
శీతల పానీయాలు అంటే మనం తాగే కూల్‌డ్రింక్‌లు ఇలా కూడా ఉపయోగపడతాయా! అని నోరెళ్లబెట్డడం ఖాయం. ఎందుకంటే వాటితో తుప్పు మరకల్ని, వదలని మెండి మరకల్ని, బాత్రూంలను, టాయిలెట్ బేసిన్‌ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందట. ఆ కూల్‌డ్రింక్ మనల్ని ఇబ్బంది పెట్టే మొండి మరకలన్నింటిని చాలా ఈజీగా వదలగొడుతుందట. ఆఖరికిగా పెరటి తోట పెంపకంలో క్రిమిసంహరిణీగా కూడా ఉపయోగించొచ్చట. ఇన్నీ చెప్పక కూల్‌డ్రిండ్ తాగొచ్చా అని సందేహం వస్తుందా! సర్లేండి ముందు దీంతో ఎలా మరకల పోతాయొ చూసేద్దామా.
ఎలా మరకల్ని వదలగొడుతుందంటే..
మాడిపోయిన పాన్‌ల మాడుని..
శీతల పానీయంలో ఉండే ఆమ్ల లక్షణం కారణంగా మొండిగా బంకలా పట్టి ఉన్న మరకల్ని సునాయాసంగా వదలగొట్టేస్తుంది. ఎలా అంటే పొరపాటున మాడిపోయిన గృహోపకరణాలు చూసేందుకు మసితో అసహ్యంగా ఉంటాయి. అలాంటి వాటిని గనుక కూల్‌డ్రిండ్ పోసి కాసేపు నానిబెట్టాలి. దీనిలో ఉండే ఆమ్ల గుణం ఆ మసిని తినేసి క్లీన్‌గా కొత్తదానిలో మెరిసిపోయేలా చేస్తుంది.
క్రిమి సంహరిణీగా..
మన తోటలో తెగుళ్లను నియంత్రించడానికి ఈ శీతల పానీయాలను ఉపయోగించొచ్చు. మెక్కలను కీటకాలు, తెగుళ్ల నుంచి దూరంగా ఉంచడానకి కూల్‌డ్రింక్‌లను ఓ చిన్న గిన్నెలో వేసి ఉంచితే ఆ వాసన కీటకాలను ఆకర్షించి..దానిలో ఉండే ఆమ్లం వాటిని చంపేస్తుంది.
బట్టల మురికి వదిలించడంలో
ఈ కూల్‌డ్రింక్స్ దుస్తులపై పడిని మరకలను చాలా బాగా వదలగొడుతుంది. జిడ్డు, తేలికపాటి రక్తపు మరకలను సులభంగా తొలగిస్తుంది.
తుప్పు తొలగించడం..
తప్పు పట్టిన బొల్ట్‌లను, ఐరన్ ట్యాప్, తెల్లటి టైల్స్ పడిని తుప్పు మరకల్ని ఈజీగా వదలగొట్టడమే కాకుండా కొత్తగా ఉండేలా చేస్తుంది.
వాష్‌రూమ్ క్లీనర్‌గా..
టాయిలెట్ బేసిన్‌లో ఉండే మొండి మరకల్సి క్లీన్ చేసి మంచిగా ఉండేలా చేస్తుంది. ఈ కూల్‌డ్రింక్ టాయిలెట్‌లో ఉన్న మరకలపై నేరుగా పోసి బ్రెష్‌తో క్లీన్ చేసి ఆ తర్వాత ఫ్లష్ నొక్కితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం తొందరగా ట్రై చేసి చూడాండి మరీ..
(చదవండి: వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..)