న్యూఢిల్లీ: హీరోయిన్ మీరా చోప్రా తన ట్విటర్ ద్వారా నేరాన్ని వెలుగులోకి తెచ్చారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ లాక్కుపోయారని ఆమె తెలిపారు. వాకింగ్ వెళ్లినప్పుడు ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఎంతో సురక్షిత ప్రాంతమని చెప్పుకుంటున్న ఢిల్లీలోనే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ట్వీట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. మరిన్ని వివరాలు అందించాలని కోరారు. పీసీఆర్ పోలీస్ లేన్, మోడల్ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్ రోడ్డులో ఈ చోరీ జరిగిందని మీరా చోప్రా సమాధానం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా బంధువైన మీరా చోప్రా పలు భాషల్లో నటించారు. తెలుగులో బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో సినిమాల్లో నటించారు. తాజాగా హిందీలో సెక్షన్ 375 సినిమాలో కీలక పాత్ర పోషించారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తాజా పరిస్థితిపై ఆమె స్పందిస్తూ.. ‘ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక షో కోసం ఏప్రిల్‌లో, ఒక సినిమా కోసం జూన్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నాను. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో పరిశ్రమలో ఎవరికీ తెలియదు. నా నిర్మాతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదనిపిస్తోంది. మనం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. మనమందరం కలిసి మొదట కరోనాతో పోరాడాలి, తర్వాతే దేని గురించైనా ఆలోచించాలి. ప్రస్తుతం మన మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమ’ని పేర్కొన్నారు. (రోడ్డుపై నోట్లు.. ఒక్కరు ముట్టుకుంటే ఒట్టు!)
Comments
Please login to add a commentAdd a comment