ఇంతవరకు ఎందరో వింత వ్యక్తులను వారి ఆహారపు అవాట్లను చూశాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇతను వాటన్నింటికీ విభిన్నంగా ఉన్నాడు ఇరాన్‌కు చెందని ఓ వ్యక్తి. అతనికి 'ఆకలి' అనేదే తెలియదట. జూన్ 2006 నుంచి తినడమే మానేశాడు. ఐతే అతను ఎలా బతుకుతున్నాడు అనే సందేహం అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.. కానీ అతను ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు.
అసలేం జరిగిందంటే..ఇరాన్‌కి చెందిన ఘోలమ్రేజా అర్దేషిరి జూన్ 2006 నుంచి ఆహారం తినడం మానేశాడు. అలా అని అతనికి ఏదైన ప్రమాదం లేదా ఏదైనా జరగకూడని సంఘటన వల్లో అతను ఇలా చేయడం లేదు. ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా తినడం మానేశాడు. తనకొక వింత అనుభూతి కలిగిందని. అలా అనిపించినప్పుడల్లా పిచ్చెక్కిపోతుందని, ఏం చేయాలో తెలియనంత బాధగా ఉంటుందని చెబుతున్నాడు అర్దేషిరి. తన నోటిలో ఏదో వెంట్రకలాంటి వస్తువు ఉన్న ఫీలింగ్ వస్తుందట. దాని తల భాగం తన గొంతులోనూ మిగతా భాగం పొట్టలో ఉండి అడ్డుపడి, ఊపిరాడనట్లు అనిపిస్తుందట.
ఆ బాధ మాటల్లో చెప్పలేనంటున్నాడు. ఈ విషయమై అనేక మంది వైద్యులను సంప్రదించాడు కానీ ఎవ్వరూ తన సమస్యను నిర్ధారించ లేకపోయారని చెబుతున్నాడు అర్దేషిరి. ఐతే తాను బాగా అలసిపోయినప్పుడూ పెప్సీ వంటి శీతల పానీయాన్ని తాగుతుంటాడు. రోజుకి మూడు లీటర్లు పెప్సీ డ్రిండ్ తీసుకుంటాడు. ఒక్కొసారి రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని చెబుతున్నాడు. అయితే తనకు ఇదేమి షాకింగ్ లేదని ఇప్పటికీ ఈ వింత అనుభూతి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియలేదని చెబతున్నాడు.
అంతేకాదండోయో ఆర్దేషిరి 17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే తాగుతున్నాడు, ఇంకేమి తీసుకోడు. అతని జీవనోపాధి ఫైబర్ గ్లాస్‌లు రిపేర్ చేయడం. ఐతే అతని ముందేవరు కుటుంబసభ్యులు భోజనం చేయరట. ఎందుకంటే ఎవ్వరైనా తన ముందు భోజనం చేస్తుంటే వికారంగా ఉంటుందట అందుకని ఎవ్వరూ అర్దేషిరి ఎదుట భోజనం చేయరు. విచిత్రమేమిటంటే ఆ వింత అనుభూతి తప్ప ఏ అనారోగ్య సమస్య లేకపోవడం కొసమెరుపు.
(చదవండి: మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం)
Comments
Please login to add a commentAdd a comment