ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. డేట్ ఫిక్స్ | Meera Chopra Marries Rakshit Kejriwal: Revealed Haldi, Mehendi And Wedding Details - Sakshi
Sakshi News home page

Star Heroine Sister: ప్రియుడితో స్టార్ హీరోయిన్ సిస్టర్ పెళ్లి.. డేట్ ఫిక్స్

Published Thu, Mar 7 2024 3:23 PM | Last Updated on Thu, Mar 7 2024 3:43 PM

Star Heroine Sister Knot with Lover On This date Confirmed - Sakshi

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌లో ఇటీవల యంగ్ ఆశిష్ రెడ్డి,పెళ్లి చేసుకున్న సంగతి  తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా సైతం వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 12 తన ప్రియుడితో ఏడడుగులు నడవనుంది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్?.. పూర్తి వివరాలేంటో చూద్దాం. 

బాలీవుడ్ భామ మీరా చోప్రా తెలుగువారికి కూడా సుపరిచితమే. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాకు సోదరి అయిన మీరా చోప్రా టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్‌ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్‌ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీరా చోప్రా ప్రకటించింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఈనెల 12 గ్రాండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ద్వారా ఈ జంట ఒక్కటవ్వనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంతం వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మీరా ఫ్యామిలీ ఏర్పాట్లలో బిజీగా మారిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement