ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించిందని వాపోయాడు.
“నేను జనవరి 13న ఫ్లిప్‌కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు.
I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing
— Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024
OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk
Comments
Please login to add a commentAdd a comment