
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఈమె తమ్ముడి నిశ్చితార్థం ఎలాంటి హడావుడి లేకుండా జరిగిపోయింది. ముంబయిలో శుక్రవారం ఈ వేడుక జరగ్గా.. సోమవారం కాబోయే వధూవరులతో పాటు ప్రియాంక చోప్రా బయటపెట్టింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి)
ప్రియాంక చోప్రా సోదరుడి పేరు సిద్ధార్థ్ చోప్రా.. 2019 మార్చిలోనే ఇషితా కుమార్ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. పెళ్లి జరగలేదు. ఇప్పుడు అదే సిద్ధార్థ్‌కి నీలమ్ ఉపాధ్యాయ అనే అమ్మాయితో హస్తకర్ వేడుక జరిగింది. ఉత్తరాది సంప్రదాయంలో ఉంగరాలు మార్చుకునే వేడుకని ఇలా పిలుస్తారు.
ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం ఈ నిశ్చితార్థం జరిగింది. అప్పుడే న్యూస్ వచ్చింది. తాజాగా సదరు ఫొటోలు బయటపెట్టడంతో ఎంగేజ్‌మెంట్ నిజమని తేలింది. ప్రియాంక చోప్రా కూడా కాబోయే వధూవరుల్ని ఆశీర్వదిస్తూ పోస్ట్ పెట్టింది. అలానే ఈ ఫొటోల్లో చోప్రా కజిన్స్ అందరూ కనిపించారు. నటి మన్నారా చోప్రా కూడా ఉంది. ఎందుకో పరిణీతి చోప్రా మాత్రం కనిపించలేదు.
(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)
Comments
Please login to add a commentAdd a comment