Phone Charging
-
వరుస సమస్యలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి.. ఐఫోన్ 15తో ఈ సారి ఏకంగా
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కి వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి? ఇటీవల ఆ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్లలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బంది పడుతుండగా.. ఫోన్లోని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని యాపిల్ సైతం హామీ ఇచ్చింది. అయినప్పటికీ, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు యాపిల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, బీఎండబ్ల్యూ వినియోగదారులు ఐఫోన్ 15 ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే సమయంలో హార్డ్‌వేర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నివేదికల ప్రకారం బీఎండబ్ల్యూ వైర్లెస్ ఛార్జర్లు ఐఫోన్ 15 ఎస్ వేడెక్కడానికి కారణమవుతున్నాయి. కారు వైర్లెస్ ఛార్జర్లను ఉపయోగిస్తున్నప్పుడు వారి ఐఫోన్ 15 చాలా వేడెక్కిందని, దానిని డిస్కనెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదని బీఎండబ్ల్యూ కార్ల యాజమానులు చెప్పారంటూ నివేదికలు హైలెట్ చేశాయి. ఫోన్ కూల్ అయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత ఫోన్ పనితీరు పునఃప్రారంభమవుతున్నట్లు గమనించానని ఓ వినియోగదారుడు తెలిపాడు. మరి ఈ సమస్య నుంచి యాపిల్, ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఆ రెండు కంపెనీలు బీఎండబ్ల్యూ కార్లలోని ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇంతకుముందు బీఎండబ్ల్యూ కార్ల వినియోగదారులతో పాటు ఇతర ఐఫోన్ 15 యూజర్లు యాపిల్‌కు వరుస ఫిర్యాదులు చేశారు. వాటిల్లో ప్రధానంగా... ఫోన్ మాట్లాడేటప్పుడు లేదంటే, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ వెనుక భాగం హీటెక్కుతుంది. ఇన్స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు. మరికొందరు ఆ ఫోన్ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు యాపిల్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. చదవండి👉 ఐఫోన్ 15లో మరో సమస్య.. తలలు పట్టుకుంటున్న యాపిల్ లవర్స్ -
ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాతుండగా పేలిన ఫోన్.. వ్యక్తి మృతి..
భోపాల్: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్స్ మాట్లాడొద్దని నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బాద్నగర్ తహసీల్దార్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. దయారామ్ బరోద్ అనే 68 ఏళ్ల వ్యక్తి ఫోన్ బ్యాటరీ డౌన్ కావడంతో ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే కాల్ వచ్చింది. ఛార్జింగ్ ప్లగ్ తీయకుండా అలాగే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. దీంతో ఫోన్ పేలిపోయింది. పేలుడు ధాటికి దయారామ్కు తల, మొహం, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు సమయంలో దయారామ్ అతని స్నేహితుడు దినేశ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యే విషయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో దయానంద్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. కాల్ సడన్‌గా కట్ కావడంతో దినేశ్ దయారామ్కు మళ్లీ ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో ఏం జరిగి ఉంటుందా అని దగ్గర్లోనే ఉన్న దయారామ్ ఇంటికి వెళ్లిన అతడు షాక్ అయ్యాడు. తీవ్ర గాయాలపాలై దయానంద్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఇతని భార్య మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్నట్లు దినేశ్ చెప్పాడు. ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఛార్జర్ స్విచ్ బోర్డుకు కనెక్ట్ అయ్యే ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అయితే అతను ఏ కంపెనీ ఫోన్ ఉపయోగించాడనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినప్పుడు ఓవర్‌హీట్ వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ రెడ్ మార్క్‌లో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా డేంజర్ అని సూచించారు. చదవండి: హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. ముగ్గురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన యూపీ కోర్టు -
30 సెకన్లలోనే బ్యాటరీ ఫుల్!
లండన్: మీ ఫోన్లో చార్జింగ్ చాలా తక్కువగా ఉంది.. అత్యవసరంగా బయటకు వెళ్లాలి.. అక్కడెక్కడా ఫోన్‌ను చార్జింగ్ చేసుకునే సౌకర్యం లేదు.. ఇలాంటి పరిస్థితి వస్తే చాలా చికాకుగా ఉంటుంది కదూ.. అదేదో కేవలం కొద్ది సెకన్లలోనే చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటే..!? చాలా బాగుంటుంది. ఇలా కేవలం 30 సెకన్లలోనే పూర్తిగా చార్జ్ అయ్యే సరికొత్త బ్యాటరీని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన ‘స్టోర్‌డాట్’ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రెండు నానో మీటర్ల పొడవున్న ఆర్గానిక్ స్పటికాల సహాయంతో.. బ్యాటరీల్లో అతి చిన్న చుక్కల వంటి నిర్మాణాలను ఏర్పాటు చేశామని స్టోర్‌డాట్ సీఈవో డొరోన్ మేర్స్డార్ఫ్ తెలిపారు. దీనివల్ల బ్యాటరీల్లో కాంతి వేగంతో విద్యుత్ ప్రవహిస్తుందని, అత్యంత వేగంగా చార్జింగ్ అవుతుందని తెలిపారు. ఇటీవల టెల్ అవీవ్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో సామ్సంగ్ గెలాక్సీ ఎస్4లో అమర్చగల బ్యాటరీని కేవలం 26 సెకన్లలో చార్జింగ్ చేసినట్లు చెప్పారు