iPhone Flipkart Offers: You Can Get iPhone Rs14000 In Flipkart | రూ.14వేల‌కే యాపిల్ ఐఫోన్‌!! ఇక మీదే ఆల‌స్యం! - Sakshi
Sakshi News home page

రూ.14వేల‌కే యాపిల్ ఐఫోన్‌!! ఇక మీదే ఆల‌స్యం!

Published Fri, Feb 11 2022 12:37 PM | Last Updated on Sat, Feb 12 2022 5:49 AM

You Can Get Iphone Rs14000 In Flipkart - Sakshi

యాపిల్ ఐఫోన్ ల‌వ‌ర్స్‌కు భారీ బంప‌రాఫ‌ర్‌. ఐఫోన్ ల‌వ‌ర్స్ కోసం దేశీయ ఈకామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్  ఊహించ‌ని రీతిలో ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. 26శాతం డిస్కౌంట్‌తో పాటు ఇత‌ర ఆఫ‌ర్ల కింద రూ.14వేల‌కే ఐఫోన్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.  

యాపిల్ ఐఫోన్ ప్ర‌పంచంలోని మొబైల్ ప్రియుల‌కు అత్యంత ఇష్ట‌మైన బ్రాండ్‌. ఈ ఫోన్‌ను ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే దీని ప్ర‌త్యేక‌త అటువంటిది. ఈ బ్రాండ్ ఫోన్ వాడాల‌నేది చాలా మంది సామాన్యుల క‌ల. అయినా ఈఫోన్ ధ‌ర దిగిరాదు. ఐఫోన్ కు ఉన్న డిమాండ్ కార‌ణంగా ధ‌ర త‌గ్గ‌దు. అయితే ఇప్పుడు అలాంటి యాపిల్ కు చెందిన రూ.39,900 విలువైన‌ ఐఫోన్ ఎస్ఈని కేవ‌లం రూ.14వేల‌కే అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది

ప్లిప్ కార్ట్‌లో భారీ త‌గ్గిన ఐఫోన్ ధ‌ర‌లు 
బ్లాక్ క‌ల‌ర్ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధ‌ర రూ.39,900 ఉండ‌గా ఫ్లిప్‌కార్ట్ 26శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీంతో ఆ ఫోన్ పై మ‌రో రూ.10,601 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధ‌ర రూ.29,990కి త‌గ్గుతుంది. 

ఎక్ఛేంజ్ ఆఫ‌ర్ 
ఎక్ఛేంజ్ ఆఫ‌ర్ కింద ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ ఎస్ ఫోన్ ధ‌ర మ‌రింత త‌గ్గుతుంది. వివిధ మోడల్స్ పై ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఎక్స్చేంజి ఆఫర్ కింద గరిష్టంగా  రూ.15,500 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ రూ.13,799కే అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు హాట్ స్టార్ వన్ ఇయర్ చందా కూడా అందిస్తుంది. అయితే ఎక్స్చేంజి ఆఫర్  మీ ఏరియా ఉందో  లేదో తెలుసుకునేందుకు  పిన్ కోడ్‌ను ఎంట‌ర్ చేసి తెలులుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement