Cleaning works
-
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!
శీతల పానీయాలు అంటే మనం తాగే కూల్‌డ్రింక్‌లు ఇలా కూడా ఉపయోగపడతాయా! అని నోరెళ్లబెట్డడం ఖాయం. ఎందుకంటే వాటితో తుప్పు మరకల్ని, వదలని మెండి మరకల్ని, బాత్రూంలను, టాయిలెట్ బేసిన్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందట. ఆ కూల్‌డ్రింక్ మనల్ని ఇబ్బంది పెట్టే మొండి మరకలన్నింటిని చాలా ఈజీగా వదలగొడుతుందట. ఆఖరికిగా పెరటి తోట పెంపకంలో క్రిమిసంహరిణీగా కూడా ఉపయోగించొచ్చట. ఇన్నీ చెప్పక కూల్‌డ్రిండ్ తాగొచ్చా అని సందేహం వస్తుందా! సర్లేండి ముందు దీంతో ఎలా మరకల పోతాయొ చూసేద్దామా. ఎలా మరకల్ని వదలగొడుతుందంటే.. మాడిపోయిన పాన్ల మాడుని.. శీతల పానీయంలో ఉండే ఆమ్ల లక్షణం కారణంగా మొండిగా బంకలా పట్టి ఉన్న మరకల్ని సునాయాసంగా వదలగొట్టేస్తుంది. ఎలా అంటే పొరపాటున మాడిపోయిన గృహోపకరణాలు చూసేందుకు మసితో అసహ్యంగా ఉంటాయి. అలాంటి వాటిని గనుక కూల్‌డ్రిండ్ పోసి కాసేపు నానిబెట్టాలి. దీనిలో ఉండే ఆమ్ల గుణం ఆ మసిని తినేసి క్లీన్‌గా కొత్తదానిలో మెరిసిపోయేలా చేస్తుంది. క్రిమి సంహరిణీగా.. మన తోటలో తెగుళ్లను నియంత్రించడానికి ఈ శీతల పానీయాలను ఉపయోగించొచ్చు. మెక్కలను కీటకాలు, తెగుళ్ల నుంచి దూరంగా ఉంచడానకి కూల్‌డ్రింక్‌లను ఓ చిన్న గిన్నెలో వేసి ఉంచితే ఆ వాసన కీటకాలను ఆకర్షించి..దానిలో ఉండే ఆమ్లం వాటిని చంపేస్తుంది. బట్టల మురికి వదిలించడంలో ఈ కూల్‌డ్రింక్స్ దుస్తులపై పడిని మరకలను చాలా బాగా వదలగొడుతుంది. జిడ్డు, తేలికపాటి రక్తపు మరకలను సులభంగా తొలగిస్తుంది. తుప్పు తొలగించడం.. తప్పు పట్టిన బొల్ట్లను, ఐరన్ ట్యాప్, తెల్లటి టైల్స్ పడిని తుప్పు మరకల్ని ఈజీగా వదలగొట్టడమే కాకుండా కొత్తగా ఉండేలా చేస్తుంది. వాష్‌రూమ్ క్లీనర్‌గా.. టాయిలెట్ బేసిన్లో ఉండే మొండి మరకల్సి క్లీన్ చేసి మంచిగా ఉండేలా చేస్తుంది. ఈ కూల్‌డ్రింక్ టాయిలెట్లో ఉన్న మరకలపై నేరుగా పోసి బ్రెష్‌తో క్లీన్ చేసి ఆ తర్వాత ఫ్లష్ నొక్కితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం తొందరగా ట్రై చేసి చూడాండి మరీ.. (చదవండి: వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..) -
శరవేగంగా మంగళగిరి పెద్దకోనేరు పూడిక తీత పనులు
-
వైరల్.. అమ్మ నీకు దండమే...
కొండలు పగిలేంత ఎండ కోరలు చాచి భయపెడుతుంది. రాక్షస దుమ్ము మేఘం ఒకటి ఊపిరిలోకి రావడానికి దూసుకొస్తుంది. అయినా తప్పదు...పని చేయాల్సిందే. ఈ ఎండలో బిడ్డను బయటికి తీసుకురావడం ఏమంత మంచిది కాదు. ఎండమ్మా కాస్త కరుణ చూపు... నా బిడ్డ ముఖం చూసైనా! కానీ ఎండ తగ్గేలా లేదు. అయినా తప్పదు... పని చేయాల్పిందే. పచ్చని చెట్టుకు కట్టిన ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతుంటే, ఆ కేరింతలను చూసి ఎన్ని సంవత్సరాలైనా సంతోషంగా బతకవచ్చు. కానీ బతుకుపోరు తనను బజార్‌కు తీసుకువచ్చింది. ఎండైనా, వానైనా పని తప్పదు. పనికి వెళుతున్నప్పుడు బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లాలి కదా. ఇంట్లో ఎవరు ఉన్నారని! పెనిమిటి తనలాగే పనికి పోయాడు. పక్కింటివాళ్లకు అప్పగించాలనుకుంటే వారు ఇంట్లో ఉండరు. తనలాగే పనికోసం వెళ్తారు. అందుకే... పనికి వెళ్లక తప్పదు. వెళుతూ వెళుతూ బిడ్డను తీసుకువెళ్లక తప్పదు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు బిడ్డను కొంగుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక చిత్రం వంద పదాల పెట్టు అంటారు. ఇప్పుడు ఆ వరుసలో లఘుచిత్రాన్ని కూడా చేర్చవచ్చు. శ్రమైకజీవన సౌందర్యం నుంచి వర్కింగ్ వుమెన్ పర్సనల్ చాయిస్ వరకు నెటిజనులు ఈ వీడియో చిత్రం నేపథ్యంగా తమ మనసులోని భావాలను ప్రకటించుకున్నారు. ‘ఇదేనా మహిళా సంక్షేమం అంటే!’ అని ఒకరు వ్యంగ్యబాణం విసిరితే, ‘ఇలాంటి వృత్తి నిబద్ధత ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తారు. దేశం ముందడుగు వేయడానికి ఇలాంటి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది’ అంటూ స్పందిస్తారు మరొకరు. ‘ఈ అమ్మలో మా అమ్మను చూసుకున్నాను’ అని ఒకరు కన్నీరు కార్చితే, మరొకరు ‘ఇది పట్టణ దృశ్యం. ఇక మాలాంటి పల్లెల్లో పొలం పనులకు బిడ్డతో వచ్చే తల్లులు ఉన్నారు. చెట్టుకు జోలె కట్టి బిడ్డను అందులో పడుకోబెట్టి పొలం పనులు చేస్తుంటారు. ఆ తల్లి మనసంతా బిడ్డ మీదే ఉంటుంది!’ అని జ్ఞాపకాల్లోకి వెళతారు ఒకరు. ‘మా ఊళ్లో ఒక అమ్మ తన బిడ్డను చెట్టు కింద కూర్చోబెట్టి కూలీపనులు చేసుకుంటుంది. నీళ్లు తాగడం కోసం పొలం దాటి బయటికి వచ్చిన ఆమె బిడ్డను చూసిపోదామని వచ్చేసరికి కాస్త దూరంలో పాము కనిపించి పెద్దగా అరిచి బిడ్డను అక్కడి నుంచి తీసుకొని పరుగెత్తింది. ఈ సంఘటన గురించి ఇప్పటికీ మా ఊళ్లో చెప్పుకుంటారు’ భావోద్వేగాల సంగతి సరే, మంచి సూచనలు ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి... ‘పేదవాళ్లకు కేర్టేకర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దేశంలో రకరకాల స్వచ్ఛందసంస్థల గురించి విని ఉన్నాం. పేద ఉద్యోగులు ఉద్యోగానికి లేదా పనికి వెళితే వారి పిల్లలను చూసుకునే స్వచ్ఛందసంస్థలు కూడా వస్తే మంచిది. ఈ దిశగా ఎవరైనా ఆలోచించాలి’. సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అనేది కొత్త కాదు. అయితే ఒక మంచి కారణంతో చర్చల్లో ఉండే వీడియోలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. -
సమస్యను స్వాగతించు!
‘‘జీవితం ఎప్పుడూ పూలపాన్పు మాదిరిగానే ఉండదు. ఒక్కోసారి అది ముళ్లపాన్పుగా కూడా మారుతుంది. అయితే ముళ్లను కూడా మనం స్వీకరించగలగాలి. ఊహించని రీతిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ముందుగుసాగాలి’’ అంటున్నారు నటి ఖుష్బూ. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ –‘‘నీ జీవితంలోకి ఆకస్మాత్తుగా ఓ ఊహించని సమస్య వచ్చిపడింది. అప్పుడు నువ్వు ఏం చేస్తావ్? అధైర్య పడవద్దు. ముందుగా ఆ ప్రతికూల పరిస్థితులను నీ జీవితంలోకి స్వాగతించు. వచ్చిన సమస్యను అర్థం చేసుకో. మానసిక స్థయిర్యం, ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించు. నా జీవన సూత్రం ఇదే’’ అని పేర్కొన్నారు ఖుష్బూ. ఇంకా తన ఫిట్నెస్ గురుంచి ఖుçష్బూ చెబుతూ– ‘‘ఇటీవల నా లుక్ మారింది. ఈ విషయం గురించి నన్ను చాలామంది అడిగారు. ఎవరి సాయం లేకుండా గడిచిన 70 రోజులుగా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. ఇంటిని శుభ్రపరచడం, దుమ్ము దులపడం, గిన్నెలు తోమడం, గార్డెనింగ్ పనులతో పాటుగా టాయిలెట్స్ కూడా కడిగాను’’ అన్నారు. ఇన్ని పనులు చేయడంవల్ల ఖుష్బూ కాస్త సన్నబడ్డారు. నిజానికి బొద్దుగా ఉండే ఖుష్బూ అంత భోజనప్రియురాలు కాదట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పారు. -
మిస్ యు మెయిడ్
‘‘ఆడుతు పాడతు తుడుస్తు ఉంటే అలుపూ సొలుపేమున్నదీ. ఇల్లే శుభ్రం అవుతున్నదీ’’ అని పాడుతున్నారు పాయల్ రాజ్ పుత్. లాక్ డౌన్ కారణంగా పాయల్ ఇంటి సహాయకురాలు (మెయిడ్) రావడం లేదట. దాంతో తన గదిని స్వయంగా శుభ్రం చేసుకుంటున్నారు పాయల్. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసి, ‘మిస్ యు మెయిడ్’ అంటూ పక్కన ఉన్న ఫొటోను షేర్ చేశారు. -
సారూ.. ఇదేం తీరు..?
మద్నూర్(జుక్కల్) : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు బాల కార్మికులుగా మారుస్తున్నాడు. దేశ నిర్ధేశకుడిగా తీర్చిదిద్దాల్సింది పోయి తరగతి గదులను శుభ్రం చేయించిన సంఘటన మద్నూర్ మండలం మేనూర్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. మండలం లోని మేనూర్ గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న హెచ్ఎం అంజయ్య గురువారం విద్యార్థులతో తరగతి గదులను శుభ్రం చేయించి కడిగించాడు. పాఠశాలకు ప్రహారి లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు, ఏడు తరగతుల గదుల వద్ద బురద, మట్టి వేశారు. అయితే గదుల ను నీటితో కడిగి శుభ్రం చేయాలని హెచ్ఎం అం జయ్య ఆరో తరగతికి చెందిన భజరంగ్, రోహి దాస్, మందన్‌ను ఆదేశించాడు. హెచ్ఎం చెప్పిం దే తడవుగా విద్యార్థులు నీటిని తీసుకువచ్చి చీపురుతో ఆరు, ఏడు తరగతులను కడిగేశారు. ఇది గమనించిన ‘సాక్షి’ ఫోటోలు తీయడాన్ని చూసిన విద్యార్థులు తరగతి గదిలోకి పారిపోయారు. వి ద్యార్థులతో పాచి పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించగా విద్యార్థుల ఇష్టంతోనే పనులు చేస్తున్నారని సదరు హెచ్ఎం చెప్పుకొచ్చాడు. విష యం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రయోజకులుగా తయారు చేస్తాడని అనుకుంటే పనులు చేయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజయ్య ఉపాధ్యాయులను, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి తనే క్రమశిక్షణ తప్పుతున్నాడని పలువురు అంటున్నారు. -
సాగర్ ప్రక్షాళనకు విరామం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డులోని హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రస్తుతానికి నిలిచిపోయినట్లే. సాగర్ ప్రక్షాళన కోసం అధికారులు గత మార్చి నుంచి నీటిని ఖాళీ చేసే చర్యలు ప్రారంభించారు. దాంతో 512.9 మీ. లెవెల్ ఉన్న సాగర్ రిజర్వాయర్ మే నెలాఖరు నాటికి 512 మీటర్ల లెవెల్ వరకు తగ్గిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగర్‌నీటి మట్టం తిరిగి 512.7 మీటర్ల వరకు చేరింది. అంటే దాదాపుగా యథావిధి స్థాయికి చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్టీఎల్) 513.41 మీటర్లు. వర్షాలు కురస్తుండటంతో ఈ ఏడు ప్రక్షాళన పనుల్ని అధికారులు నిలిపివేసినట్లే. ఎప్పటిలాగే వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తూములకు మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారు. వర్షాల్లేని రోజుల్లోనే ఆ పనుల్ని చేస్తూ ఉన్నారు. సాగర్ నుంచి నీటిని అవసరాన్ని బట్టి విడుదల చేసేందుకు రూ.1.02 కోట్లతో అలుగు దిగువభాగం నుంచి నీరు వెళ్లేందుకు అవసరమైన పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే అలుగు కంటే తక్కువ ఎత్తులో నీరున్నా దిగువకు వదలడానికి వీలవుతుంది. రానున్న సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. సాగర్‌లోనే ఈ నిమజ్జనాలు పూర్తయ్యాక, వచ్చే నవంబర్- డిసెంబర్లలో తిరిగి సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టి వచ్చే ఏడాది వేసవిలో సాగర్‌ను ఖాళీ చేయాలనేది అధికారుల యోచనగా తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో..: వేసవిలో సాగర్‌లో నీటినంతా ఖాళీ చేసి అడుగున ఉన్న చెత్తాచెదారాల్ని తొలగించాలని నిరుడు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సాగర్ చుట్టూ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను సీఎం పరిశీలించి వాటిలో అద్భుతమైన టవర్స్‌ను నిర్మించవచ్చని చెప్పారు. గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ఇందిరాపార్కులో వినాయకసాగర్ పేరిట రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినప్పటికీ, బీజేపీ తదితర పక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రక్షాళనకు రూ. 350 కోట్లు.. సాగర్ ప్రక్షాళనపై అధ్యయనం కోసం దాదాపు రూ. కోటి ఖర్చు కాగలదని అంచనా వేసిన ఆస్ట్రియా ప్రభుత్వం.. రూ. 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వె చ్చిస్తే మిగతా రూ. 80 లక్షల ఆర్థికసాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అధ్యయనం అనంతరం సాగర్ ప్రక్షాళనకు మొత్తం రూ. 350 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందులో 80 శాతం నిధుల్ని ఆస్ట్రియా ప్రభుత్వమే అక్కడి ఆర్థికసంస్థల ద్వారా ఇప్పిం చేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ అంశంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.