కత్తితో బెదిరిస్తూ సామూహిక లైంగిక దాడి | Call Centre Employee Gang-Raped at Knife-Point in Bengaluru | Sakshi
Sakshi News home page

కత్తితో బెదిరిస్తూ సామూహిక లైంగిక దాడి

Published Tue, Oct 6 2015 8:52 AM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM

కత్తితో బెదిరిస్తూ సామూహిక లైంగిక దాడి - Sakshi

కత్తితో బెదిరిస్తూ సామూహిక లైంగిక దాడి

బెంగళూరు: ఇది గతంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడిని తలపించే మరో ఘటన. అయితే ఈసారి మాత్రం బెంగళూరులో. తన విధులు ముగించుకొని తిరిగొస్తున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన 20 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ కాల్ సెంటర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ తన అక్కతో ఉంటోంది.

ఉద్యోగంలో భాగంగా రాత్రి తన విధులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తూ మధ్యలో ఓ మినీ బస్సు ఎక్కింది. బస్సు కొంత దూరం వెళ్లాక అందులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను కత్తితో బెదిరించారు. అనంతరం వారికి ఆ బస్సు డ్రైవర్ కూడా తోడవడంతో అంతాకలిసి బస్సులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను మదివాలా అనే ప్రాంతంలోని ఓ గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం బాధితురాలు తన సోదరితో చెప్పడంతో ఆమె వచ్చి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించింది. ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement