Phone theft
-
ఐఫోన్ కావాలంటే కొనుక్కోవాలికానీ కొరికితే ఎలా? వింత చోరీ వీడియో వైరల్!
iPhone theft: యాపిల్ ఐఫోన్ (Apple iPhone)15 త్వరలో లాంచ్ కాబోతోంది. యమా క్రేజ్ ఉండే ఐఫోన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఇది అప్డేట్లకు సంబంధించినది కాదు.. ఐఫోన్ చోరీకి సంబంధించినది. ఖరీదైన ఐఫోన్ల చోరీల గురించి తరచూ వింటుంటాం. ఈమధ్య ఈ ఫోన్ల దొంగతనాలు సృజనాత్మకంగా మారాయి. అలాంటిదే చైనాలో ఒకటి తాజాగా జరిగింది. ఆ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఓ యాపిల్ స్టోర్‌లో సుమారు రూ. 80,000 విలువ చేసే ఐఫోన్ 14 ఫ్లస్ (iPhone 14 Plus)ని చాకచక్యంగా దొంగిలించింది ఓ మహిళ. స్టోర్‌లో డిస్ప్లేకు ఉంచిన ఫోన్‌ను యాంటీ-థెఫ్ట్ కేబుల్‌ను కొరికేసి తన బ్యాగులో వేసుకుంది. అలారం స్టోర్ సిబ్బంది గుర్తించలేకపోయారు. చోరీ జరిగిన అరగంట తర్వాత చూసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ మహిళను అరెస్ట్ చేశారు. VIDEO: MUJER SE ROBA UN IPHONE A MORDIDAS Una cámara de seguridad captó el momento en que mujer roba un #iPhone de exhibición a mordidas en una Apple Store en #China. En las imágenes se puede apreciar a la fémina acercándose de manera disimulada a la mesa donde se encontraban… pic.twitter.com/eC7E6poeUy — El Dato Noticias Morelos (@eldatomx) September 2, 2023 -
సెల్‌ఫోన్ రికవరీలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి
నిత్య జీవితంలో సెల్‌ఫోన్ అత్యంత అవసరంగా మారింది. వినోదమే కాదు డిజిటల్ లావాదేవీలు, ముఖ్యమైన సమాచారం మొత్తం ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు. అంతటి ముఖ్యమైన సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ రికవరీలపై ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా రికవరీని ప్రారంభించి ఇప్పటికే వేలాది ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ మల్లికాగార్గ్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట: సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. ఈ నేరాలు ప్రకాశం జిల్లాలో గణనీయంగా పెరిగాయి. సెల్‌ఫోన్ చోరీలతో పాటు వాటిని మరిచిపోయినప్పుడు అందులోని డేటా విషయంలో ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు. బంధువులు, సన్నిహితులు, మిత్రుల ఫోన్ నంబర్లతో పాటు కీలకమైన డాక్కుమెంట్లు సైతం సెల్ఫోన్లోనే దాచుకోవడం సమస్యగా మారింది. అనుకోని పరిస్థితుల్లో సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో పోలీసులు సైతం సెల్‌ఫోన్ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు కాదు. సెల్‌ఫోన్ పోయిందంటూ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కితే చేదు అనుభవాలను మూటగట్టుకోవాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే తొలిసారిగా.. సెల్‌ఫోన్ రికవరీలపై ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేలకు వేలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన సెల్ఫోన్లు పొగొట్టుకున్న బాధితులకు సకాలంలో న్యాయం చేకూర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నూతన సాంకేతిక వ్యవస్థతో ఫోన్లను రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1600 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరో 1000 ఫోన్లను ఎవరు ఉపయోగిస్తున్నారో గుర్తించారు. 300 ఫోన్లు మన జిల్లాలో, 700 ఇతర రాష్ట్రాలు, జిల్లాలో ఉన్నట్లు గుర్తించి వాటిని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెల్‌ఫోన్ వినియోగంలో ఉంటేనే.. సెల్‌ఫోగొట్టుకున్న వారు పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియపరుస్తూ ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదును ఎస్పీ పర్యవేక్షణలోని ప్రత్యేక సాంకేతిక బృందం పరిశీలనకు స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి పంపిస్తారు. ఐఎంఈఐ ద్వారా ఆ సెల్‌ఫోన్ ఎక్కడ వినియోగిస్తున్నారో గుర్తించి రికవరీ చేస్తున్నారు. అయితే ఆ సెల్‌ఫోన్ వినియోగంలో ఉన్నప్పుడే రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం: మలికాగార్గ్, ఎస్పీ జిల్లాలో ఇప్పటి వరకు 3799 ఫిర్యాదు వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు జిల్లా ఐటీ కోర్ టీంకు అందుతాయి. జిల్లాలో మిస్సింగ్ మొబైల్స్‌ను ట్రేస్ చేసేందుకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు 1600 ఫోన్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేశాం. ఫోన్ పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫార్మాట్లో డేటాను పూర్తి చేసి ఇవ్వాలి. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేయాలి. 10 రోజుల్లోనే తెచ్చి ఇచ్చారు నా మొబైల్ పోయినట్లు ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే ఎస్సై నాకు అప్పగించారు. తిరిగి రాదనుకున్న రూ. 40 వేల సెల్‌ఫోన్ అందడం ఎంతో సంతోషంగా ఉంది. – ఎన్ రమణారెడ్డి, సర్పంచ్, పిటికాయగుళ్ల -
మీ ఫోన్ పోయిందా? అయితే ఇలా కనిపెట్టండి!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లను పోగొట్టుకోవడం, లేదంటే వాటిని దొంగతనం చేయడం సర్వ సాధారణమైంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ ఫోన్ థెప్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు, గతేడాది ముంబైలో ఎన్ని ఫోన్లు పోయాయి? వాటిపై ఎన్ని కేసులు నమోదయ్యాయో? తెలుపుతూ తాజాగా ఓ డేటా విడుదలైంది. ఆ డేటా ప్రకారం.. ►2021లో ముంబై నగరంలో మొత్తం 48,856 ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగతనం జరిగాయి ►ఇలా యూజర్లు ప్రతి రోజు కనీసం 134 ఫోన్లను కోల్పోయారు ►దొంగిలించిన, పోగొట్టున్న మొత్తం 52,883 ఫోన్లను ఇతరులు వినియోగింస్తున్నట్లు తేలింది. ►దొంగతనం జరిగిన ఫోన్లపై 3.5శాతంతో 1,853 ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనట్లు ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ తరుణంలో ఫోన్ దొంగతనం జరిగిందంటే ఐఎంఈఐ నెంబర్‌తో పోగొట్టుకున్న ఫోన్‌ను ఈజీగా గుర్తించవచ్చని, పోగొట్టుకున్న ఫోన్‌కు ఐఎంఈఐ (imei) నెంబర్ థంబ్ ప్రింట్లా ఉపయోగ పడుతుందని హ్యాకింగ్ నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు మనం ఆ ఐఎంఈఐ నంబర్ అంటే ఏమిటి? ఆ నెంబర్‌ను ఎలా గుర్తించాలి? ఆ నెంబర్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఐఎంఈఐ అంటే? ఐఎంఈఐ అంటే International Mobile Equipment Identity. ఇది ఒక ప్రత్యేకమైన 15-అంకెల సంఖ్య. ఈ నెంబర్‌తో సాయంతో పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడ ఉంది. వారి వివరాల్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్‌ను వినియోగిస్తే. మీకు రెండు ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి. ప్రతి సిమ్ స్లాట్‌కు ఒక ఐఎఈఐ నెంబర్ ఉంటుంది. మీ ఫోన్లో ఐఎంఈఐ నెంబర్ని ఎలా గుర్తించవచ్చు? ఐఎంఈఐ నెంబర్ సాధారణంగా మీ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.. ఆ నెంబర్‌ను స్టిక్లరపై ముంద్రించి ఫోన్ బాక్స్‌లో ఉంచి ఇస్తారు.మీ ఐఎంఈఐ నెంబర్‌ను గుర్తించేందుకు మరొక మార్గం. మీ మొబైల్లో *#06# డయల్ చేయడం. డయల్ చేస్తే ఐఎంఈఐతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఐఎంఈఐ ఎలా ఉపయోగపడుతుంది? మీ స్మార్ట్ ఫోన్ పోయినా లేదా దొంగిలించినా నెట్వర్క్ ప్రొవైడర్లు IMEI నంబర్ని ఉపయోగించి దాన్ని ట్రాక్ చేయవచ్చు. ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా..మీరు ఉపయోగిస్తున్న ఫోన్ పోతే.. ఇతరులు ఏ నెట్ వర్క్‌లకు పోర్టబుల్ అవ్వకుండా డిస్ కనెక్ట్ చేయోచ్చు. ఇతర ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. దీంతో మీ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్,ఇన్ కమింగ్ కాల్స్ రావు. ఇంటర్నెట్ కూడా పనిచేయదు. సౌకర్యాలతో పాటు ఈ ఐఎంఈఐ కోడ్ బ్రాండ్, మోడల్, విడుదలైన సంవత్సరం, స్పెసిఫికేషన్లతో సహా మొబైల్ గురించిన అనేక ఇతర వివరాల్ని వెల్లడిస్తుంది. మీరు https:// www imei .info/ని సందర్శించి అందులో మీ IMEI నంబర్ని నమోదు చేసుకుంటే ఫలితం ఉంటుంది. మీ ఫోన్ పోతే ఏం చేయాలి? ♦ పొరపాటు మీరు మీ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే ముందుగా అది రింగ్ అవుతుందో లేదో చెక్ చేయడం. మన అదృష్టం బాగుంటే మీరు ఫోన్ చేసినప్పుడు చేసినప్పుడు అవతల వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేస్తే.. మీ ఫోన్‌ను మీరు పొందవచ్చు. ♦ మీరు మీ iCloud లేదా Googleయాక్సెస్ చేయడం ద్వారా మీ డేటాను ఆన్లైన్లో తొలగించవచ్చు. ♦ దొంగతనం జరిగిందని భావిస్తే వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ♦ మీ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా సంప్రదించి, మీ సిమ్ కార్డ్‌ని బ్లాక్ చేయించండి. ఇతరులు మీ నెంబర్‌ను వినియోగించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా నిలిపివేయమని వారిని అడగండి. ♦ మీ ఫోన్‌కి కనెక్ట్ అయిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్, జీమెల్స్ పాస్‌వర్డ్‌లను మార్చండి. చదవండి👉 భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్లు ‘బ్యాన్’, స్పందించిన కేంద్రం! -
Crime News: ఫోన్ కోసం పరిగెత్తి ప్రాణం పొగొట్టుకున్నాడు
భోపాల్: ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసే ఘటన ఇది. ఫోన్ మాట్లాడుకుంటానని బతిమాలిన ఓ వ్యక్తి.. ఆపై దానితో పారిపోగా.. వెంబడిన ఫోన్ యజమాని రైలు కింద పడి నుజ్జు అయిన ఘటన ఇది. ఆదివారం రాత్రి సమయంలో.. మధ్యప్రదేశ్ షాదోల్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. 54 ఏళ్ల ప్రైవేటు పాఠశాల టీచర్ మనోజ్ నేమా, దుర్గ్-అజ్మీర్ రైలులో సాగర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి అత్యవసరంగా ఫోన్ మాట్లాడుకోవాలంటూ ఫోన్ అడిగాడు. ఆయన ఫోన్ ఇవ్వగా.. షాదోల్ స్టేషన్ వద్దకు రాగానే రైలు స్లో అయ్యింది. ఇదే అదనుగా ఆ దుండగుడు ఫోన్‌తో పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో నేమా అతని వెంటపడ్డారు. ఈ క్రమంలో కాలు జారి పట్టాలపై పడిపోయి ఆయన్ని.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. షాదోల్ జిల్లా ఖేరి గ్రామవాసి రాజేంద్ర సింగ్‌గా తేల్చి.. అతని నుంచి ఓ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ఈ దోపిడీ మరో ‘దృశ్యం’
సాక్షి, హైదరాబాద్: అదో ‘గ్రేట్ ఫోన్ డెకాయిటీ’... పదులు కాదు వందలు కాదు ఏకంగా 13,920 సెల్ఫోన్లు దుండగుల పాలయ్యాయి... కేవలం ఈ నేరమే కాదు కేసు దర్యాప్తు సైతం ఓ రికార్డే...చెన్నై కేంద్రంగా చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో హైదరాబాద్‌తో లింకులు బయటపడ్డాయి. అక్కడ తస్కరణకు గురైన ఫోన్లలో వెయ్యి సిటీలోని ఓ వ్యాపారి వద్దకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ నేపథ్యంలోనే నలుగురు అధికారులతో కూడిన టీమ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే వారికి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఆ బృందం తిరిగి వెళ్ళింది. అతడి కోసం గాలింపు కొనసాగించాలని నిర్ణయించింది. చెన్నై శివార్లలోని ఫ్లెక్స్‌ట్రానిక్స్ ఫెసిలిటీ సంస్థలో తయారైన 13,920 సెల్ఫోన్లను మహారాష్ట్ర పంపడానికి ఓ కంటైనర్‌లో లోడ్ చేశారు. రూ.15 కోట్ల విలువైన సెల్ఫోన్లతో కూడిన కంటైనర్‌ను తీసుకుని అక్టోబర్ 20న లారీ బయలుదేరింది. తమిళనాడులోని హోసూర్ సమీపంలో ఉన్న షోలాగిరి ప్రాంతానికి ఈ ట్రక్ అక్టోబర్ 21న చేరుకుంది. అక్కడ దీన్ని అడ్డగించిన దుండగులు డ్రైవర్ సతీష్ కుమార్ షా, సహాయకుడు అరుణ్‌పై దాడి చేసి ట్రక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం మరో లారీలోకి మార్చుకున్నారు.బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు షోలాగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన సెల్ఫోన్లతో కూడిన లారీని బందిపోటు దొంగలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు తీసుకువెళ్ళారు. ఈ కేసును ఛేదించడానికి చెన్నై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ఉన్నతాధికారులు, 32 మంది పోలీసులతో కూడిన సిట్ దాదాపు 40 రోజుల పాటు దర్యాప్తు చేసింది. అందులో భాగంగా సిట్ అధికారులు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించగలిగారు. చోరీ సెల్ఫోన్లతో కూడిన బందిపోట్ల లారీ తమిళనాడు నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా మధ్యప్రదేశ్ చేరిందని తేల్చారు. హోసూర్, బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్, ఆదిలాబాద్ రూట్లో వెళ్ళింది. షోలాగిరి నుంచి దాదాపు 1400 కిమీ ప్రయాణించిన ఈ లారీ 33 టోల్గేట్లను దాటింది. మార్గ మధ్యంలో 30 సార్లు నెంబర్ ప్లేట్లు మార్చినట్లు గుర్తించారు. ప్రతి ప్లాజా తర్వాత ఓ ప్లేట్ మారుస్తూ పోయారు. లారీ ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తోందో ఆ రాష్ట్రానికే చెందిన నకిలీ నెంబర్ ప్లేట్లు ముందే సిద్ధం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నేరం జరిగిన నాటి నుంచి కొన్ని రోజుల వ్యవధిలో చెన్నై, ఇండోర్ల్లో జరిగిన హవాలా లావీదేవీలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 28–30 తేదీల్లో దుబాయ్ కేంద్రంగా మాఫియా కార్యకలాపాలు నడుపుతున్న అబ్బాస్ ఇండోర్‌కు రూ.6 కోట్లు పంపినట్లు తేలింది. ఈ ఆధారంతో ముందుకు వెళ్ళిన సిట్ అధికారులు ఈ గ్యాంగ్ లీడర్ రాజన్ చౌహాన్‌ను అక్టోబర్ 26న పట్టుకున్నారు. ఇతడి విచారణలోనే మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అబ్బాస్‌కు ఆ సెల్ఫోన్లను రూ.6.5 కోట్లకు విక్రయించినట్లు అంగీకరించాడు. బందిపోటు దొంగలు లారీ నుంచి సెల్ఫోన్లను ఇండోర్‌లోని ఓ గోదాములోకి మార్చారు. అక్కడ వెయ్యి ఫోన్ల చొప్పున ప్యాక్ చేసి ఎయిర్ కార్గో ద్వారా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి సహా 14 నగరాలకు పంపారు. అక్కడి ముఠా ఈ సెల్ఫోన్లను మరో లారీలో ఎక్కించుకుని రోడ్డు మార్గంలో త్రిపుర రాజధాని అగర్తలకు తీసుకువెళ్ళి మరో టీమ్‌కు అప్పగించారు. వాళ్ళు ఆ సెల్ఫోన్లను దేశ సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్ చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అబ్బాస్ మనుషులు సెల్ఫోన్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ బందిపోటు దొంగతనంలో అబ్బాస్, రాజన్ చౌహాన్‌లతో పాటు 19 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వీరిలో కేవలం 10 మందిని పట్టుకున్న సిట్ చోరీకి గురైన 13,920 ఫోన్లలో ఏడు మాత్రమే రికవరీ చేయగలిగింది. ముఠాకు సహకరించిన హైదరాబాదీ కోసం సిట్ వేటాడుతూ ఇక్కడకు వచ్చింది. ముఠా సభ్యుల అరెస్టు విషయం తెలిసిన అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని తెలియడంతో తిరిగి వెళ్ళింది. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉండటాడు? అనే అంశాలను సిట్ అధికారులు పూర్తి గోప్యంగా ఉంచారు. -
మా నాన్నను కత్తితో బెదిరించి..
న్యూఢిల్లీ: హీరోయిన్ మీరా చోప్రా తన ట్విటర్ ద్వారా నేరాన్ని వెలుగులోకి తెచ్చారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ లాక్కుపోయారని ఆమె తెలిపారు. వాకింగ్ వెళ్లినప్పుడు ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఎంతో సురక్షిత ప్రాంతమని చెప్పుకుంటున్న ఢిల్లీలోనే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ట్వీట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. మరిన్ని వివరాలు అందించాలని కోరారు. పీసీఆర్ పోలీస్ లేన్, మోడల్ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్ రోడ్డులో ఈ చోరీ జరిగిందని మీరా చోప్రా సమాధానం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా బంధువైన మీరా చోప్రా పలు భాషల్లో నటించారు. తెలుగులో బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో సినిమాల్లో నటించారు. తాజాగా హిందీలో సెక్షన్ 375 సినిమాలో కీలక పాత్ర పోషించారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తాజా పరిస్థితిపై ఆమె స్పందిస్తూ.. ‘ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక షో కోసం ఏప్రిల్‌లో, ఒక సినిమా కోసం జూన్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నాను. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో పరిశ్రమలో ఎవరికీ తెలియదు. నా నిర్మాతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదనిపిస్తోంది. మనం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. మనమందరం కలిసి మొదట కరోనాతో పోరాడాలి, తర్వాతే దేని గురించైనా ఆలోచించాలి. ప్రస్తుతం మన మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమ’ని పేర్కొన్నారు. (రోడ్డుపై నోట్లు.. ఒక్కరు ముట్టుకుంటే ఒట్టు!) -
సెల్‌ఫోన్ దొంగను పట్టించిన జీపీఆర్ఎస్
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంటలోని ప్రభుత్వాస్పత్రి ఏరియాలో గురువారం ఉదయం ఓ ఇంట్లోకి దొంగ చొరబడి రెండు సెల్ఫోన్లు అపహరించాడు. కంగారుపడ్డ బాధితుడు జీపీఆర్ఎస్ సిగ్నల్‌తో దొంగను పట్టుకున్నాడు. పట్టణానికి చెందిన రావుల నరేశ్ గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్నాడు. జమ్మికుంట ప్రభుత్వాస్పత్రి ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం తన ఇంట్లోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి చొరబడి రూ.70వేల విలువైన రెండుసెల్ఫోన్లు అపహరించాడు. ఇంట్లో సెల్ఫోన్లు కనిపించకపోవడంతో కంగారుపడ్డ నరేశ్ మరో సెల్‌ఫోన్ సాయంతో జీపీఆర్ఎస్ విధానంతో వెతికాడు. ఈ క్రమంలో పట్టణంలోని ఓ మద్యంషాపు ఉన్న ఏరియాలో ఆ రెండు సెల్ఫోన్లు పని చేస్తున్నట్లుసిగ్నల్ ద్వారా గుర్తించాడు. వెంటనే అక్కడివెళ్లి గాలించాడు. బస్టాండ్ వెనకాల ఉన్న గల్లీలో గుర్తుతెలియని వ్యక్తి మద్యంమత్తులో పడిపోయాడు. అతడు ఉన్నచోట సెల్‌సిగ్నల్స్ రావడంతో అతడిజేబులో తనిఖీ చేశాడు. ఒక్క సెల్‌ఫోన్ లభించగా, మరోటి కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడకు చేరుకున్న వారు దొంగతనం చేసిన వ్యక్తి మద్యంమత్తులో ఉన్నాడని అక్కడి నుంచి వెళ్లినట్లు నరేశ్ తెలిపాడు. -
సెల్పోయిందా.. గుర్తించండిలా..
విజయనగరం: సెల్‌ఫోన్.. ప్రతి ఒక్కరికీ రోజువారీ కార్యకలాపాల్లో భాగమైపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లు కనిపించడం సర్వసాధారణమైపోయింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ఫోన్ చోరీకి గురవడమో లేదా పోవడమో జరుగుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రకమైన సాఫ్ట్వేర్ ఉంటే మన ఫోన్ ఎక్కడున్నా మనం ఇట్టే పట్టుకోవచ్చు. పోయిన ఫోన్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? దాని కోసం ఏం చేయాలి..? ఐఎంఈఐ నంబర్ తప్పనిసరి... * మీ సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫయర్ నంబర్) ఉండాలి. * మీరు సెల్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు బిల్‌పై ఈ నంబర్ కచ్చితంగా ఉంటుంది. ఉండేలా చూసుకోవాలి. * అదే లేకపోతే మీ ఫోన్ నుంచి స్టార్ యాప్ 06 యాష్‌ను డయల్ చేస్తే స్క్రీన్‌పై మీ ఐఎంఈఐ నంబర్ కనిపిస్తుంది. * దీని ఆధారంగా నెట్‌లోని కొన్ని సైట్లు పోయిన మీ ఫోన్ వివరాలు అందిస్తాయి. మొబైల్ థెఫ్ట్ యాప్స్ * ఇంటర్నెట్లో చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. * వీటిని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. * ఇక్కడ కూడా మీరు ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ ఇవ్వాలి * దొంగతనానికి గురైన ఫోన్లో సిమ్ వేసి వాడుతుంటే మీరు రిజిస్టర్ చేసిన సమయంలో ఇచ్చిన నంబర్‌కు చోరీ అయిన ఫోన్ నంబర్, ప్రాంతం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. వెబ్సైట్లు : http://www.trackimel.co.in/ http:www.lookout.com/ https://www.avst.com/enin/freemobilsecurity https://play.google.com/store/apps/details?idmobile https://theftspy.com/ పైన పేర్కొన్న వెబ్‌లు మాత్రమే కాకుండా ఇంకా అనేకం ఈ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని పే బిల్ సర్వీసులు ఉన్నాయి. సంబంధిత సైటుల్లో మీ ఫోన్ నంబర్ నమోదు చేసుకుని మీ వ్యక్తిగత వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్ నంబర్ పొందుపరచాలి. పోయిన మీ ఫోన్ వాడుకలో ఉంటే వెంటనే మీకు సమాచారం వస్తుంది. అంతకుముందే పోయిన మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌తో పోలీసు కంప్లయింట్ ఇవ్వాలి. మీకు వచ్చిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే మీ ఫోన్‌ను తిరిగి పట్టుకోవచ్చు.