Hacks
-
మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..!
కావలసినవి: బొప్పాయి గుజ్జు, బాదం పౌడర్ – 1 కప్పు చొప్పున పీనట్ బటర్, అవిసెగింజల పొడి – అర కప్పు చొప్పున, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూ¯Œ , బాదం – జీడిపప్పు ముక్కలు, మినీ చాక్లెట్ చిప్స్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున కొబ్బరి తురుము – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో బొప్పాయి గుజ్జు, అవిసెగింజల పొడి, బాదం పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎక్స్ట్రాక్ట్, పీనట్స్ బటర్, బాదం – జీడిపప్పు ముక్కలు వేసుకుని.. మరోసారి బాగా కలుపుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని.. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని.. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని కొబ్బరి కోరులో వేసి, దొర్లించి.. సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు! -
నిమ్మచెక్కలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఏం అవుతుందంటే..
కిచెన్ టిప్స్ : ►నిమ్మచెక్కతో మరకలు ఈజీగా పోతాయి కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దాలి. క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి. ► నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్ లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ► ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. ► స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. -
టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!
శీతల పానీయాలు అంటే మనం తాగే కూల్‌డ్రింక్‌లు ఇలా కూడా ఉపయోగపడతాయా! అని నోరెళ్లబెట్డడం ఖాయం. ఎందుకంటే వాటితో తుప్పు మరకల్ని, వదలని మెండి మరకల్ని, బాత్రూంలను, టాయిలెట్ బేసిన్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందట. ఆ కూల్‌డ్రింక్ మనల్ని ఇబ్బంది పెట్టే మొండి మరకలన్నింటిని చాలా ఈజీగా వదలగొడుతుందట. ఆఖరికిగా పెరటి తోట పెంపకంలో క్రిమిసంహరిణీగా కూడా ఉపయోగించొచ్చట. ఇన్నీ చెప్పక కూల్‌డ్రిండ్ తాగొచ్చా అని సందేహం వస్తుందా! సర్లేండి ముందు దీంతో ఎలా మరకల పోతాయొ చూసేద్దామా. ఎలా మరకల్ని వదలగొడుతుందంటే.. మాడిపోయిన పాన్ల మాడుని.. శీతల పానీయంలో ఉండే ఆమ్ల లక్షణం కారణంగా మొండిగా బంకలా పట్టి ఉన్న మరకల్ని సునాయాసంగా వదలగొట్టేస్తుంది. ఎలా అంటే పొరపాటున మాడిపోయిన గృహోపకరణాలు చూసేందుకు మసితో అసహ్యంగా ఉంటాయి. అలాంటి వాటిని గనుక కూల్‌డ్రిండ్ పోసి కాసేపు నానిబెట్టాలి. దీనిలో ఉండే ఆమ్ల గుణం ఆ మసిని తినేసి క్లీన్‌గా కొత్తదానిలో మెరిసిపోయేలా చేస్తుంది. క్రిమి సంహరిణీగా.. మన తోటలో తెగుళ్లను నియంత్రించడానికి ఈ శీతల పానీయాలను ఉపయోగించొచ్చు. మెక్కలను కీటకాలు, తెగుళ్ల నుంచి దూరంగా ఉంచడానకి కూల్‌డ్రింక్‌లను ఓ చిన్న గిన్నెలో వేసి ఉంచితే ఆ వాసన కీటకాలను ఆకర్షించి..దానిలో ఉండే ఆమ్లం వాటిని చంపేస్తుంది. బట్టల మురికి వదిలించడంలో ఈ కూల్‌డ్రింక్స్ దుస్తులపై పడిని మరకలను చాలా బాగా వదలగొడుతుంది. జిడ్డు, తేలికపాటి రక్తపు మరకలను సులభంగా తొలగిస్తుంది. తుప్పు తొలగించడం.. తప్పు పట్టిన బొల్ట్లను, ఐరన్ ట్యాప్, తెల్లటి టైల్స్ పడిని తుప్పు మరకల్ని ఈజీగా వదలగొట్టడమే కాకుండా కొత్తగా ఉండేలా చేస్తుంది. వాష్‌రూమ్ క్లీనర్‌గా.. టాయిలెట్ బేసిన్లో ఉండే మొండి మరకల్సి క్లీన్ చేసి మంచిగా ఉండేలా చేస్తుంది. ఈ కూల్‌డ్రింక్ టాయిలెట్లో ఉన్న మరకలపై నేరుగా పోసి బ్రెష్‌తో క్లీన్ చేసి ఆ తర్వాత ఫ్లష్ నొక్కితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం తొందరగా ట్రై చేసి చూడాండి మరీ.. (చదవండి: వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..) -
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేస్తే తాజాగా ఉంటుంది
రుచిగా, వేగంగా వంట చేయాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి... ♦కూర ఏదైనా రుచికోసం అల్లం వెల్లుల్లి పేస్టుని వాడుతుంటాం. ఈ పేస్టుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పటికీ కొన్నిసార్లు రంగు మారి, ఎండిపోయినట్లు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టుని నిల్వచేసేముందు కొద్దిగా నూనె కలిపి పెడితే మరిన్ని రోజులు తాజాగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్టులను విడివిడిగా నిల్వచేసినా నూనె కలుపుకోవడం మంచిది. ♦ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, మసాలాలు, ఇడ్లీ దోశపిండిలతో రిఫ్రిజిరేటర్ నిండిపోతుంటుంది. దీంతో తలుపు తీసినప్పుడల్లా అదొక రకమైన వాసన వస్తుంటుంది. కాటన్ బాల్‌ను వెనీలా ఎసెన్స్‌లో ముంచి, రిఫ్రిజిరేటర్లో ఒక మూలన ఉంచితే దుర్వాసన పోతుంది. ♦ మిగిలిపోయిన దోశ, ఇడ్లీ్ల పిండి, గారెల పిండి వంటివాటిని రిఫ్రిజిరేటర్లో పెట్టినా, కొన్నిరోజులకే ఎండిపోవడమో, బాగా పులిసిపోవడమో జరుగుతుంది. అందువల్ల మిగిలిపోయిన పిండిలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. -
మీ ఫోన్ పోయిందా? అయితే ఇలా కనిపెట్టండి!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లను పోగొట్టుకోవడం, లేదంటే వాటిని దొంగతనం చేయడం సర్వ సాధారణమైంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ ఫోన్ థెప్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు, గతేడాది ముంబైలో ఎన్ని ఫోన్లు పోయాయి? వాటిపై ఎన్ని కేసులు నమోదయ్యాయో? తెలుపుతూ తాజాగా ఓ డేటా విడుదలైంది. ఆ డేటా ప్రకారం.. ►2021లో ముంబై నగరంలో మొత్తం 48,856 ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగతనం జరిగాయి ►ఇలా యూజర్లు ప్రతి రోజు కనీసం 134 ఫోన్లను కోల్పోయారు ►దొంగిలించిన, పోగొట్టున్న మొత్తం 52,883 ఫోన్లను ఇతరులు వినియోగింస్తున్నట్లు తేలింది. ►దొంగతనం జరిగిన ఫోన్లపై 3.5శాతంతో 1,853 ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనట్లు ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ తరుణంలో ఫోన్ దొంగతనం జరిగిందంటే ఐఎంఈఐ నెంబర్‌తో పోగొట్టుకున్న ఫోన్‌ను ఈజీగా గుర్తించవచ్చని, పోగొట్టుకున్న ఫోన్‌కు ఐఎంఈఐ (imei) నెంబర్ థంబ్ ప్రింట్లా ఉపయోగ పడుతుందని హ్యాకింగ్ నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు మనం ఆ ఐఎంఈఐ నంబర్ అంటే ఏమిటి? ఆ నెంబర్‌ను ఎలా గుర్తించాలి? ఆ నెంబర్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఐఎంఈఐ అంటే? ఐఎంఈఐ అంటే International Mobile Equipment Identity. ఇది ఒక ప్రత్యేకమైన 15-అంకెల సంఖ్య. ఈ నెంబర్‌తో సాయంతో పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడ ఉంది. వారి వివరాల్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్‌ను వినియోగిస్తే. మీకు రెండు ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి. ప్రతి సిమ్ స్లాట్‌కు ఒక ఐఎఈఐ నెంబర్ ఉంటుంది. మీ ఫోన్లో ఐఎంఈఐ నెంబర్ని ఎలా గుర్తించవచ్చు? ఐఎంఈఐ నెంబర్ సాధారణంగా మీ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.. ఆ నెంబర్‌ను స్టిక్లరపై ముంద్రించి ఫోన్ బాక్స్‌లో ఉంచి ఇస్తారు.మీ ఐఎంఈఐ నెంబర్‌ను గుర్తించేందుకు మరొక మార్గం. మీ మొబైల్లో *#06# డయల్ చేయడం. డయల్ చేస్తే ఐఎంఈఐతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఐఎంఈఐ ఎలా ఉపయోగపడుతుంది? మీ స్మార్ట్ ఫోన్ పోయినా లేదా దొంగిలించినా నెట్వర్క్ ప్రొవైడర్లు IMEI నంబర్ని ఉపయోగించి దాన్ని ట్రాక్ చేయవచ్చు. ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా..మీరు ఉపయోగిస్తున్న ఫోన్ పోతే.. ఇతరులు ఏ నెట్ వర్క్‌లకు పోర్టబుల్ అవ్వకుండా డిస్ కనెక్ట్ చేయోచ్చు. ఇతర ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. దీంతో మీ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్,ఇన్ కమింగ్ కాల్స్ రావు. ఇంటర్నెట్ కూడా పనిచేయదు. సౌకర్యాలతో పాటు ఈ ఐఎంఈఐ కోడ్ బ్రాండ్, మోడల్, విడుదలైన సంవత్సరం, స్పెసిఫికేషన్లతో సహా మొబైల్ గురించిన అనేక ఇతర వివరాల్ని వెల్లడిస్తుంది. మీరు https:// www imei .info/ని సందర్శించి అందులో మీ IMEI నంబర్ని నమోదు చేసుకుంటే ఫలితం ఉంటుంది. మీ ఫోన్ పోతే ఏం చేయాలి? ♦ పొరపాటు మీరు మీ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే ముందుగా అది రింగ్ అవుతుందో లేదో చెక్ చేయడం. మన అదృష్టం బాగుంటే మీరు ఫోన్ చేసినప్పుడు చేసినప్పుడు అవతల వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేస్తే.. మీ ఫోన్‌ను మీరు పొందవచ్చు. ♦ మీరు మీ iCloud లేదా Googleయాక్సెస్ చేయడం ద్వారా మీ డేటాను ఆన్లైన్లో తొలగించవచ్చు. ♦ దొంగతనం జరిగిందని భావిస్తే వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ♦ మీ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా సంప్రదించి, మీ సిమ్ కార్డ్‌ని బ్లాక్ చేయించండి. ఇతరులు మీ నెంబర్‌ను వినియోగించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా నిలిపివేయమని వారిని అడగండి. ♦ మీ ఫోన్‌కి కనెక్ట్ అయిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్, జీమెల్స్ పాస్‌వర్డ్‌లను మార్చండి. చదవండి👉 భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్లు ‘బ్యాన్’, స్పందించిన కేంద్రం! -
Video: ఆరోగ్య లాభాలనిచ్చే పైనాపిల్.. తొక్క ఇలా ఈజీగా తీసేయండి!
పైనాపిల్.. ముఖ్యంగా జ్యూస్‌ను చాలా మంది ఇష్టపడతారు. రుచితో పాటు ఈ పండు కలిగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం. పైనాపిల్‌లో విటమిన్ బీ, సీతో పాటు పీచు పదార్థం పుష్కలం. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కూడా అందిస్తుంది. ఆహారం జీర్ణమవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు బరువును తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టే స్మూతీలు, జ్యూస్, ఫ్రూట్సలాడ్.. ఇలా వివిధ రూపాల్లో పైనాపిల్ తీసుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ.. ముళ్లు ముళ్లుగా ఉండే దీని తొక్క తీయాలంటేనే కాస్త కష్టం. అయితే, దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని, సులభ పద్ధతిలో పైనాపిల్ తొక్క తీసే విధానాన్ని చూపిస్తానంటున్నారు సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ఈజీగా పైనాపిల్ తొక్క ఒలిచేయండి! View this post on Instagram A post shared by Kunal Kapur (@chefkunal) చదవండి👇 Healthy Heart Tips: ఈ ఆహార పదార్థాలు తినడం అలవాటా.. అయితే ప్రమాదం పొంచిఉన్నట్లే! Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! -
రైల్వే వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన అల్ కాయిదా!
భారత రైల్వేలకు చెందిన ఓ వెబ్‌సైట్‌ను అల్ కాయిదా ఉగ్రవాదులు హ్యాక్ చేయడం సంచలనం రేపింది. సెంట్రల్ జోన్ పరిధిలోని మహారాష్ట్రలోని భుసావల్ డివిజన్‌కు చెందిన వెబ్‌సైట్‌ను ఆల్ కాయిదా టెర్రరిస్టులు హ్యాక్ చేశారు. ఆ సైట్లో 11 పేజీలున్న ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారతీయ రైల్వేకు తొలిసారి ఇలాంటి పరిణామం ఎదురు కావడం ఆందోళన రేపింది. రైల్వేశాఖ వెబ్సైట్ హ్యాకింగ్ ద్వారా విద్రోహ చర్యలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న కోణంలో నిఘావర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఉగ్రవాద నేత అసీమ్ ఉమర్ సందేశాన్ని అందులో పోస్ట్ చేశారు. భారత ముస్లింలు జిహాద్ పాఠాలు మర్చిపోతున్నారని... వారికి మళ్లీ పాఠాలు నేర్పి యుద్ధరంగానికి కదిలేలా చేస్తామని ఆ సందేశంలో హెచ్చరించారు. ప్రజలు 'జిహాద్' లో పాల్గొనేందుకు, అమెరికా దాని మిత్రపక్షాలను ఓడించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ రైల్వేలో 115 రైల్వే స్టేషన్లు ఉన్న భుసావల్ డివిజన్ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ రద్దీ ఎక్కువే. ఈ డివిజన్ పరిధిలో సుమారు 15 శాతం ముస్లిం జనాభా ఉంది. ఈ నేపథ్యంలోనే తమ భావజాల విస్తరణకు అల్ కాయిదా ఈ చర్యకు పూనుకుందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసీమ్ ఉమర్ (సనౌల్ హక్) అల్ కాయిదా దక్షిణాసియా విభాగానికి చీఫ్. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత అల్ కాయిదాలో చేరిన ఉమర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.