
గ్లోబల్ స్టార్ ఐకాన్ ప్రియాంక చోప్రా చెల్లి అన్న ఇమేజ్ తనకు పెద్దగా ఉపయోగపడలేని నటి మీరా చోప్రా పేర్కొంది. ప్రియాంక చోప్రా వల్ల తనకు సినిమాలు రాలేదని, కేవలం తన కష్టంతోనే సినిమా అవకాశాలు వరించాయని తెలిపింది. 'ప్రియాంక చోప్రా బంధువు కావడం వల్ల దర్శకులు నన్ను సంప్రదించలేదు. నేను ఆడిషన్స్ ఇచ్చి, వాళ్లకి నచ్చితేనే సినిమాల్లో తీసుకున్నారు. దీని కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. నేను సినిమాల్లోకి వచ్చే నాటికే ప్రియాంకకి స్టార్ ఇమేజ్ ఉంది. అయితే ఇదేదీ నా యాక్టింగ్ కెరియర్‌కు ఉపయోగపడలేదు. కానీ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సాధారణంగా అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలేవీ నేను ఎదుర్కోలేదు. ఇదొక్కటే నాకు లభించిన అడ్వాంటేజ్.
ఇక నాతో పాటు పరిణితీ చోప్రా, మన్నారా చోప్రా కూడా ఇండస్ర్టీలోకి వచ్చారు. అదృష్టవశాత్తూ నన్ను ఎవరితో పోల్చలేదు' అని పేర్కొంది. ఇక 2005లో ఎస్.జె. సూర్య నటించిన అబ్నే ఆరుయిరే అనే తమిళ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మీరా చోప్రా పలు దక్షిణాది సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మీరా చోప్రా ఆ తర్వాత వాన, ఖిలాడి, జగన్మోహిని వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ర్టీలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో ఓ సినిమాలో నటిస్తుంది.
చదవండి : ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక
నోరు మూస్కో, నా టైమ్ వేస్ట్ చేయకు: తాప్సీ
Comments
Please login to add a commentAdd a comment