మొబైల్ పోయిందా.. గుర్తించండిలా.. | Mobile lost... indentification know... | Sakshi
Sakshi News home page

మొబైల్ పోయిందా.. గుర్తించండిలా..

Published Mon, Jan 19 2015 3:33 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

మొబైల్ పోయిందా.. గుర్తించండిలా..

మొబైల్ పోయిందా.. గుర్తించండిలా..

సెల్‌ఫోన్... ఇది ప్రతి వ్యక్తికి రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లు కన్పించడం సర్వసాధారణ విషయంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి మన ఫోన్ చోరీకి గురవడమో లేదా పోగొట్టుకోవడమో జరుగుతుంది.

ఒకప్పుడు ఫోన్ పోతే మరిచిపోవడం మినహా ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు అడ్వాన్స్‌డ్ సాఫ్ట్ వేర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ రకమైన సాఫ్ట్‌వేర్ ఉంటే మన ఫోన్ మన వద్ద ఉన్నట్టే. మరి పోయిన సెల్ ఎక్కడ ఉంది? ఎలా తెలుసుకోవాలి? దానికోసం ఏం చేయాలి? తదితర వివరాలు మీకోసం...                               
 
ఐఎంఈఐ నంబర్ తప్పనిసరి..
మీ సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ (ఇంటర్‌నేషనల్ మొబైల్ ఎక్యుప్‌మెంట్ ఐడెంటిఫైర్) నంబరు ఉండాలి.
మీరు ఫోన్ కొనుగోలు చేసినప్పుడు బిల్‌పై ఈ నంబరు ఉంటుంది.
అది లేకపోతే మీ ఫోన్ నుంచి*#06#ను డయల్ చేస్తే స్క్రీన్‌పై మీ ఐఎంఈఐ నంబరు కనిపిస్తుంది.
దీని ఆధారంగా నెట్‌లో కొన్ని సైట్లు పోగొట్టుకున్న మీ ఫోన్ వివరాలు అందిస్తుంది.
 
వెబ్‌లు

http://www.trackimei.co.in/
https://www.lookout.com/  
 
పైన పేర్కొన్న వెబ్‌లు మాత్రమే కాకుండా ఇంకా అనేకం ఈ సర్వీసులు అందిస్తున్నాయి. వీటిలో కొన్ని పేబిల్ సర్వీసులు.
సంబంధిత సైట్‌లలో మీ ఫోన్ నంబరు నమోదు చేసుకుని మీ వ్యక్తిగత వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబరు పొందుపరచాలి.
పోయిన మీ ఫోన్ వాడుకలో ఉంటే వెంటనే మీకు సమాచారం వస్తుంది.  
 
మొబైల్ థెఫ్ట్ యాప్స్..
ఇంటర్‌నెట్‌లో చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
వీటిని మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని రిజిష్టర్ చేసుకోవాలి.
ఇక్కడ కూడా మీరు ప్రత్యామ్నాయ ఫోన్ నంబరు ఇవ్వాలి.
దొంగతనానికి గురైన ఫోన్‌లో సిమ్ వేసి వాడుతుంటే మీరు రిజిష్టర్ సమయంలో ఇచ్చిన నంబర్‌కు చోరీ అయిన ఫోన్ నంబరు, ప్రాంతం మీకు ఎస్‌ఎంఎస్ వస్తుంది.

అందుబాటులో ఉన్న కొన్ని యాప్స్...
https://www.avast.com/enin/freemobilesecurity
https://play.google.com/store/apps/details?id=mmapps.mobile.anti.theft.alarm&hl=en
https://www.cerberusapp.com/
https://www.theftspy.com/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement