9 వేలకే ఫ్లిప్కార్ట్లో ఐఫోన్
Published Tue, Jan 3 2017 3:42 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
ఆపిల్ ఐఫోన్ 6పై దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ను ఆఫర్ను ప్రకటించింది. ఐఫోన్6 స్పేస్ గ్రే 16జీబీ వెర్షన్ ఫోన్పై రూ.22వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తూ అతి తక్కువగా రూ.9,900కే అందించనున్నట్టు తెలిపింది. ఈఎంఐలో చెల్లించాలనుకునే వారికి అదనంగా బ్యాంకుల నుంచి 5 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఆశ్చర్యకరంగా ఈ భారీ డిస్కౌంట్ కొత్త ఐఫోన్ 6ఎస్ ప్లస్తో ఎక్స్చేంజ్ చేసుకునే కొనుగోలుదారులకే వర్తించనుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.31,990గా ఉంది.
ఐఫోన్ 6ఎస్ ప్లస్ను 16 జీబీ ఐఫోన్6తో ఎక్స్చేంజ్ చేసుకునే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కచ్చితంగా అందించనున్నట్టు ఫ్లిప్కార్ట్ భరోసా ఇస్తోంది. గతేడాదే ఆపిల్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ అనే రెండు కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. కానీ ఐఫోన్ 6ఎస్కు అదనంగా యూజర్ల అనుభూతి కోసం ఆశించదగ్గ ఆఫర్లను ఆపిల్ ఈ ఫోన్లో అందించలేదు. రియల్ బ్లాక్, జెట్ బ్లాక్ రంగుల్లో ఐఫోన్7 ప్లస్ను ఆపిల్ ప్రవేశపెట్టింది. కొత్త ఐఫోన్లను కొనదలుచుకున్నవారికి కేవలం ఈ రెండు కలర్ ఫోన్లే అందుబాటులో ఉంచింది. అతిపెద్ద ఐఫోన్ 7 ప్లస్ 188 గ్రాములుండగా.. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 192 గ్రాముల బరువుంటుంది.
Advertisement
Advertisement