సినిమా ఛాన్సుల కోసం వేడుకుంటున్న స్టార్‌ హీరోయిన్‌ చెల్లెలు | Meera Chopra Asking Movie Chance | Sakshi
Sakshi News home page

సినిమా ఛాన్సుల కోసం వేడుకుంటున్న స్టార్‌ హీరోయిన్‌ చెల్లెలు

Dec 17 2023 9:09 AM | Updated on Dec 17 2023 9:13 AM

Meera Chopra Asking Movie Chance - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాకు మీరా చోప్రా సోదరి అవుతుంది. టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్‌ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్‌ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్‌ సినిమాతో రాబోతుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం పోరాడి విసిగిపోయానని ఆమె చెప్పింది.

'నేను సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి చాలా విసిగిపోయాను. నేను ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయాను. అయినా వాటంన్నింటి అదిగమించి ముందుకు సాగాలని ఉంది. దయచేసి నాకు సినిమా అవకాశాలు ఇవ్వండి. బహిరంగంగానే అడుగుతున్నాను... దయచేసి నాకు కాల్ చేయండి.  నాకు మంచి పాత్రలు ఇవ్వండి. నేను నిజంగా మంచి నటిని అని అనుకుంటున్నాను. సెక్షన్ 375 అయిపోయాక మీరా చోప్రా కమ్‌ బ్యాక్‌ అన్నారు.

అందులో నా నటన చూసి ఎందరో ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా చాలా అవకాశాలు వస్తాయిని పలు కథనాలు రాశారు..  కానీ అలాంటిదేమీ జరగలేదు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్లానో నాకు తెలియదు. నేను నిజంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.

మీరా చోప్రా నటించిన సఫేద్‌ చిత్రంలో ఆమె విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో అయినా మరిన్నీ అవకాశాలు వస్తాయిని ఆమె ఆసిస్తుంది.  సఫేద్ డిసెంబర్ 29న రాబోతున్న లింగమార్పిడి, వితంతువుల మధ్య జరిగే అనూహ్యమైన ప్రేమకథ. గతంలో ఒకసారి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎవరో తనకు తెలియదని చెప్పి విమర్శలు ఎదుర్కొందీ భామ. తర్వాత క్షమాపణ చెప్పడంతో ఆ గొడవకు ఫుల్‌ స్టాప్‌ పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement