ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది. దీంతో ఐఫోన్ 15 మీద టెక్ లవర్స్ దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15పై అనేక రూమర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్ మాక్ జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అందులో యాపిల్ సంస్థ సిమ్ కార్డ్ ట్రేస్ లేకుండా ఈ ఏడాది ఫ్రాన్స్‌లో ఐఫోన్ 15 అమ్మకాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
యాపిల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటే సిమ్ కార్డ్ ట్రేస్ లేని ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఫ్రాన్స్‌లో విక్రయాలు జరిగితే మిగిలిన ప్రపంచ దేశాల్లో సైతం ఐఫోన్‌లలో సిమ్ ట్రేస్ కనుమరుగు కానున్నాయి. ఐఫోన్ 15లో సిమ్ ట్రేస్‌ను తొలగిస్తే.. మొబైల్ నెట్ వర్క్ సాయంతో యాపిల్ ఫోన్‌లు ఈ - సిమ్ కార్డ్‌లతో పనిచేస‍్తాయి. ఫిజికల్ సిమ్ కార్డ్ లేకుండా మొబైల్ నెట్ వర్క్‌తో మొబైల్స్ పనిచేసేలా ఈ-సిమ్స్ వినియోగదారులను అనుమతిస్తుంది.
ఐఫోన్ 14లో ఈ - సిమ్
ఐఫోన్ 14 విడుల సమయంలో యాపిల్ సంస్థ ఈ - సిమ్‌ల వినియోగాన్ని ప్రోత్సహిచింది. ఎందుకంటే ఫిజికల్ సిమ్‌కార్డ్‌లతో పోలిస్తే ఇది మరింత సురక్షితమైనదని భావించింది. వీటిని విరగొట్టుచ‍్చు లేదా దొంగిలించవచ్చు. 2022లో యూఎస్‌లో విక్రయించబడిన ఐఫోన్ 14 సిరీస్‌లో యాపిల్ సిమ్ కార్డ్ ట్రేని తొలగించి విక్రయాలు నిర్వహించింది. ప్రస్తుతం, ఐఫోన్ 13, కొత్త ఐఫోన్ ఉత్పత్తులలో ఒకేసారి రెండు ఈ సిమ్‌లు పనిచేసే సౌకర్యం ఉంది. సిమ్ కార్డ్ ట్రేలు లేకుండా యాపిల్ ఐఫోన్ 15 మోడళ్లను భారత్‌లో విడుదల చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment