ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్ ముఖ్యమైన అలర్ట్‌ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్ 14 ప్లస్ యూనిట్‌లలో తలెత్తిన రియర్ కెమెరా సమస్య కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.
రియర్ కెమెరా సమస్య తమ హ్యాండ్‌సెట్‌పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్‌లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు
చెల్లించినవారు ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.
సమస్య ఇదే..
ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్‌లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 మధ్య తయారైనవి.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!
అయితే తమ ఫోన్‌లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్ ప్రోగ్రామ్ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్ ఏర్పాటు చేసిన సపోర్ట్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ నమోదు చేస్తే మీ ఫోన్‌కి ఫ్రీ సర్వీసింగ్ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment