సమస్యను స్వాగతించు! | Khushboo utilized the lockdown period | Sakshi
Sakshi News home page

సమస్యను స్వాగతించు!

Published Fri, Jun 12 2020 12:49 AM | Last Updated on Fri, Jun 12 2020 12:49 AM

Khushboo utilized the lockdown period - Sakshi

కొత్త లుక్‌లో ఫొటోలను షేర్‌ చేసిన ఖుష్బూ

‘‘జీవితం ఎప్పుడూ పూలపాన్పు మాదిరిగానే ఉండదు. ఒక్కోసారి అది ముళ్లపాన్పుగా కూడా మారుతుంది. అయితే ముళ్లను కూడా మనం స్వీకరించగలగాలి. ఊహించని రీతిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ముందుగుసాగాలి’’ అంటున్నారు నటి ఖుష్బూ. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ –‘‘నీ జీవితంలోకి ఆకస్మాత్తుగా ఓ ఊహించని సమస్య వచ్చిపడింది. అప్పుడు నువ్వు ఏం చేస్తావ్‌? అధైర్య పడవద్దు. ముందుగా ఆ ప్రతికూల పరిస్థితులను నీ జీవితంలోకి స్వాగతించు. వచ్చిన సమస్యను అర్థం చేసుకో.

మానసిక స్థయిర్యం, ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించు. నా జీవన సూత్రం ఇదే’’ అని పేర్కొన్నారు ఖుష్బూ. ఇంకా తన ఫిట్‌నెస్‌ గురుంచి ఖుçష్బూ చెబుతూ– ‘‘ఇటీవల నా లుక్‌ మారింది. ఈ విషయం గురించి నన్ను చాలామంది అడిగారు. ఎవరి సాయం లేకుండా గడిచిన 70 రోజులుగా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. ఇంటిని శుభ్రపరచడం, దుమ్ము దులపడం, గిన్నెలు తోమడం, గార్డెనింగ్‌ పనులతో పాటుగా టాయిలెట్స్‌ కూడా కడిగాను’’ అన్నారు. ఇన్ని పనులు చేయడంవల్ల ఖుష్బూ కాస్త సన్నబడ్డారు. నిజానికి బొద్దుగా ఉండే ఖుష్బూ అంత భోజనప్రియురాలు కాదట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement