ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కి వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి? ఇటీవల ఆ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్‌లలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బంది పడుతుండగా.. ఫోన్‌లోని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని యాపిల్ సైతం హామీ ఇచ్చింది.
అయినప్పటికీ, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లు యాపిల్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, బీఎండబ్ల్యూ వినియోగదారులు ఐఫోన్ 15 ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టే సమయంలో హార్డ్‌వేర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
నివేదికల ప్రకారం బీఎండబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జర్‌లు ఐఫోన్ 15 ఎస్ వేడెక్కడానికి కారణమవుతున్నాయి. కారు వైర్‌లెస్ ఛార్జర్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వారి ఐఫోన్ 15 చాలా వేడెక్కిందని, దానిని డిస్‌కనెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదని బీఎండబ్ల్యూ కార్ల యాజమానులు చెప్పారంటూ నివేదికలు హైలెట్ చేశాయి.
ఫోన్ కూల్ అయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత ఫోన్ పనితీరు పునఃప్రారంభమవుతున్నట్లు గమనించానని ఓ వినియోగదారుడు తెలిపాడు. మరి ఈ సమస్య నుంచి యాపిల్, ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఆ రెండు కంపెనీలు బీఎండబ్ల్యూ కార్లలోని ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఇంతకుముందు
బీఎండబ్ల్యూ కార్ల వినియోగదారులతో పాటు ఇతర ఐఫోన్ 15 యూజర్లు యాపిల్‌కు వరుస ఫిర్యాదులు చేశారు. వాటిల్లో ప్రధానంగా... ఫోన్ మాట్లాడేటప్పుడు లేదంటే, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ వెనుక భాగం హీటెక్కుతుంది. ఇన్‌స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు. మరికొందరు ఆ ఫోన్‌ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు యాపిల్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.
చదవండి👉 ఐఫోన్ 15లో మరో సమస్య.. తలలు పట్టుకుంటున్న యాపిల్ లవర్స్
Comments
Please login to add a commentAdd a comment