీరియస్ సమస్య. మొబైల్ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తులు వారి స్వలాభానికి దాన్ని వాడుకునే అవకాశం ఉంది’’ అని అన్నారు. ( మేనకా గాంధీపై కేసు నమోదు ) -
సెల్ పోతే గోవిందా..
ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ ఫీచర్లున్న సెల్ ఫోన్లు వస్తున్నాయి. ఖరీదు ఎక్కువైనా యువత వాటిని వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు. వాటిని పోగొట్టుకుంటే మాత్రం అంతే సంగతులు. దొంగలు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లలో ఉన్న సెక్యూరిటీ నెంబర్లను తొలగిస్తున్నా రు. ఐఎంఈఐ నెంబర్లను మార్చేసి సెకండ్ హ్యాండ్ కింద మార్కెట్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. జాగ్రత్త పడితే తప్ప ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారు. తిరుపతి క్రైం: జిల్లాలో ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ దొంగలు ఎక్కువయ్యారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను టార్గెట్ చేసుకుని దోచేస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా సుమారు 700లకు పైగా మొబైల్ ఫోన్లు చోరీకి గురువుతున్నట్టు సమాచారం. గడిచిన ఏడు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా మొబైల్స్ పోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సెల్‌ఫోన్ చోరీలను అంతర్రాష్ట్ర ముఠాలే కాకుండా చిన్నపాటి నేరాలకు డబ్బులకు అలవాటుపడిన ఆకతాయిలు కూడా చేస్తున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విద్యార్థులు, హై క్లాస్ డిగ్రీలు చదువుకున్న విద్యార్థులు సైతం ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఖరీదైన ఫోన్లే టార్గెట్ జల్సాలకు అలవాటుపడిన యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. స్నేహితులు, బంధువుల వద్దే సెల్ఫోన్లు కాజేస్తున్నారు. చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు చెందిన వారు సైతం సెల్ఫోన్లనే టార్గెట్ చేస్తున్నారు. తొందరపాటులో సాధారణ ఫోన్లను కాజేసినా కాలువల్లో పడేస్తున్నారు. రూ.10వేలు ఆపై రేటు పలికే మొబైల్స్‌నే చోరీ చేస్తున్నారు. ఫోన్ కోడ్ మార్చేసి.. విక్రయాలు పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు సెల్‌ఫోన్ భద్రతకు సంబంధించిన కోడ్ (ఐఎంఈఐ) నెంబర్‌ను పూర్తిగా తొలగిస్తారు. ఆధునిక టెక్నాలజీతో కొత్త నెంబర్‌ను ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇందుకోసం మొబైల్ వ్యాపారులు, ఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ విద్యార్థుల సాయం తీసుకుంటున్నారు. మొబైల్ రేటును బట్టి వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉండడంతో ఐటీ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఇలాంటివి నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. తర్వాత వాటిని పొరుగు రాష్ట్రాలకు పంపి మంచి ధరకు విక్రయిస్తున్నారు. ఫిర్యాదుకు ఆసక్తి చూపని బాధితులు మొబైల్ పోయిందంటూ ఫిర్యాదు చేసేందుకు చాలా మంది బాధితులు ఆసక్తి చూపడంలేదు. విలువైన మొబైల్స్ పోయినప్పుడు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చోరీ చేసిన మొబైల్స్‌ను విక్రయించే స్థలాలను పోలీసులు గుర్తించినా నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో దొంగలు దొరికినా ఉన్నతస్థాయి అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి కేసుల నమోదుకు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిదీ ఒక స్టైల్ మొబైల్ దొంగతనాల్లో ఎవరి స్టైల్ వారిదే. జిల్లాలో ఆరు విభిన్న తరహాలో సెల్ఫోన్ల చోరీ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు పక్కనే ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఏమరపాటుగా ఉన్న సమయంలో ఫోన్లను చాకచక్యంగా అపహరిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలకు పాల్పడుతున్నారు. ♦ ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో కిటికీ వైపు పడుకుని ఉన్నాడు. ఒక యువకుడు అతన్ని గమనించాడు. నిద్రమత్తులో ఉన్న అతని జేబులోని సెల్ ఫోన్‌ను చాకచక్యంగా కొట్టేశాడు. ♦ పట్టుమని పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు చేతిలో కవరు పెట్టుకుని కూరగాయల మార్కెట్లో తిరుగుతూ వంగి కూరగాయలు ఏరే సమయంలో ఆ కవరు ప్యాంట్ జేబుకు అడ్డుపెట్టి మెల్లగా సెల్‌ఫోన్‌ను కాజేస్తాడు. ♦ షేర్ ఆటోలో అధిక రద్దీ ఉన్న సమయం చూసి అతనికి ఏ జేబు దొరికితే ఆ జేబులోని మొబైల్ కాజేసి చాకచక్యంగా పరారవుతాడు. రికవరీ చేస్తున్నాం నిత్యం ఎక్కడో ఒక చోట సెల్ఫోన్లు పోతూనే ఉన్నాయి. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో నెలకు 8 ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో 50 నుంచి 60 శాతం వరకు సెల్ఫోన్లను రికవరీ చేస్తున్నాం. చాలా వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి. స్థానిక పోలీసుల సాయంతో వాటిని తెప్పించి బాధితులకు అందజేస్తున్నాం. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మొబైల్స్‌ను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. – మునిరామయ్య, ఈస్టు సబ్ డివిజనల్ డీఎస్పీ -
పాత ఫోన్ ఇవ్వండి.. కొత్త ఫోన్ తీసుకోండి
ముంబై : షావోమి 2017 నవంబర్‌లో ప్రారంభించించిన ట్రేడ్ ఇన్ కార్యక్రమాన్ని ఇక మీదట తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా షావోమి తన వినియోగదారులకు ఇన్స్టాంట్ ఎక్స్చేంజ్ కూపన్లను అందిస్తోంది. ఈ కూపన్లతో వినియోగదారులు పాత స్మార్ట్ ఫోన్లను ఇచ్చి, కొత్త ఫోన్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కాషీఫై భాగస్వామ్యంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని తొలుత అన్ని షావోమీ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టోర్లకే పరిమితమైన ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని షావోమి తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లోకి కూడా విస్తరించింది. ఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందడానికి, ఎంఐ.కామ్‌లో దానికి కేటాయించిన ప్రత్యేక పేజీలోకి వెళ్లాలి. అక్కడ ఎక్స్చేంజ్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. షావోమి మీ ఫోన్ కండీషన్, ప్రస్తుతం మార్కెట్లో దాని విలువను బట్టి మీకు ఉత్తమ ఎక్స్చేంజ్ ధరను సూచిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర నచ్చితే మీ ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్ సహాయంతో ఎక్స్చేంజ్ వాల్యూ కూపన్‌ని పొందవచ్చు. ఈ నగదు మీ ఎమ్ఐ అకౌంట్‌కి జమ అవుతుంది. ఆ ఎక్స్చేంజ్ కూపన్ సహాయంతో మీరు మీకు నచ్చిన కొత్త షావోమి ఫోన్‌ను తీసుకోవచ్చు. ఎక్స్చేంజ్లో ఫోన్ కొనాలంటే కచ్చితంగా మీ పాత ఫోన్ పనిచేస్తూ ఉండి, ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా ఉండాలనే నిబంధనను పెట్టింది కంపెనీ. మీ పాత ఫోన్ స్ర్కీన్లాక్ను తీసేసి, మిగతా సీక్రేట్ లాక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అన్‌లాక్ చేసి ఇవ్వాలని పేర్కొంది. షావోమి లిస్ట్‌లో ఉన్న ఫోన్లకే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వినియోగదారుడు ఒక్కసారి ఒక్క ఫోన్‌ను మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్చేంజ్ కూపన్ వాలిడిటి కేవలం 14 రోజులు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం స్మార్ట్ఫోన్లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
ఐఎంఈఐ టాంపరింగ్ చేస్తే...
సాక్షి, న్యూఢిల్లీ: సెల్ ఫోన్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. మొబైల్లో కీలకమైన 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐఎంఈఐ) మార్చితే కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపధ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డాట్) కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. ఐఎంఈఐ టాంపరింగ్ చేసినా, మార్చినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించనుంది. ఉత్పత్తి దారుడు తప్ప మిగిలిన ఎవరైనా ఐఎంఈఐ నెంబర్‌ను మార్చడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 15 డిజిట్ల ఈ నెంబరును టాంపరింగ్ చేస్తే ఐఎంఈఐ 2017 నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షకు అర్హులని పేర్కొంది. తయారు చేసిన కంపెనీ తప్పించి వేరే ఎవరు మార్చినా, తొలగించినా మూడేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. తద్వారా నకిలీ ఐఎంఈఐ సంఖ్యలకు సంబంధించిన సమస్యలను అరికట్టడానికి , కోల్పోయిన మొబైల్ ఫోన్ల ట్రాకింక్‌ను కూడా సులభతరం చేయనున్నామని టెలికాం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.భారతీయ టెలిగ్రాఫ్ చట్టం 2017 చట్టంలోని 7, 25 సెక్షన్ల ప్రకారం ఈ నిబంధనలను రూపొందించింది ఐఎంఈఐ నెంబర్ల మార్పిడిపై కఠినమైన చట్టాలను రూపొందించే యోచనలో ఇటీవల డాట్ సంప్రదింపులు ప్రారంభించింది. ఈ కేసుల విచారణ సందర్భంగా ఒకే ఐఎంఈఐ నెంబర్‌తో సుమారు 18వేల హ్యాండ్సెట్లను డాట్‌కు చెందిన టెలికాం ఎన్ఫోర్స్మెంట్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ (TERM) సెల్ కనుగొంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మొబైల్‌చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త పద్ధతిని టెలికాం శాఖ అమల్లోకి తెస్తోంది. చోరీకి గురైన ఫోన్లలో సిమ్ కార్డు మార్చినా, ఐఎంఈఐ నెంబర్‌ను మార్చినా అన్ని నెట్‌వర్క్‌లను బ్లాక్ చేయనుంది. కాగా సాధారణ మొబైల్స్‌నుంచి హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో స్మార్ట్ఫోన్ల చోరీలు కూడా నమోదవుతున్నాయి. కొట్టేసిన మొబైల్ తాలూకు ఐఎంఈఐ నెంబర్లనుమార్చి.. వాటిని ట్రాక్ చెయ్యడానికి వీల్లేకుండా IMEI నెంబర్లు మార్చేసి వాడే వారు ఎక్కువైన సంగతి తెలిసిందే. -
ఐఎంఈఐ నెంబర్ తారుమారు చేస్తే జైలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లకు ఉండే 15 అంకెల ఐఎంఈఐ నెంబర్‌ను ట్యాంపర్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. నకిలీ ఐఎంఈఐ నెంబర్లను అరికట్టడంతో పాటు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఫోన్ తయారీదారు కాకుండా వేరొకరు ఉద్దేశపూర్వకంగా ఐఎంఈఐ నెంబర్‌ను తొలగించడం, మార్చడం చట్టవిరుద్ధమని టెలికాం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఎంఈఐ నెంబర్‌ను మార్చడం, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం ఈ నిబంధనల కింద నేరంగా పరిగణిస్తారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌కు యూనిక్ ఐడీగా ఐఎంఈఐ నెంబర్‌ను కోడ్ చేస్తారు. సిమ్‌ను మార్చడం ద్వారా హ్యాండ్‌సెట్‌లో మొబైల్ నెంబర్‌ను మార్చడం సాధ్యమవుతుంది. అయితే ఐఎంఈఐ నెంబర్‌ను ప్రత్యేక పరికరాలతో సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే మార్చగలరు. ఈ తరహా ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కఠిన నిబంధనలతో ముందుకొచ్చింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఐఎంఈఐ నెంబర్‌ను తారుమారు చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. -
సెల్పోయిందా.. గుర్తించండిలా..
విజయనగరం: సెల్‌ఫోన్.. ప్రతి ఒక్కరికీ రోజువారీ కార్యకలాపాల్లో భాగమైపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లు కనిపించడం సర్వసాధారణమైపోయింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ఫోన్ చోరీకి గురవడమో లేదా పోవడమో జరుగుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రకమైన సాఫ్ట్వేర్ ఉంటే మన ఫోన్ ఎక్కడున్నా మనం ఇట్టే పట్టుకోవచ్చు. పోయిన ఫోన్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? దాని కోసం ఏం చేయాలి..? ఐఎంఈఐ నంబర్ తప్పనిసరి... * మీ సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫయర్ నంబర్) ఉండాలి. * మీరు సెల్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు బిల్‌పై ఈ నంబర్ కచ్చితంగా ఉంటుంది. ఉండేలా చూసుకోవాలి. * అదే లేకపోతే మీ ఫోన్ నుంచి స్టార్ యాప్ 06 యాష్‌ను డయల్ చేస్తే స్క్రీన్‌పై మీ ఐఎంఈఐ నంబర్ కనిపిస్తుంది. * దీని ఆధారంగా నెట్‌లోని కొన్ని సైట్లు పోయిన మీ ఫోన్ వివరాలు అందిస్తాయి. మొబైల్ థెఫ్ట్ యాప్స్ * ఇంటర్నెట్లో చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. * వీటిని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. * ఇక్కడ కూడా మీరు ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ ఇవ్వాలి * దొంగతనానికి గురైన ఫోన్లో సిమ్ వేసి వాడుతుంటే మీరు రిజిస్టర్ చేసిన సమయంలో ఇచ్చిన నంబర్‌కు చోరీ అయిన ఫోన్ నంబర్, ప్రాంతం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. వెబ్సైట్లు : http://www.trackimel.co.in/ http:www.lookout.com/ https://www.avst.com/enin/freemobilsecurity https://play.google.com/store/apps/details?idmobile https://theftspy.com/ పైన పేర్కొన్న వెబ్‌లు మాత్రమే కాకుండా ఇంకా అనేకం ఈ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని పే బిల్ సర్వీసులు ఉన్నాయి. సంబంధిత సైటుల్లో మీ ఫోన్ నంబర్ నమోదు చేసుకుని మీ వ్యక్తిగత వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్ నంబర్ పొందుపరచాలి. పోయిన మీ ఫోన్ వాడుకలో ఉంటే వెంటనే మీకు సమాచారం వస్తుంది. అంతకుముందే పోయిన మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌తో పోలీసు కంప్లయింట్ ఇవ్వాలి. మీకు వచ్చిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే మీ ఫోన్‌ను తిరిగి పట్టుకోవచ్చు. -
మొబైల్ పోయిందా.. గుర్తించండిలా..
సెల్‌ఫోన్... ఇది ప్రతి వ్యక్తికి రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లు కన్పించడం సర్వసాధారణ విషయంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి మన ఫోన్ చోరీకి గురవడమో లేదా పోగొట్టుకోవడమో జరుగుతుంది. ఒకప్పుడు ఫోన్ పోతే మరిచిపోవడం మినహా ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు అడ్వాన్స్డ్ సాఫ్ట్ వేర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ రకమైన సాఫ్ట్వేర్ ఉంటే మన ఫోన్ మన వద్ద ఉన్నట్టే. మరి పోయిన సెల్ ఎక్కడ ఉంది? ఎలా తెలుసుకోవాలి? దానికోసం ఏం చేయాలి? తదితర వివరాలు మీకోసం... ఐఎంఈఐ నంబర్ తప్పనిసరి.. ⇒మీ సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యుప్మెంట్ ఐడెంటిఫైర్) నంబరు ఉండాలి. ⇒మీరు ఫోన్ కొనుగోలు చేసినప్పుడు బిల్‌పై ఈ నంబరు ఉంటుంది. ⇒అది లేకపోతే మీ ఫోన్ నుంచి*#06#ను డయల్ చేస్తే స్క్రీన్‌పై మీ ఐఎంఈఐ నంబరు కనిపిస్తుంది. ⇒దీని ఆధారంగా నెట్లో కొన్ని సైట్లు పోగొట్టుకున్న మీ ఫోన్ వివరాలు అందిస్తుంది. వెబ్‌లు ⇒ http://www.trackimei.co.in/ ⇒https://www.lookout.com/ పైన పేర్కొన్న వెబ్‌లు మాత్రమే కాకుండా ఇంకా అనేకం ఈ సర్వీసులు అందిస్తున్నాయి. వీటిలో కొన్ని పేబిల్ సర్వీసులు. ⇒సంబంధిత సైట్లలో మీ ఫోన్ నంబరు నమోదు చేసుకుని మీ వ్యక్తిగత వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబరు పొందుపరచాలి. ⇒పోయిన మీ ఫోన్ వాడుకలో ఉంటే వెంటనే మీకు సమాచారం వస్తుంది. మొబైల్ థెఫ్ట్ యాప్స్.. ⇒ఇంటర్నెట్లో చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ⇒వీటిని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని రిజిష్టర్ చేసుకోవాలి. ⇒ఇక్కడ కూడా మీరు ప్రత్యామ్నాయ ఫోన్ నంబరు ఇవ్వాలి. ⇒దొంగతనానికి గురైన ఫోన్లో సిమ్ వేసి వాడుతుంటే మీరు రిజిష్టర్ సమయంలో ఇచ్చిన నంబర్‌కు చోరీ అయిన ఫోన్ నంబరు, ప్రాంతం మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. అందుబాటులో ఉన్న కొన్ని యాప్స్... ⇒https://www.avast.com/enin/freemobilesecurity ⇒https://play.google.com/store/apps/details?id=mmapps.mobile.anti.theft.alarm&hl=en ⇒https://www.cerberusapp.com/ ⇒https://www.theftspy.com/