రుచిగా, వేగంగా వంట చేయాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి...
♦కూర ఏదైనా రుచికోసం అల్లం వెల్లుల్లి పేస్టుని వాడుతుంటాం. ఈ పేస్టుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పటికీ కొన్నిసార్లు రంగు మారి, ఎండిపోయినట్లు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టుని నిల్వచేసేముందు కొద్దిగా నూనె కలిపి పెడితే మరిన్ని రోజులు తాజాగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్టులను విడివిడిగా నిల్వచేసినా నూనె కలుపుకోవడం మంచిది.
♦ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, మసాలాలు, ఇడ్లీ దోశపిండిలతో రిఫ్రిజిరేటర్ నిండిపోతుంటుంది. దీంతో తలుపు తీసినప్పుడల్లా అదొక రకమైన వాసన వస్తుంటుంది. కాటన్ బాల్‌ను వెనీలా ఎసెన్స్‌లో ముంచి, రిఫ్రిజిరేటర్‌లో ఒక మూలన ఉంచితే దుర్వాసన పోతుంది.
♦ మిగిలిపోయిన దోశ, ఇడ్లీ్ల పిండి, గారెల పిండి వంటివాటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టినా, కొన్నిరోజులకే ఎండిపోవడమో, బాగా పులిసిపోవడమో జరుగుతుంది. అందువల్ల మిగిలిపోయిన పిండిలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి.
Kitchen Tips: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేస్తే తాజాగా ఉంటుంది
Published Thu, Jul 6 2023 3:43 PM | Last Updated on Fri, Jul 21 2023 7:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment