Cold drinks
-
టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!
శీతల పానీయాలు అంటే మనం తాగే కూల్‌డ్రింక్‌లు ఇలా కూడా ఉపయోగపడతాయా! అని నోరెళ్లబెట్డడం ఖాయం. ఎందుకంటే వాటితో తుప్పు మరకల్ని, వదలని మెండి మరకల్ని, బాత్రూంలను, టాయిలెట్ బేసిన్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందట. ఆ కూల్‌డ్రింక్ మనల్ని ఇబ్బంది పెట్టే మొండి మరకలన్నింటిని చాలా ఈజీగా వదలగొడుతుందట. ఆఖరికిగా పెరటి తోట పెంపకంలో క్రిమిసంహరిణీగా కూడా ఉపయోగించొచ్చట. ఇన్నీ చెప్పక కూల్‌డ్రిండ్ తాగొచ్చా అని సందేహం వస్తుందా! సర్లేండి ముందు దీంతో ఎలా మరకల పోతాయొ చూసేద్దామా. ఎలా మరకల్ని వదలగొడుతుందంటే.. మాడిపోయిన పాన్ల మాడుని.. శీతల పానీయంలో ఉండే ఆమ్ల లక్షణం కారణంగా మొండిగా బంకలా పట్టి ఉన్న మరకల్ని సునాయాసంగా వదలగొట్టేస్తుంది. ఎలా అంటే పొరపాటున మాడిపోయిన గృహోపకరణాలు చూసేందుకు మసితో అసహ్యంగా ఉంటాయి. అలాంటి వాటిని గనుక కూల్‌డ్రిండ్ పోసి కాసేపు నానిబెట్టాలి. దీనిలో ఉండే ఆమ్ల గుణం ఆ మసిని తినేసి క్లీన్‌గా కొత్తదానిలో మెరిసిపోయేలా చేస్తుంది. క్రిమి సంహరిణీగా.. మన తోటలో తెగుళ్లను నియంత్రించడానికి ఈ శీతల పానీయాలను ఉపయోగించొచ్చు. మెక్కలను కీటకాలు, తెగుళ్ల నుంచి దూరంగా ఉంచడానకి కూల్‌డ్రింక్‌లను ఓ చిన్న గిన్నెలో వేసి ఉంచితే ఆ వాసన కీటకాలను ఆకర్షించి..దానిలో ఉండే ఆమ్లం వాటిని చంపేస్తుంది. బట్టల మురికి వదిలించడంలో ఈ కూల్‌డ్రింక్స్ దుస్తులపై పడిని మరకలను చాలా బాగా వదలగొడుతుంది. జిడ్డు, తేలికపాటి రక్తపు మరకలను సులభంగా తొలగిస్తుంది. తుప్పు తొలగించడం.. తప్పు పట్టిన బొల్ట్లను, ఐరన్ ట్యాప్, తెల్లటి టైల్స్ పడిని తుప్పు మరకల్ని ఈజీగా వదలగొట్టడమే కాకుండా కొత్తగా ఉండేలా చేస్తుంది. వాష్‌రూమ్ క్లీనర్‌గా.. టాయిలెట్ బేసిన్లో ఉండే మొండి మరకల్సి క్లీన్ చేసి మంచిగా ఉండేలా చేస్తుంది. ఈ కూల్‌డ్రింక్ టాయిలెట్లో ఉన్న మరకలపై నేరుగా పోసి బ్రెష్‌తో క్లీన్ చేసి ఆ తర్వాత ఫ్లష్ నొక్కితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం తొందరగా ట్రై చేసి చూడాండి మరీ.. (చదవండి: వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..) -
అతనికి ఆహారం తినడమే వికారం..17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే..
ఇంతవరకు ఎందరో వింత వ్యక్తులను వారి ఆహారపు అవాట్లను చూశాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇతను వాటన్నింటికీ విభిన్నంగా ఉన్నాడు ఇరాన్‌కు చెందని ఓ వ్యక్తి. అతనికి 'ఆకలి' అనేదే తెలియదట. జూన్ 2006 నుంచి తినడమే మానేశాడు. ఐతే అతను ఎలా బతుకుతున్నాడు అనే సందేహం అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.. కానీ అతను ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. అసలేం జరిగిందంటే..ఇరాన్‌కి చెందిన ఘోలమ్రేజా అర్దేషిరి జూన్ 2006 నుంచి ఆహారం తినడం మానేశాడు. అలా అని అతనికి ఏదైన ప్రమాదం లేదా ఏదైనా జరగకూడని సంఘటన వల్లో అతను ఇలా చేయడం లేదు. ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా తినడం మానేశాడు. తనకొక వింత అనుభూతి కలిగిందని. అలా అనిపించినప్పుడల్లా పిచ్చెక్కిపోతుందని, ఏం చేయాలో తెలియనంత బాధగా ఉంటుందని చెబుతున్నాడు అర్దేషిరి. తన నోటిలో ఏదో వెంట్రకలాంటి వస్తువు ఉన్న ఫీలింగ్ వస్తుందట. దాని తల భాగం తన గొంతులోనూ మిగతా భాగం పొట్టలో ఉండి అడ్డుపడి, ఊపిరాడనట్లు అనిపిస్తుందట. ఆ బాధ మాటల్లో చెప్పలేనంటున్నాడు. ఈ విషయమై అనేక మంది వైద్యులను సంప్రదించాడు కానీ ఎవ్వరూ తన సమస్యను నిర్ధారించ లేకపోయారని చెబుతున్నాడు అర్దేషిరి. ఐతే తాను బాగా అలసిపోయినప్పుడూ పెప్సీ వంటి శీతల పానీయాన్ని తాగుతుంటాడు. రోజుకి మూడు లీటర్లు పెప్సీ డ్రిండ్ తీసుకుంటాడు. ఒక్కొసారి రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని చెబుతున్నాడు. అయితే తనకు ఇదేమి షాకింగ్ లేదని ఇప్పటికీ ఈ వింత అనుభూతి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియలేదని చెబతున్నాడు. అంతేకాదండోయో ఆర్దేషిరి 17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే తాగుతున్నాడు, ఇంకేమి తీసుకోడు. అతని జీవనోపాధి ఫైబర్ గ్లాస్లు రిపేర్ చేయడం. ఐతే అతని ముందేవరు కుటుంబసభ్యులు భోజనం చేయరట. ఎందుకంటే ఎవ్వరైనా తన ముందు భోజనం చేస్తుంటే వికారంగా ఉంటుందట అందుకని ఎవ్వరూ అర్దేషిరి ఎదుట భోజనం చేయరు. విచిత్రమేమిటంటే ఆ వింత అనుభూతి తప్ప ఏ అనారోగ్య సమస్య లేకపోవడం కొసమెరుపు. (చదవండి: మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం) -
1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..
కొన్నిసార్లు అత్యుత్సాహంతో చేసే పనులు తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయి. ఓ వ్యక్తి ఎండవేడిని తట్టుకోలేక ఒకేసారి ఒకటిన్నర లీటర్ల కూల్‌డ్రింక్ తాగాడు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అసలేంజరిగిందంటే.. చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. ఐతే తదుపరి 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు తలెత్తడంతో బీజింగ్‌లోని చావోయాంగ్ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. చికిత్స సమయంలో రక్తపోటు గణనీయంగా పడిపోయిందని, గుండె వేగంగా కొట్టుకుందని, ఊపిరి వేగం కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు చికిత్స ప్రారంభించారట. క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే న్యుమాటోసిస్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కడుపులో అధిక మోతాదులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. చికిత్స సమయంలో యువకుడి ఛాతీకి ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో హెపాటిక్ ఇస్కీమియాకు గురయ్యాడు (అంటే లివర్ షాక్‌కు గురవ్వడం). ఫలితంగా అతనికి మరణం సంభవించిందని వైద్యులు తెలిపారు. ఐతే గ్యాస్ నుండి ఉపశమనం పొందటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ 18 గంటల చికిత్స తర్వాత మరణించాడని నివేదిక తెల్పింది. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
మండే ఎండలా.. మజాకా!
మండే ఎండల్లో కొందరు చల్ల చల్లని పానీయాలు అమ్ముకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. మరి కొందరు ఎండలే అదనుగా భావించి ధరలు పెంచి దండుకుంటున్నారు. ప్రజలేమో ఎండలకు తట్టుకోలేక గొంతు తడుపుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒకో రీతిలో మండే ఎండలా.... మజాకా అనిపిస్తున్నాయి. - రాయచూరు రాయచూరు: ఉత్తర కర్ణాటకలో రెండే సీజన్లు వేసవి, అతి వేసవి అన్న సంగతి తెలియని వారెవరూ ఉండరేమో. మే రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా (మొన్న కురిసిన అకాల వర్షం మినహా) సగటున 39 నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రమైన రాయచూరు నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మండుటెండలు స్వాగతం ప లుకుతున్నాయి. దీంతో వారు సహజంగానే చల్లటి పానీ యాలు, చలువ చేసే పదార్థాల కోసం తపిస్తున్నారు. ఉన్నవా రు ఎలాగూ బాటిళ్ల నీళ్లను కొని దాహం తీర్చుకుంటున్నారు. పేదవారు ఆర్టీసీ ఏర్పాటు చేసిన తాగునీరు అలాగే అక్కడి అన్నపూర్ణ క్యాంటీన్ నీళ్లను తాగి ఉపశమనం పొందుతున్నా రు. ఇక చల్లటి పానీయాల సంగతి సరే సరి చెరుకు రసంతో పాటు రకరకాల జూస్లు ఇతరత్రా డ్రింక్స్ ప్యాపారాలు జో రుగా కొనసాగుతున్నాయి. ఇక యాపలదిన్ని తదితర గ్రా మాల నుంచి తెలుగు వారైన మహిళలు బస్టాండ్ రెండు ప్ర ధాన గేట్ల బయట తాటిముంజలను రూ.10 కి 4-5 చొప్పున అమ్ముతున్నారు. రెండు నెలల నుంచి ఈ మహిళలు ప్రజలకు చలువ చేసే తాటిముంజలను విక్రయిస్తున్నారు. ఇక పుచ్చకాయ ఒక ముక్క 10 రూపాయలు కాగా అలాగే ఖర్బుజా ఇతర చలువ నిచ్చే ఆహార పదార్థాలు, కాయగూరల వైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా దోసకాయ, క్యారెట్, మొలకెత్తిన పెసర్లు తదితరాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇవి రోజు రోజుకూ ధరలు మారుతున్నాయి. ఈ విషయమై స్థానిక స్టేషన్ రోడ్డు వెస్ట్‌పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కూరగాయల ప్రముఖ వ్యాపారి, మాజీ దళపతి వీరణ్ణ మాట్లాడుతూ, 100 గ్రాములు ఉన్న మొలకెత్తిన పెసర్లు రూ.12, అలాగే దోసకాయ, క్యారెట్, నిమ్మకాయ, ముల్లంగి, బీరకాయ తదితరాలన్ని కేజీ రూ.40-50 పైమాటే. ఇక నిమ్మకాయల ధరను అడగాల్సిన పని లేదన్నారు. రెండు రోజుల క్రితం బసవ జయంతి, వైశాఖమాస పెళ్లిళ్ల సీజన్‌తో పలు కాయగూరల ధరలు ఒక్క సారిగా రెండింతలు మూడింతలు పెరిగాయి. ఎవర్గ్రీన్ ఎళెనీరు(కొబ్బరి బొండం) ధర రూ.30 దగ్గర స్థిర పడిపోయింది. -
పాదాలకు మృదు లేపనం
ఐస్‌క్రీమ్ పెడిక్యూర్ ఎండ వల్ల చల్లని పానీయాలు సేవించాలని ఉంటుంది. చల్లని గాలిని ఆస్వాదించాలని తనువు, మనసు కోరుకుంటాయి. ఆ అవకాశాన్ని పాదాలకూ ఇస్తే..! అలసిన పాదాలు హాయిగా విశ్రాంతి పొందుతాయి. మడమల నొప్పులు తగ్గుతాయి. చర్మం నునుపుగా అవుతుంది. ఈ ప్రయోజనాలన్నీ ‘ఐస్‌క్రీమ్ పెడిక్యూర్’ మోసుకు వస్తోంది. భోజనం తర్వాత చల్లగా లాగించే డిజర్ట్‌గా ఐస్‌క్రీమ్‌కు పేరుంది. అదే ఐస్‌క్రీమ్‌ను శరీర సౌందర్యంలో ఉపయోగిస్తున్నారు నిపుణులు. ఏ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ కావాలో ఎంపిక చేసుకుంటే దానిని అనుసరించి సౌందర్య చికిత్స చేస్తారు. 40 నిమిషాలలో పాదాలకు అతి చల్లని స్నానాన్ని దాంతో పాటే హాయినీ అందిస్తున్నారు .సౌందర్య చికిత్సలో విలాసవంతమై నదిగా పేరుకొట్టేసిన ఈ ఐస్‌క్రీమ్ పెడిక్యూర్, మేనిక్యూర్ ఇప్పటివరకు అంతే ఖరీదైన స్పా చికిత్సలోనే లభిస్తుండేది. ఇప్పుడు సాధారణ సౌందర్యశాలలోనూ ఈ చికిత్సలు లభిస్తున్నాయి. చల్లగా... తియ్యగా..! గాలి తగలగానే కరిగిపోతూ చల్లగా, తియ్యగా నోరూరించే ఐస్‌క్రీమ్ జిహ్వను మైమరపింపజేయడమే కాదు, సౌందర్య సాధనాలలో దీర్ఘకాల ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేయడంలో అమోఘంగా పనిచేస్తుంది.ఈ పెడిక్యూర్‌లో ఉపయోగించే ఎప్సమ్ సాల్ట్‌లోని గుణాలు రోగనిరోధక శక్తికి పెంచుతాయి. దీనివల్ల చర్మ సమస్యలు దరిచేరవు. పాదాలు, చేతుల చర్మం పొడిబారవు. ఎండవల్ల కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుతుంది. గోళ్లు విరగడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గి మృదుత్వం చేకూరుతుంది.ఐస్‌క్రీమ్‌లోని పాలు, ఇతర ఉత్పత్తులు అన్నీ సహజమైనవే కావడంతో చర్మ ఆరోగ్యం, కాంతి పెరుగుతాయి. అధికబరువున్నా... హాయిగా! ఐస్‌క్రీమ్ తినాలని ఉన్నా అధికబరువున్నవారు నోరు కట్టేసుకుంటారు ‘ఫ్యాట్’ అని. అదే ‘ఫ్యాట్’ పాదాలకు మెరుగైన అందాన్ని తెస్తుంది. ఒత్తిడి నుంచి బోలెడంత విశ్రాంతినిస్తుంది. మోకాళ్లు, మడమలు, అరికాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ చికిత్స. ఐస్‌క్రీమ్ జాబితా! మార్కెట్లో ‘ఐస్‌క్రీమ్ పెడిక్యూర్ కిట్’ ప్రత్యేకంగా లబిస్తుంది. దీనిలో ప్రత్యేకమైన ఆరు రకాల నూనెలు, మినరల్స్‌ని శుద్ధి చేసి నింపిన ట్యూబ్స్, సుగంధంతో కూడుకున్న ఎప్సమ్ సాల్ట్, ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ క్రీమ్స్... ఉంటాయి. పైన ఉన్న నూనెలు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచి, కొన్ని నిమిషాలు సేద దీరుస్తారు. చర్మం మెత్తబడిన తర్వాత పాదాలను నీటిలో నుంచి బయటకు తీసి, షుగర్ బేస్డ్ బాడీ స్క్రబ్ తో మృదువుగా రుద్ది, తర్వాత జొజోబా ఆయిల్, విటమిన్ ‘ఇ’ ఆయిల్ కలిపి పాదాలకు పట్టించి, వలయాకారంగా వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తారు. ఈ స్ట్రోక్స్ వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచి, తీసిన టర్కీ టవల్‌తో కాళ్లను, పాదాలను కప్పి ఉంచుతారు. దీని వల్ల పాదాలపై ఉండే చర్మం స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. మురికి వదిలిపోతుంది. తడిలేకుండా తుడిచి, వెనీలా ఐస్‌క్రీమ్‌తో పాదం మొత్తం రాసి, విశ్రాంతి తీసుకోమంటారు. తర్వాత గోళ్లను కత్తిరించి, క్యుటికల్ రిమూవర్‌తో మురికిని తొలగిస్తారు. మరోసారి తడిలేకుండా పాదాన్ని తుడిచి ఐస్‌క్రీమ్ బాల్ (చాకొలెట్, దానిమ్మ, స్ట్రాబెర్రీ, తేనె, కివి, వెనీలా.. ఇలా ఏ ఫ్లేవర్ నచ్చుతుందో అది)ను తీసుకుంటారు. ఆ ఐస్‌క్రీమ్ బాల్‌ను పాదంపై రాస్తూ, మృదువుగా రుద్దుతూ ఉంటారు. అరికాళ్లలో కొంత ఒత్తిడి కలగజేస్తూ చేసే ఈ మసాజ్, ఐస్ వల్ల కలిగే చల్లదనం గిలిగింతలు పెడుతుంది. పాదాలలోని నరాలు చురుగ్గా అవుతాయి. రక్తప్రసరణ మెరుగై పాదాల నొప్పులు తగ్గుతాయి. పాదాలకు ఐస్‌తో చేసే పెడిక్యూర్లాగే ఇదీ ఉంటుంది. అయితే, ఇందులో ఉపయోగించే మసాజ్ పద్ధతులు, ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల వల్ల మేలైన ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో ఈ పద్ధతి వల్ల మరింత విశ్రాంతి లభిస్తుంది. - ఎన్.ఆర్ అధికబరువుకు హాయి... ఒత్తిడిని ఎదుర్కొనే వారు, ఉద్యోగినులకు ఈ పెడిక్యూర్ ఎంతో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఊబకాయులకు ఇది చాలా మంచి మసాజ్ ప్రక్రియ. అధికబరువు పాదాల మీద పడి, నొప్పులకు దారితీస్తాయి. ఐస్‌క్రీమ్ పెడిక్యూర్‌లో కండరాలకు చేసే మసాజ్ మంచి రిలాక్సేషన్ ఇవ్వడమే కాకుండా ఎముకలకు బలాన్నిస్తుంది. అయితే, ఈ ప్రకియకు వాడే ఉత్పత్తుల ధర కూడా ఎక్కువే. ఉత్పత్తులను ఫ్రీజర్‌లో ఉంచాలి. అలాగే ఒకసారి కిట్ ఓపెన్ చేశాక, వెంటనే ఉపయోగించాలి. రూ.1000 నుంచి రూ.15,00 వరకు ఖర్చువుతుంది. - సంతోషిణిప్రియ, సౌందర్యనిపుణురాలు