బయటి నుంచి వచ్చిన పూర్ణ (పేరు మార్చడమైనది) బ్యాగుని పక్కన పడేసి, మంచినీళ్లు తాగి సోఫాలో కూలబడింది. కాస్త సేదతీరగానే ఫోన్‌కోసం చూసింది. టేబుల్ మీద లేదు. బ్యాగులో వెదికింది. కనిపించలేదు. ఆందోళనగా అనిపించింది. షాపింగ్ బ్యాగ్స్ అన్నీ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. షాపింగ్ మాల్స్, ఆటో.. ఎక్కడ మర్చిపోయిందో, లేక పడిపోయిందో కూడా గుర్తులేదు. ఖరీదైన ఫోన్ అనుకున్న కాసేపట్లోనే, అందులో అంతకన్నా విలువైన కాంటాక్ట్ నెంబర్లు, ఫొటోలు, వీడియోలు... డేటా ఉంటుంది కదా! అన్న ఆలోచన ఆమెను క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు.
ఆ తర్వాత ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలిసి, కాస్త స్థిమిత పడింది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం. ఇదే కాకుండా... httpr://cybercrime.gov.inలో జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. సైబర్ క్రైమ్ ఫిర్యాదును నమోదు చేయడానికి సంబంధిత కాల్ సెంటర్ నంబర్ 155260 (ఇప్పుడు 1930కి మార్చబడింది)కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయచ్చు. భారతీయ టెలికాం డిపార్ట్‌మెంట్ httpr://ceir.gov.inలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ను నేరుగా బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు.
ముఖ్యమైన విషయం
గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, IMEI నంబర్ ప్రత్యేకమైన మొబైల్ హ్యాండ్‌సెట్‌కు కేటాయించబడింది. ఇఉఐఖపోర్టల్‌లో రిజిస్టర్ ద్వారా మీ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేస్తే, దొంగిలించబడిన మీ మొబైల్ హ్యాండ్‌సెట్ ఏ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీతోనూ ఎటువంటి నెట్‌వర్క్ కవరేజీని ప్రారంభించదు.
మీ మొబైల్ (KYM) గురించి
సెకండ్ హ్యాండ్ లేదా బాగు చేసిన ఫోన్ లను కొనుగోలు చేసే ముందు మీరు KYM ఫీచర్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మొబైల్ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నదా, నకిలీదా లేదా ఇప్పటికే వేరొకరు ఉపయోగిస్తున్నారా.. అనేది దాని స్థితిని చూపుతుంది. మీరు కొనుగోలుచేసే ఫోన్ తప్పనిసరిగా ప్యాకేజింగ్ బాక్స్/ మొబైల్ బిల్లు/ఇన్ వాయిస్‌లో IMEI రాసి ఉండాలి. ప్రత్యామ్నాయంగా మీరు *#06# డయల్ చేయడం ద్వారా మీ మొబైల్ IMEI నంబర్‌ను తనిఖీ చేయవచ్చు.
మొబైల్ ఫోన్ అన్‌బ్లాక్
►మొబైల్ ఫోన్ బ్లాక్, అన్‌బ్లాక్, ప్రస్తుత స్థితి కనుక్కోవడానికి
httpr://ceir.gov.in/Qequert/CeirUrerUnblockQequertDirect.jrp
►ఆండ్రాయిడ్ ఫోన్‌లో డేటాను తొలగించడానికి..
https://support.google.com/accounts/answer/6160491?hl=en
►Erase a device in Find My iPhone on iCloud.comలో పోయిన ఐఫోన్‌ను కనుక్కోవచ్చు, బ్లాక్ చేయవచ్చు.
►ఆండ్రాయిడ్ పరికరాన్ని కనుక్కోవడానికి httpr://www.google.com/android/find కి లాగిన్ అయ్యి, వివరాలన్నీ నమోదు చేసి, మొబైల్‌లో డేటా తొలగించవచ్చు.
►ఆపిల్ పరికరాన్ని కనుక్కోవడానికి https://support.apple.com/en-in/guide/icloud/ mmfc0ef36f/icloud కి లాగిన్ అయ్యి, వివరాలన్నీ నమోదు చేసి, డేటా తొలగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment