యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్‌పై స్పష‍్టత రానుంది.
ఐ ఫోన్ డిస్‌ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్‌ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్‌కు సిద్ధమైంది.
ఐఫోన్ 16 భారత్‌లో తయారవుతుందా?
మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.
ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటే
గతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్‌లో లభ్యమవుతుంది.
ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!
అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment