iPhone theft: యాపిల్ ఐఫోన్ (Apple iPhone)15 త్వరలో లాంచ్ కాబోతోంది. యమా క్రేజ్ ఉండే ఐఫోన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఇది అప్‌డేట్లకు సంబంధించినది కాదు.. ఐఫోన్ చోరీకి సంబంధించినది.
ఖరీదైన ఐఫోన్ల చోరీల గురించి తరచూ వింటుంటాం. ఈమధ్య ఈ ఫోన్ల దొంగతనాలు సృజనాత్మకంగా మారాయి. అలాంటిదే చైనాలో ఒకటి తాజాగా జరిగింది. ఆ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఓ యాపిల్ స్టోర్‌లో సుమారు రూ. 80,000 విలువ చేసే ఐఫోన్ 14 ఫ్లస్ (iPhone 14 Plus)ని చాకచక్యంగా దొంగిలించింది ఓ మహిళ. స్టోర్‌లో డిస్‌ప్లేకు ఉంచిన ఫోన్‌ను యాంటీ-థెఫ్ట్ కేబుల్‌ను కొరికేసి తన బ్యాగులో వేసుకుంది. అలారం స్టోర్ సిబ్బంది గుర్తించలేకపోయారు. చోరీ జరిగిన అరగంట తర్వాత చూసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ మహిళను అరెస్ట్ చేశారు.
VIDEO: MUJER SE ROBA UN IPHONE A MORDIDAS
— El Dato Noticias Morelos (@eldatomx) September 2, 2023
Una cámara de seguridad captó el momento en que mujer roba un #iPhone de exhibición a mordidas en una Apple Store en #China.
En las imágenes se puede apreciar a la fémina acercándose de manera disimulada a la mesa donde se encontraban… pic.twitter.com/eC7E6poeUy
Comments
Please login to add a commentAdd a comment