knife-point
-
మా నాన్నను కత్తితో బెదిరించి..
న్యూఢిల్లీ: హీరోయిన్ మీరా చోప్రా తన ట్విటర్ ద్వారా నేరాన్ని వెలుగులోకి తెచ్చారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ లాక్కుపోయారని ఆమె తెలిపారు. వాకింగ్ వెళ్లినప్పుడు ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఎంతో సురక్షిత ప్రాంతమని చెప్పుకుంటున్న ఢిల్లీలోనే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ట్వీట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. మరిన్ని వివరాలు అందించాలని కోరారు. పీసీఆర్ పోలీస్ లేన్, మోడల్ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్ రోడ్డులో ఈ చోరీ జరిగిందని మీరా చోప్రా సమాధానం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా బంధువైన మీరా చోప్రా పలు భాషల్లో నటించారు. తెలుగులో బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో సినిమాల్లో నటించారు. తాజాగా హిందీలో సెక్షన్ 375 సినిమాలో కీలక పాత్ర పోషించారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తాజా పరిస్థితిపై ఆమె స్పందిస్తూ.. ‘ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక షో కోసం ఏప్రిల్‌లో, ఒక సినిమా కోసం జూన్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నాను. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో పరిశ్రమలో ఎవరికీ తెలియదు. నా నిర్మాతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదనిపిస్తోంది. మనం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. మనమందరం కలిసి మొదట కరోనాతో పోరాడాలి, తర్వాతే దేని గురించైనా ఆలోచించాలి. ప్రస్తుతం మన మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమ’ని పేర్కొన్నారు. (రోడ్డుపై నోట్లు.. ఒక్కరు ముట్టుకుంటే ఒట్టు!) -
కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్
బెంగుళూరు: కాల్ సెంటర్ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం కేసులో బెంగుళూరు పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ ఎన్ ఎస్ మేగారిక్ మంగళవారం వెల్లడించారు. అక్టోబర్ 3వ తేదీన కాల్ సెంటర్ ఉద్యోగిని(23) విధులు ముగించుకుని... ఇంటికి వెళ్లేందుకు రహదారిపై ప్రైవేట్ ట్యాక్సీ కోసం వేచి చూస్తుంది. ఆ క్రమంలో మినీ బస్సు వచ్చింది. దీంతో ఆమె ఆ వాహనం ఎక్కింది. బస్సును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అనంతరం ఆమెను కత్తితో బెదిరించి డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో పడేశారు. దాంతో ఆమె తన సోదరితోపాటు స్నేహితులకు సమాచారం అందించింది. బాధితురాలిని సెయింట్ జోన్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలి వద్దకు వచ్చి ఫిర్యాదు స్వీకరించారు. -
కత్తితో బెదిరిస్తూ సామూహిక లైంగిక దాడి
బెంగళూరు: ఇది గతంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడిని తలపించే మరో ఘటన. అయితే ఈసారి మాత్రం బెంగళూరులో. తన విధులు ముగించుకొని తిరిగొస్తున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ కాల్ సెంటర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ తన అక్కతో ఉంటోంది. ఉద్యోగంలో భాగంగా రాత్రి తన విధులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తూ మధ్యలో ఓ మినీ బస్సు ఎక్కింది. బస్సు కొంత దూరం వెళ్లాక అందులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను కత్తితో బెదిరించారు. అనంతరం వారికి ఆ బస్సు డ్రైవర్ కూడా తోడవడంతో అంతాకలిసి బస్సులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను మదివాలా అనే ప్రాంతంలోని ఓ గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం బాధితురాలు తన సోదరితో చెప్పడంతో ఆమె వచ్చి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.