Exchange Offer
-
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఎథేర్ స్కూటర్ కొనుగోలు దారులకు ఎక్స్చేంజ్, కార్పొరేట్, ఫెస్టివల్ ఆఫర్లతో పాటు పలు స్కీమ్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక ఎక్ఛేంజ్ ఆఫర్లో భాగంగా కొనుగోలుదారులు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథేర్ ప్రో వెర్షన్ మోడల్ 450 ఎక్స్ (2.9 కిలోవాట్ అండ్ 3.7 కిలోవాట్), 450ఎస్ (2.9 కిలోవాట్). మోడళ్లపై రూ .40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో వాహనదారుల పాత పెట్రోల్ వేరియంట్ టూ వీలర్, కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలైంది. బండి కండీషన్, కొనుగోలు చేసే సమయంలో దాని ఒరిజనల్ ప్రైస్ ఎంత ఉందనే దానిని పరిగణలోకి తీసుకుని ఈ భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎథేర్ ప్రతినిధులు తెలిపారు. ఏథర్ 450 ఎస్ ప్రో వెర్షన్‌పై రూ .5,000 ఫెస్టివల్ బెన్ఫిట్స్, రూ .1,500 కార్పొరేట్ బెన్ఫిట్స్ను అందిస్తుంది. మరోవైపు, 450 ఎక్స్ వేరియంట్లు కూడా అదే కార్పొరేట్ స్కీమ్‌ను అందిస్తుంది. చివరగా, ఏథర్ 5.99శాతం వడ్డీ 24 నెలల ఈఎంఐని అందిస్తుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్లన్నీ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లో గరిష్టంగా రూ.40,000 డిస్కౌంట్, ఇతర స్కీమ్స్ కలిపి ఏథర్ 450 ధరలు గణనీయంగా తగ్గాయి. ఏథర్ 450ఎస్ అసలు ధర రూ.1,32,550 నుంచి రూ.86,050కు తగ్గింది. ఏథర్ 450 ఎక్స్ 2.9 కిలోవాట్ అండ్ 450 ఎక్స్ 3.7 కిలోవాట్ల ధరలు వరుసగా రూ.1,01,050, రూ.1,10,249 (ఢిల్లీలో అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) గా ఉన్నాయి. -
టీటీకే ప్రెస్టీజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్చేంజీ ఆఫర్
ముంబై: వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ ‘ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్’ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రెస్టీజ్ ఉత్పత్తుల ధరపై 24–66% వరకు తగ్గింపుతో ఈ ఆకర్షణీయమైన ఎక్స్చేంజీ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్లు తమ పాత వంట సామాగ్రిని తీసుకొచ్చి వాటిని మార్పిడి చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ అద్భుతమైన ఆఫర్ జూన్ 30 వరకు కొనసాగుతుంది. ‘‘మా కస్టమర్లు బ్రాండ్‌కు విధేయులు. ఈ బంపర్ ఆఫర్ ద్వారా వారితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆకర్షణీయమైన డీల్స్‌లో అత్యుత్తమ ఉత్పత్తులు అందిస్తున్నాము’’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ గార్గ్ తెలిపారు. -
రూ.10వేలయాపిల్ ఎయిర్‌పాడ్స్ రూ. 549కే: చెక్ యువర్ లక్!
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌పై ఓ లుక్కేయాల్సిందే. తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ ఎయిర్ పాడ్లు కేవలం రూ. 549కి అందుబాటులో ఉన్నాయి. Apple AirPod (2nd Gen) లు కంపెనీ అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో రూ. 9,999కి రీటైల్ చేస్తుండగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 549కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు, పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నట్టే, ఫ్లిప్కార్ట్సేల్లో ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలంటే పాతస్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుంది. తద్వారా నిబంధనల మేరకు రూ. 9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో సుమారు పది వేల రూపాయల యాపిల్ ఇయర్ బడ్స్‌ను రూ.549కి సొంతం చేసుకోవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) -
వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్
ముంబై: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఇండియా తన ఫ్లాగ్షిప్ మొబైల్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 10టీ 5 జీ పేరుతోఈ స్మార్ట్‌ఫోన్‌ను 16 జీబీ వేరియంట్‌తో భారతదేశంలో అత్యుత్తమ ర్యామ్‌తో తీసుకొచ్చింది. మొత్తం 8, 12, 16జీబీ ర్యామ్ వేరియంట్లలో లాంచ్ చేసింది. 12జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54999గా నిర్ణయించింది. అలాగే 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధరను రూ. 55999గా ఉంచింది. 8 జీబీ వేరియింట్పై అమెజాన్, వన్‌ప్లస్ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్ (8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్) 49వేల 999 రూపాయలకు అందుబాటులో ఉంచింది. అయితే అమెజాన్, వన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా తగ్గింపు ధరలో దీన్ని కొనుగోలు చేయవచ్చ. దీంతోపాటు ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుచేస్తే 3 వేల తగ్గింపు లభిస్తుంది. అలాగే కోటక్ బ్యాంక్ కార్డు కొనుగోలుతో ఈఎంఐ ఎంచుకున్నవారికి 1500 తగ్గింపు అదేవిధంగా, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే 1500 ధరతగ్గుతుంది. అంతేకాకుండా పాత వన్‌ప్లస్ సెల్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా వినియోగదారులు రూ. 15,750 దాకా ప్రయోజనం పొందవచ్చు. వన్‌ప్లస్ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.7-అంగుళాల పూర్తి-HD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే 1080×2,412 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ 50MP, 8MP 2MP ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,800mAh బ్యాటరీ 150వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ -
వారేవ్వా:రూ.10వేలకే!! రూ.30వేల ఖరీదైన 40 అంగుళాల ఎల్ఈడీ టీవీ!
మీరు టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకిదే సువార్ణావకాశం. 40అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ కేవలం రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.30వేలు ఉండగా ఎక్ఛేంజ్ ఆఫర్లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. 40అంగుళాల ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ 40అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.29,999కే అందుబాటులో ఉంది. అయితే ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎంఐ టీవీ ధరపై 23శాతం డిస్కౌంట్ తో రూ.22,999కే అందిస్తుంది. ఇక అదనంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్ తో టీవీ ధర రూ.21,499కి చేరుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీరు కోరుకున్న టీవీపై డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు 40అంగుళాల టీవీపై ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11వేల వరకు పొంద వచ్చు. దీంతో టీవీ ధర రూ.10,499లకే అందుబాటులోకి వస్తుంది. -
రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు భారీ బంపరాఫర్. ఐఫోన్ లవర్స్ కోసం దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఊహించని రీతిలో ఆఫర్లు ప్రకటించింది. 26శాతం డిస్కౌంట్‌తో పాటు ఇతర ఆఫర్ల కింద రూ.14వేలకే ఐఫోన్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోని మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్. ఈ ఫోన్‌ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని ప్రత్యేకత అటువంటిది. ఈ బ్రాండ్ ఫోన్ వాడాలనేది చాలా మంది సామాన్యుల కల. అయినా ఈఫోన్ ధర దిగిరాదు. ఐఫోన్ కు ఉన్న డిమాండ్ కారణంగా ధర తగ్గదు. అయితే ఇప్పుడు అలాంటి యాపిల్ కు చెందిన రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14వేలకే అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది ప్లిప్ కార్ట్‌లో భారీ తగ్గిన ఐఫోన్ ధరలు బ్లాక్ కలర్ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధర రూ.39,900 ఉండగా ఫ్లిప్‌కార్ట్ 26శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీంతో ఆ ఫోన్ పై మరో రూ.10,601 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.29,990కి తగ్గుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ ఎక్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ ఎస్ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. వివిధ మోడల్స్ పై ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఎక్స్చేంజి ఆఫర్ కింద గరిష్టంగా రూ.15,500 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ రూ.13,799కే అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు హాట్ స్టార్ వన్ ఇయర్ చందా కూడా అందిస్తుంది. అయితే ఎక్స్చేంజి ఆఫర్ మీ ఏరియా ఉందో లేదో తెలుసుకునేందుకు పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి తెలులుకోవచ్చు. -
రషీద్ ఖాన్‌కి బదులుగా...
సన్‌రైజర్స్ సంచలనం రషీద్ ఖాన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. గత రాత్రి సన్‌రైజర్స్ విక్టరీలో కీ రోల్ పోషించిన రషీద్‌పై ప్రశంసల కురుస్తోంది. అతనికి భారతీయ పౌరసత్వం ఇవ్వాలంటూ కొందరు విజ్ఞప్తులు చేశారు కూడా. అయితే అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘని అయితే రషీద్‌ను తమ దేశ జాతి సంపదగా అభివర్ణించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదంటూ ఓ ట్వీట్ కూడా చేయటం విశేషం. దీంతో ఆయనకు పలువురు ట్విటర్ వేదికగా ఎక్సేంజ్ ఆఫర్ ఇస్తున్నారు. ‘రషీద్ ఖాన్‌ను ఇచ్చి.. బదులుగా మా కమాల్ రషీద్ ఖాన్‌కు తీసుకోండి’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్ చేశాడు. సినీ సెలబ్రిటీలపై అభ్యంతరకర కామెంట్లు చేస్తూ, ఆయా సెలబ్రిటీ ఫ్యాన్స్‌తో తిట్లు తింటూ తరచూ వార్తల్లో నిలిచే కమాల్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో వ్యక్తయితే ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తీసుకుని, రషీద్ ఖాన్‌ను ఇచ్చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. ‘సర్ రషీద్‌ను ఇవ్వండి. కేజ్రీవాల్‌ను తీసేసుకోండి. ఆయన(కేజ్రీవాల్) యూ టర్న్ సెలబ్రిటీ’ మరొకతను రీట్వీట్ చేశాడు. ‘జడేజా బదులుగా రషీద్‌ను ఇచ్చేయండి, ఫ్రీగా శ్రీశాంత్‌ను కూడా తీసుకోండి ఘని సాబ్’ అంటూ మరో వ్యక్తి రీట్వీట్ చేశాడు. ఈ ఎక్సేంజ్ ఆఫర్‌పై సరదా ట్వీట్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
‘జియోఫై’ పై క్యాష్‌బ్యాక్ ఆఫర్
జియోఫై ఫ్యామిలీ విస్తరణలో భాగంగా రిలయన్స్ కొత్త జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 999 రూపాయల ధర కలిగిన ఈ డివైజ్‌పై జియో సరికొత్త ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. పరిమిత ఆఫర్ ప్రకారం 999 రూపాయలకు లభించే జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేసేటపుడు మన దగ్గర ఉన్న పాత డోంగల్/ మోడమ్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇలా చేస్తే క్యాష్‌బ్యాక్ మీ సొంతం.. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలంటే మొదట జియో స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత జియో సిమ్‌ను యాక్టివేట్ చేసి రూ.198 లేదా 299 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. జియోప్రైమ్ మెంబర్షిప్ కోసం అదనంగా మరో 99 రూపాయలు చెల్లించాలి. నాన్ జియో డోంగల్‌ను ఎక్స్చేంజ్ చేసుకునేటపుడు.. ఆ డోంగల్ సీరియల్ నెంబర్‌ను పొందపరచాలి. అదే విధంగా కొత్తగా కొనుగోలు చేసిన జియోఫై ఎమ్‌ఎస్‌డీఎన్ (MSDN) నంబర్‌ను కూడా జత చేయాలి. అలా అయితేనే క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా చేయడం ద్వారా ‘మైజియో’ అకౌంట్లో 2,200 రూపాయలు క్రెడిట్ అవుతాయి. కానీ ఈ మొత్తమంతా ఒకేసారి క్రెడిట్ కాకుండా 50 రూపాయల విలువ గల 44 వోచర్లు లభిస్తాయి. కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రవేశపెట్టిన జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌పై ఏడాదిపాటు వారెంటీ ఉంది. దీని డౌన్లోడ్ స్పీడు 150ఎంబీపీఎస్, అప్లోడ్ స్పీడు 50ఎంబీపీఎస్. ‘డిజైన్డ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్.. పవర్ ఆఫ్/ఆన్ చేయడానికి ఫిజికల్ బటన్లను, డబ్ల్యూపీఎస్, బ్యాటరీ కోసం నోటిఫికేషన్ లైట్స్‌ను కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్వర్క్ కనెక్ట్ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే స్మార్ట్ఫోన్లలోని జియో 4జీ వాయిస్ యాప్‌తో హెచ్డీ వాయిస్, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఏఎల్టీ3800 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డివైజ్ ఎఫ్‌డీడీ బ్యాండ్ 3, బ్యాండ్ 5, టీడీడీ-బ్యాండ్ 40లను సపోర్టు చేస్తుంది. -
పాత ఫోన్ ఇవ్వండి.. కొత్త ఫోన్ తీసుకోండి
ముంబై : షావోమి 2017 నవంబర్‌లో ప్రారంభించించిన ట్రేడ్ ఇన్ కార్యక్రమాన్ని ఇక మీదట తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా షావోమి తన వినియోగదారులకు ఇన్స్టాంట్ ఎక్స్చేంజ్ కూపన్లను అందిస్తోంది. ఈ కూపన్లతో వినియోగదారులు పాత స్మార్ట్ ఫోన్లను ఇచ్చి, కొత్త ఫోన్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కాషీఫై భాగస్వామ్యంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని తొలుత అన్ని షావోమీ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టోర్లకే పరిమితమైన ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని షావోమి తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లోకి కూడా విస్తరించింది. ఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందడానికి, ఎంఐ.కామ్‌లో దానికి కేటాయించిన ప్రత్యేక పేజీలోకి వెళ్లాలి. అక్కడ ఎక్స్చేంజ్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. షావోమి మీ ఫోన్ కండీషన్, ప్రస్తుతం మార్కెట్లో దాని విలువను బట్టి మీకు ఉత్తమ ఎక్స్చేంజ్ ధరను సూచిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర నచ్చితే మీ ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్ సహాయంతో ఎక్స్చేంజ్ వాల్యూ కూపన్‌ని పొందవచ్చు. ఈ నగదు మీ ఎమ్ఐ అకౌంట్‌కి జమ అవుతుంది. ఆ ఎక్స్చేంజ్ కూపన్ సహాయంతో మీరు మీకు నచ్చిన కొత్త షావోమి ఫోన్‌ను తీసుకోవచ్చు. ఎక్స్చేంజ్లో ఫోన్ కొనాలంటే కచ్చితంగా మీ పాత ఫోన్ పనిచేస్తూ ఉండి, ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా ఉండాలనే నిబంధనను పెట్టింది కంపెనీ. మీ పాత ఫోన్ స్ర్కీన్లాక్ను తీసేసి, మిగతా సీక్రేట్ లాక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అన్‌లాక్ చేసి ఇవ్వాలని పేర్కొంది. షావోమి లిస్ట్‌లో ఉన్న ఫోన్లకే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వినియోగదారుడు ఒక్కసారి ఒక్క ఫోన్‌ను మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్చేంజ్ కూపన్ వాలిడిటి కేవలం 14 రోజులు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం స్మార్ట్ఫోన్లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
చౌక ధరకే.. ఐఫోన్ 8!
ఆపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు భారత్‌లో రేపటి నుంచి విక్రయానికి రాబోతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ రేపు నావి ముంబైలోని లాంచ్ చేయబోతున్నారు. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెజాన్, రిలయన్స్ జియోలు ఈ రెండు హ్యాండ్సెట్లపై ఇప్పటికే ధరలను తగ్గించినట్టు ప్రకటించగా... తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీటి జాబితాలో చేరిపోయింది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఐఫోన్ 8 బేస్ మోడల్‌ను అత్యంత తక్కువకు రూ.31,100కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా రూ.40,100కు తగ్గించింది. ఐఫోన్ 8 ఆఫర్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను రూ.23 వేల వరకు అందిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ 7 ఉండి ఉంటే, దాన్ని కొత్త దానితో అప్‌గ్రేడ్ చేసుకుంటే, ధరపై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 7 ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.23వేల డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఐఫోన్ 7ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి రూ.64వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8(64జీబీ వేరియంట్) రూ.41వేలకే లభ్యం కానుంది. పాత హ్యాండ్‌సెట్‌ను తీసుకున్నందుకు పికప్ ఛార్జీలుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిటీ క్రెడిట్ లేదా వరల్డ్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే, మరో 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కార్పొరేట్ కార్డులకు అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్ కూడా ప్రీ-ఆర్డర్ లావాదేవీలకు సెప్టెంబర్ 29 సాయంత్రం 5:59 వరకు మాత్రమే వాలిడ్‌లో ఉండనుంది. 2017 డిసెంబర్ 30 కంటే వరకు ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం అకౌంట్లో క్రెడిట్ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లన్నింటిన్నీ తీసుకుంటే, ఐఫోన్ 8 బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,100కు, ఐఫోన్ 8 ప్లస్ బేస్ వేరియంట్ రూ.40,100కు లభ్యం కానున్నాయి. అదేవిధంగా 256జీబీ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ వేరియంట్లు కూడా రూ.44,100కు, రూ.53,100కు కొనుగోలుచేసుకోవచ్చు. ఈ ఫోన్లను కొనుగోలు చేసే అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, సిటీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టడ్, ఎస్బీఐ, యస్ బ్యాంకుల వినియోగదారులకు 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అమెజాన్ కూడా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.12,100 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో కూడా సిటీ బ్యాంకు కార్డులపై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. క్యాష్‌బ్యాక్‌తో పాటు బైబ్యాక్ గ్యారెంటీని ప్రకటించింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ రూ.1999లే
ఆన్ లైన్ రీటైలర్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి ఐఫోన్ మోడల్స్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద కేవలం రూ.1999కే ఐఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.17,999 రూపాయలుగా ఉన్న ఐఫోన్ 5 ఎస్ (16 జీబీ వేరియంట్-సిల్వర్, స్పేస్ గ్రే)పై ఫ్లిప్ కార్ట్ 16 వేల రూపాయల భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది. ఆ ఆఫర్ వల్ల రూ.1999కే ఐఫోన్ 5 ఎస్ ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఐఫోన్ 6 ఎస్ (32 జీబీ వేరియంట్ - రోజ్ గోల్డ్)లకు కూడా వర్తిస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ప్రస్తుతం లిస్టెడ్ ధర రూ.40,999గా ఉండగా, దానిపై ఫ్లిప్ కార్ట్ 16 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. ఇలావుండగా, గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 (32 జీబీ వేరియంట్ - సిల్వర్, రోజ్ గోల్డ్, గోల్డ్)ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో తక్కువగా 37 వేల రూపాయలకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 7 అసలు ధర 57 వేల రూపాయలు. దాంతో పాటు ఐఫోన్ 7 ప్లస్ ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో అందించనుంది. బేస్ ధర రూ.68,4000 గా ఉన్న ఈ ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్ లో 48,4000 రూపాయలకు లభిస్తుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ల (128 జీబీ, 256 జీబీ వేరియంట్లపై) 20 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంచుతున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. గూగుల్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందించనున్నట్టు తెలిపింది. గూగుల్ పిక్సెల్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లపై రూ.16వేల వరకు ధర తగ్గించనున్నట్టు పేర్కొంది. అయితే ఏ ఫోన్ల ఎక్స్చేంజ్తో ఐఫోన్ల ధర తగ్గించనుందో ఫ్లిప్ కార్ట్ వెల్లడించలేదు. -
9 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్
ఆపిల్ ఐఫోన్ 6పై దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్6 స్పేస్ గ్రే 16జీబీ వెర్షన్ ఫోన్‌పై రూ.22వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తూ అతి తక్కువగా రూ.9,900కే అందించనున్నట్టు తెలిపింది. ఈఎంఐలో చెల్లించాలనుకునే వారికి అదనంగా బ్యాంకుల నుంచి 5 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఆశ్చర్యకరంగా ఈ భారీ డిస్కౌంట్ కొత్త ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకునే కొనుగోలుదారులకే వర్తించనుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.31,990గా ఉంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను 16 జీబీ ఐఫోన్6తో ఎక్స్చేంజ్ చేసుకునే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కచ్చితంగా అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ భరోసా ఇస్తోంది. గతేడాదే ఆపిల్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ అనే రెండు కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. కానీ ఐఫోన్ 6ఎస్‌కు అదనంగా యూజర్ల అనుభూతి కోసం ఆశించదగ్గ ఆఫర్లను ఆపిల్ ఈ ఫోన్లో అందించలేదు. రియల్ బ్లాక్, జెట్ బ్లాక్ రంగుల్లో ఐఫోన్7 ప్లస్‌ను ఆపిల్ ప్రవేశపెట్టింది. కొత్త ఐఫోన్లను కొనదలుచుకున్నవారికి కేవలం ఈ రెండు కలర్ ఫోన్లే అందుబాటులో ఉంచింది. అతిపెద్ద ఐఫోన్ 7 ప్లస్ 188 గ్రాములుండగా.. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 192 గ్రాముల బరువుంటుంది. -
జోయ్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల ఎక్స్చేంజీ ఆఫర్
హైదరాబాద్: బంగారు ఆభరణాల ఎక్స్ఛేంజీ అవకాశాన్ని ప్రముఖ బంగారు ఆభరణాల రిటైల్ చెయిన్ సంస్థ జోయాలుక్కాస్ అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను, కొత్త ఆభరణాలతో ఉచితంగా మార్చుకోవచ్చని జోయాలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తాము ఎంచుకున్న కొత్త బంగారు ఆభరణాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా మార్చుకోవచ్చని జోయాలుక్కాస్ గ్రూప్ సీఎండీ జోయ్ ఆలుక్కాస్ పేర్కొన్నారు. ఎలాంటి మేకింగ్, వేస్టీజీ చార్జీలు వసూలు చేయబోమని వివరించారు. జోయాలుక్కాస్, లేదా ఇతర నగల దుకాణాల్లో కొనుగోలు చేసిన ఆభరణాలను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని వివరించారు. భారత్‌లోని అన్ని జోయాలుక్కాస్ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. -
మొబైల్ కొంటున్నారా?
శేఖర్ మొబైల్ ఫోన్ మార్చాలనుకున్నాడు. ఎలాగూ మారుస్తున్నాం కదా... చక్కని ఫీచర్లున్న బ్రాండెడ్ మొబైల్... అది కూడా కెమెరా, ర్యామ్, ప్రాసెసర్ అన్నీ బాగా అప్‌గ్రేడెడ్ అయి ఉంటే బాగుండుననుకున్నాడు. అందుకే... జీతంలోంచి నెలనెలా దాచిన మొత్తాన్ని తీసి దాదాపు రూ.50 వేలు పెట్టి కొత్త ఫోన్ తీసుకున్నాడు. ఇంతా చేసి పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేశాడు కానీ... దానికి గాను తగ్గించిన మొత్తం కేవలం రూ.3వేలు. కొన్నపుడేమో ఆ ఫోన్ కూడా దాదాపు 12 వేలు పెట్టి కొన్నదే. కాకుంటే ఏడాది వాడకానికే దాని ధర రూ.3 వేలకు పడిపోయింది. సరే! పోతే పోయిందని కొత్త ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో తీసుకున్న శేఖర్ సంతోషం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇపుడు ఆఫీసులో అతనిదే లేటెస్ట్ ఫీచర్లున్న హై-ఎండ్ మొబైల్. నాలుగు నెలలు గడిచింది. ఆ రోజే కొన్న కొత్త ఫోన్‌ను తెచ్చి శేఖర్‌కు చూపించాడు రఘు. అందులో ఉన్న ఫీచర్లను వివరిస్తుంటే శేఖర్ బుర్ర తిరిగింది. ఎందుకంటే అన్నీ శేఖర్ ఫోన్‌కన్నా ఆధునిక ఫీచర్లే. కెమెరా నుంచి ర్యామ్, మెమరీ వరకూ అన్నీ ఎక్కువే. ధర మాత్రం కేవలం రూ.17,500. శేఖర్ కొన్న బ్రాండ్ కాకపోయినా అది కూడా మంచి బ్రాండే. శేఖర్‌కు ఆ రోజంతా నిద్రపట్టలేదు. తను రూ.50వేలు పెట్టి ఫోన్ కొని నిండా నాలుగు నెలలు కాలేదు. అంతకన్నా మంచి ఫోన్... అంతకన్నా చాలా తక్కువ ధరకే!! ఎలా సాధ్యం? మర్నాడు రఘుతో ఇదే మాటంటే తనేమన్నాడో తెలుసా? నువ్వు కొన్న ఫోన్ కూడా ఇపుడు రూ.30 వేలకే వస్తోందోయ్!! అని! గతేడాది భారతదేశ మార్కెట్లోకి 1,137 మోడళ్ల మొబైల్ ఫోన్లు విడుదలయ్యాయి. అంటే... రోజుకు 3.11 కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చి చేరాయన్న మాట. మరి ఎంత కొత్త ఫోనైనా ఇలాంటి మార్కెట్లో నెల తిరిగేసరికి పాతబడిపోతోందంటే వింతేముంది? ఇక స్మార్ట్ఫోన్లను చూస్తే గతేడాదికి అంతర్జాతీయంగా విడుదలైన 691 మోడళ్లలో 476 మోడళ్లు భారతీయ కంపెనీలవే. అంటే సగటున భారతీయ కంపెనీలు రోజుకు 1.3 స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయన్నమాట. మరి రోజుకో కొత్త ఫోను మార్కెట్లోకి వస్తున్నపుడు ఏ ఫోనైనా ఎన్నాళ్లు కొత్తగా ఉంటుంది చెప్పండి? అందుకే... ఫోన్లు కొనే టపుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ తరవాత బాధ పడాల్సిన అవసరం రాకపోవచ్చనేది నిపుణుల సలహా. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో * ఒక దాన్ని మించి మరొకదాన్లో ఫీచర్లు; ధరలోనూ పోటీ * విడుదల చేసిన ఐదారు నెలలకే ధరలు తగ్గిస్తున్న కంపెనీలు * అందుకే కొనేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు అవసరాన్ని తెలుసుకోండి! * ఫోన్ కొనేముందు మీ అవసరమేంటో తెలుసుకోండి. కేవలం మాట్లాడటానికా? లేక గేమ్స్ ఆడటానికా? మంచి ఫొటోలు తీసుకోవటానికా? డిజిటల్ అసిస్టెంట్‌లా వివిధ అవసరాలకు వాడుకోవటానికా? ఇలా అవసరమేంటో తెలుసుకోవాలి. * ఫొటోలకోసం అనుకోండి. అప్పట్లో మార్కెట్లో అత్యధిక పిక్సెల్ కెమెరాతో ఏ ఫోన్ ఉంటే అది కొనుక్కునే ప్రయత్నం చేయాలి. గేమ్స్ కోసమనుకుంటే అధిక ర్యామ్ ఉండే ఫోన్‌ను, వీడియోల కోసం తీసుకునేవారు పెద్ద డిస్ప్లేను చూసుకోవాలి. ఇలా మన అవసరానికి తగ్గ ఫీచర్ హైఎండ్‌లో ఉన్నది చూసుకుని మిగతా విషయాల్లో రాజీ పడొచ్చు. అప్పుడు ఫోన్ తక్కువ ధరకే వస్తుంది. - కొన్నాళ్ల తర్వాత మరిన్ని ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా... మన అవసరానికి సంబంధించిన ఫీచర్ మాత్రం మరీ మారిపోయే అవకాశాలు తక్కువ. బాధేమీ ఉండదు. కొన్నాళ్లు వేచి చూడండి... ఫోన్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే కొనేసుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. తరవాత మరింత హైఎండ్ ఫోన్ వస్తే అది కూడా కొనేయొచ్చునని అనుకుంటారు. అలాంటి వాళ్ల విషయంలో ఇబ్బం దులేవీ ఉండవు. కానీ ఎప్పుడో ఒకసారి దాచుకున్న సొమ్మం తా పెట్టి కొత్త ఫోన్ కొనేవారు మాత్రం మార్కెట్లోకి రాగానే కొనేయటం సరికాదు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చాకే ఆ ఫోన్ సత్తా ఏంటో తెలుస్తుంది. ఒకవేళ వినియోగదారులకు నచ్చకపోతే తయారు చేసిన స్టాకంతా విక్రయించాలి కనుక రేటు తగ్గించి అమ్మటానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. బాగా సక్సెస్ అయిన ఒకటిరెండు మోడళ్లు మినహా ఏ మోడల్ ధరైనా కొద్ది నెలలకే దాదాపు 30-40% తగ్గిపోవటానికి ప్రధాన కారణమిదే. అందుకని కాస్త వేచిచూస్తే బెటర్. హోంవర్క్ చేస్తే మంచిది... ఏదైనా ఫోన్ కొనాలనుకున్నపుడు దాని ఫీచర్లు, ధర ఇతరత్రా వివరాలు తెలుసుకుని... మార్కెట్లో అలాంటి ఫీచర్లున్న ఇతర ఫోన్ల ధరలు కూడా ఎంతున్నాయో తెలుసుకోవాలి. ఇపుడు చాలా దుకాణాలు ఇలాంటి కంపేరిజన్ను అందిస్తున్నాయి. ఇక ఆన్లైన్ సైట్లయితే చెప్పనే అక్కర్లేదు. ఏ ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్లినా మూడు నాలుగు ఫోన్లను ఎంచుకుని వాటిలో ఫీచర్లను, ధరను పోల్చి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కొన్ని ఫోన్లను పోల్చి చూసుకున్నాకే ఎంచుకుంటే, తక్కువ ధరకే నచ్చిన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ధరలెందుకు తగ్గుతున్నాయంటే... కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి. ధరలెందుకు తగ్గుతున్నాయంటే.. కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి.