ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్‌లను పోగొట్టుకోవడం, లేదంటే వాటిని దొంగతనం చేయడం సర్వ సాధారణమైంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ ఫోన్ థెప్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు, గతేడాది ముంబైలో ఎన్ని ఫోన్‌లు పోయాయి? వాటిపై ఎన్ని కేసులు నమోదయ్యాయో? తెలుపుతూ తాజాగా ఓ డేటా విడుదలైంది. ఆ డేటా ప్రకారం..
►2021లో ముంబై నగరంలో మొత్తం 48,856 ఫోన్‌లు పోగొట్టుకోవడం, దొంగతనం జరిగాయి
►ఇలా యూజర్లు ప్రతి రోజు కనీసం 134 ఫోన్‌లను కోల్పోయారు
►దొంగిలించిన, పోగొట్టున్న మొత్తం 52,883 ఫోన్‌లను ఇతరులు వినియోగింస్తున్నట్లు తేలింది.
►దొంగతనం జరిగిన ఫోన్‌లపై 3.5శాతంతో 1,853 ఎఫ్‌ఐఆర్ కేసులు నమోదైనట్లు ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ తరుణంలో ఫోన్ దొంగతనం జరిగిందంటే ఐఎంఈఐ నెంబర్‌తో పోగొట్టుకున్న ఫోన్‌ను ఈజీగా గుర్తించవచ్చని, పోగొట్టుకున్న ఫోన్‌కు ఐఎంఈఐ (imei) నెంబర్ థంబ్ ప్రింట్‌లా ఉపయోగ పడుతుందని హ్యాకింగ్ నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు మనం ఆ ఐఎంఈఐ నంబర్ అంటే ఏమిటి? ఆ నెంబర్‌ను ఎలా గుర్తించాలి? ఆ నెంబర్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం
ఐఎంఈఐ అంటే?
ఐఎంఈఐ అంటే International Mobile Equipment Identity. ఇది ఒక ప్రత్యేకమైన 15-అంకెల సంఖ్య. ఈ నెంబర్‌తో సాయంతో పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడ ఉంది. వారి వివరాల్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్‌ను వినియోగిస్తే. మీకు రెండు ఐఎంఈఐ నెంబర్‌లు ఉంటాయి. ప్రతి సిమ్ స్లాట్‌కు ఒక ఐఎఈఐ నెంబర్ ఉంటుంది.
మీ ఫోన్‌లో ఐఎంఈఐ నెంబర్‌ని ఎలా గుర్తించవచ్చు?
ఐఎంఈఐ నెంబర్ సాధారణంగా మీ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.. ఆ నెంబర్‌ను స్టిక్లరపై ముంద్రించి ఫోన్ బాక్స్‌లో ఉంచి ఇస్తారు.మీ ఐఎంఈఐ నెంబర్‌ను గుర్తించేందుకు మరొక మార్గం. మీ మొబైల్‌లో *#06# డయల్ చేయడం. డయల్ చేస్తే ఐఎంఈఐతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఐఎంఈఐ ఎలా ఉపయోగపడుతుంది?
మీ స్మార్ట్ ఫోన్ పోయినా లేదా దొంగిలించినా నెట్‌వర్క్ ప్రొవైడర్లు IMEI నంబర్‌ని ఉపయోగించి దాన్ని ట్రాక్ చేయవచ్చు. ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా..మీరు ఉపయోగిస్తున్న ఫోన్ పోతే.. ఇతరులు ఏ నెట్ వర్క్‌లకు పోర్టబుల్ అవ్వకుండా డిస్ కనెక్ట్ చేయోచ్చు. ఇతర ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. దీంతో మీ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్,ఇన్ కమింగ్ కాల్స్ రావు. ఇంటర్నెట్ కూడా పనిచేయదు.
సౌకర్యాలతో పాటు ఈ ఐఎంఈఐ కోడ్ బ్రాండ్, మోడల్, విడుదలైన సంవత్సరం, స్పెసిఫికేషన్‌లతో సహా మొబైల్ గురించిన అనేక ఇతర వివరాల్ని వెల్లడిస్తుంది. మీరు https:// www imei .info/ని సందర్శించి అందులో మీ IMEI నంబర్‌ని నమోదు చేసుకుంటే ఫలితం ఉంటుంది.
మీ ఫోన్ పోతే ఏం చేయాలి?
♦ పొరపాటు మీరు మీ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే ముందుగా అది రింగ్ అవుతుందో లేదో చెక్ చేయడం. మన అదృష్టం బాగుంటే మీరు ఫోన్ చేసినప్పుడు చేసినప్పుడు అవతల వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేస‍్తే.. మీ ఫోన్‌ను మీరు పొందవచ్చు.
♦ మీరు మీ iCloud లేదా Googleయాక్సెస్ చేయడం ద్వారా మీ డేటాను ఆన్‌లైన్‌లో తొలగించవచ్చు.
♦ దొంగతనం జరిగిందని భావిస్తే వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయండి.
♦ మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా సంప్రదించి, మీ సిమ్ కార్డ్‌ని బ్లాక్ చేయించండి. ఇతరులు మీ నెంబర్‌ను వినియోగించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా నిలిపివేయమని వారిని అడగండి.
♦ మీ ఫోన్‌కి కనెక్ట్ అయిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్, జీమెల్స్ పాస్‌వర్డ్‌లను మార్చండి.
చదవండి👉 భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్లు ‘బ్యాన్’, స్పందించిన కేంద్రం!
Comments
Please login to add a commentAdd a comment