online sale
-
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్‌కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
Ayodhya: ఆన్లైన్లో ప్రసాదం.. అమెజాన్‌కు నోటీసులు
ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ.. ఆధ్యాత్మికం పేరిట ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల హవా కనిపిస్తోంది. తాజాగా అయోధ్య పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)ఫిర్యాదు నేపథ్యంలో.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA)అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. శ్రీ రామ మందిర్ అయోధ్య ప్రసాద్.. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్ పేడ.. ఇతరాల్ని అమెజాన్‌లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ మిఠాయిలనే.. అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్లైన్లో అమ్ముతున్నారని.. మోసపూరిత వాణిజ్య పద్ధతుల్లో అమెజాన్ నిమగ్నమై ఉందని.. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్‌పై ఫిర్యాదులో పేర్కొంది సీఏఐటీ. నోటీసుల నేపథ్యంలో అమెజాన్ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది సీసీపీఏ. మరోవైపు నోటీసులపై అమెజాన్ స్పందించింది. ఈ విషయంలో సెల్లర్ల జాబితాను పరిశీలించాలి చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
డార్క్‌వెబ్‌లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్‌వెబ్‌లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్‌వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్‌గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
పొట్టు పొట్టు చినిగిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం
పారిస్: అరచేతిలో ఫోన్ ద్వారానే ఆర్డర్లు చేసుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. బయటి మార్కెట్ల కన్నా.. ఆన్లైన్లోనే ఇప్పుడు అడ్డగోలు ప్రొడక్టులు దర్శనమిస్తున్నాయి. అదే టైంలో చిత్రవిచిత్రమైనవి కూడా కనిపిస్తున్నాయి. తాజాగా బాగా పేరున్న ఓ కంపెనీ వాళ్లు చేసిన పని.. సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ కావడం లేదు. అందుకు కారణం.. పొట్టు పొట్టుగా చినిగిన షూస్‌ను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడం. లగ్జరీ బ్రాండ్లకు కేరాఫ్ అయిన ‘బలెన్షియాగా’ తాజాగా పారిస్ స్నీకర్ కలెక్షన్ పేరుతో లాంచ్ చేసింది. ఈ షూస్ ఎలా ఉన్నాయంటే.. కనీసం వేసుకోవడానికి కూడా పనికి రానంతగా! Balenciaga's New "Fully Destroyed" Shoe Set👟 x R36 000 per pair💵 Would you wear these? pic.twitter.com/oEduoUs1Fj — claztik🕊 (@claztik17) May 11, 2022 కానీ, వాళ్లు ఆ షూస్‌ను రిలీజ్ చేసింది వేసుకోవడానికేనట. పైగా అదే ఫ్యాషన్ అని ప్రకటించింది. వీటిలో రెండు స్టయిల్స్‌ను రిలీజ్ చేయగా.. మినిమమ్ ధర 495 డాలర్లు (మన కరెన్సీలో 38 వేల డాలర్లు) నుంచి గరిష్టంగా 1, 850 డాలర్లు (మన కరెన్సీలో లక్షా 44 వేల రూపాయల) దాకా ఉంది. మట్టి కొట్టుకుపోయి.. సర్వనాశనం అయిన ఈ షూస్‌ను లిమిటెడ్ ఎడిషన్ అంటూ వంద జతలను మాత్రమే రిలీజ్ చేసిందట. వీటి అందానికి తోడు ‘‘స్నీకర్స్ అంటే జీవిత కాలం ధరించేవి’’ అంటూ ఓ క్యాప్షన్ సైతం ఉంచింది బలెన్షియాగా. ఇంత దరిద్రాన్ని చూశాక ట్రోల్ రాజాలు ఊరుకుంటారా?.. ఆ ప్యాషన్‌ను పేకాట ఆడేసుకుంటున్నారు. Nueva Barbie Balenciaga pic.twitter.com/Wg9RCIvViA — Zorrito Zorrales (@ZorritoZorrales) May 9, 2022 Anyone who buys Balenciaga needs to go see the therapist https://t.co/xHG5N75x9y — Shabib Siddiqui 👨🏻🦯 (@shabibazam) May 10, 2022 -
కొంపముంచిన కోతి బొమ్మ.. చిటికేసినంత ఈజీగా రెండు కోట్ల రూపాయలు లాస్!
Bored Ape NFT Loss To Trader During Online Sale: కంగారు.. ఏమరపాటులో చేసే పనులు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇక్కడ కోట్లు కలిసి వస్తాయని ఆశపడ్డ ఆ వ్యక్తికి.. నష్టమే మిగిలింది. పొరపాటున బోటన వేలు తగిలి దాదాపు రెండు కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బోర్డ్ ఏప్ (దిగాలుగా ఉన్న కోతి).. మీమ్ నుంచి ఎన్ఎఫ్టీ (నాన్ ఫంగిబుల్ టోకెన్) ఫ్రాంచైజీగా ఎదిగి.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భారీ బిజినెస్ చేస్తోంది. సుమారు పది వేల పీసులు ఉన్న ‘బోర్డ్ ఏప్’ ఎఎఫ్టీ యాట్చ్ క్లబ్లో హాలీవుడ్ సెలబ్రిటీలు జిమ్మీ ఫాలోన్, స్టెఫ్ కర్రీలాంటోళ్లు సైతం ఉన్నారు. ఇప్పటివరకు గరిష్టంగా ఇది 85 ఎథెర్(క్రిప్టోకరెన్సీ కాయిన్ ఎథెర్.. 3, 20,000 డాలర్లకు సమానం) అమ్ముడుపోవడం విశేషం. అయితే ఈమధ్యే కాలంలో ఈ ఎన్ఎఫ్టీ 3 లక్షల డాలర్లకు(2,28,15,750రూ.) తక్కువ కాకుండా ట్రేడ్ అవుతోంది. దీంతో తన దగ్గరున్న ఎన్ఎఫ్టీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు ఓ ట్రేడర్. మాక్స్ అనే వ్యక్తి (మ్యాక్స్నాట్ యూజర్‌నేమ్) 75 ఎథర్‌లకు (3 లక్షల డాలర్లకు) ఆ ఎన్ఎఫ్టీ పీస్‌ను ఆన్లైన్లో అమ్మేయాలనుకున్నాడు. అయితే ధర నిర్ధారించేలోపు.. పొరపాటున అతని బోటన వేలు కంప్యూటర్ మౌస్ క్లిక్ అయ్యింది. దీంతో ధర 0.75 ఎథర్(3,000 డాలర్లు)గా కన్ఫర్మ్ అయ్యింది. తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది. ఇక అంతే.. మన కరెన్సీ విలువ ప్రకారం.. 2,28,10,800రూ. అమ్ముడుపోవాల్సిన ఈ ఎన్ఎఫ్టీ.. కేవలం రూ. 2, 20, 000లకు అమ్ముడుపోయింది అది. తనకు వాటిల్లిన నష్టంపై ఘోల్లుమంటూ ఆ యూజర్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. చికేసినంత ఈజీగా రెండున్నర లక్షల డాలర్లు.. (మన కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయల దాకా) నష్టపోయానని వాపోయాడు. ఇందులో మరో దరిద్రం ఏంటంటే.. గతంలోనూ ఈ యూజర్‌కు ఇలానే ఆన్లైన్ సేల్ ద్వారా 20,000 డాలర్ల (15 లక్షల రూపాయల దాకా) నష్టం వాటిల్లడం. What do you gain from thinking about it? You just feel bad by choice. If you can't do anything about it, don't think about it. And you'll live a pretty happy life. — maxnaut.eth (@maxnaut) December 13, 2021 ఎన్ఎఫ్టీ అంటే బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! -
ఈ అరుదైన రూ. 1 కాయిన్‌కు కోటి రూపాయలా..!
గత కొన్ని రోజులుగా పాత రూ. 2, రూ. 5, రూ.10, 25 పైసల కాయిన్స్‌ను భారీ మొత్తంలో ఆన్లైన్ మార్కెట్లో విక్రయించడం చూసే ఉంటారు. చాలా మంది తమ దగ్గరున్న అరుదైన పాత నాణేలను ఆన్లైన్లో విక్రయిస్తూ భారీ మొత్తంలో నగదును సంపాదిస్తున్నారు. కొంత మంది కాయిన్స్‌ను సేకరించే అభిరుచి ఉన్నవారు ఆన్లైన్లో వారికి నచ్చిన అరుదైన కాయిన్స్‌ను కొనుగోలు చేయడానికి ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ అరుదైన కాయిన్స్‌ను ఎక్కువగా ఇండియా మార్ట్‌లో విక్రయించడం గమనించవచ్చును. తాజాగా 1885 సంవత్సరానికి చెందిన రూ.1 కాయిన్‌ను కోటి రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ కాయిన్ ప్రత్యేకత ఏమిటంటే..ఈ కాయిన్‌పై విక్టోరియా మహారాణి చిత్రం ఉంది. దాంతో పాటుగా బ్రిటిష్ కింగ్ జార్జ్-5 చిత్రం కాయిన్ ఉన్న అరుదైన కాయిన్‌కు ఆన్లైన్లో కోటి రూపాయాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరుదైన కాయిన్‌ను ఇండియా మార్ట్‌లో కొనుగోలుదారులతో చర్చించడంతో భారీ మొత్తంలో నగదును పొందవచ్చును. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే ఇండియామార్ట్‌లో రిజిస్టరై కొనుగోలుదారులతో చర్చించి భారీ మొత్తాన్ని పొందవచ్చును. అరుదైన కాయిన్స్‌ను, నోట్లను సేకరించే వారిని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తారు. వీరు అరుదైన కాయిన్లను, నోట్లను సేకరించి అధ్యయనం చేస్తారు. -
పదేళ్లుగా లవర్ కోసం వెతుకులాట..
పదేళ్లుగా లవర్ కోసం ఆన్లైన్ సహా అన్ని రకాల డేటింగ్ యాప్స్ వెతికినా అతనికి ఒక్క అమ్మాయి కూడా దగ్గర కాలేకపోయింది. దీంతో ఎలాగైనా ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సంపాదించాలనే ప్రయత్నంలో ఆ వ్యక్తి ఈసారి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. అదేంటంటే ఫేస్బుక్ పేజీలో తనను తాను అమ్మాకానికి పెట్టుకున్నాడు. అయితే ఈసారి మాత్రం అతను విఫలమవ్వలేదు. ఎందుకంటే అతను షేర్ చేసిన పోస్ట్‌కు ఫేస్బుక్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గర్ల్‌ఫ్రెండ్ పొందాలనే ఆశ త్వరలోనే నెరవేరేలా కనిపిస్తుంది.(చదవండి : ఎదుగుదలను ఓర్వలేక పెట్రోల్ పోసి సజీవ దహనం) ఇక అసలు విషయానికి వస్తే.. 30 ఏళ్ల లాన్ క్లేటన్ గత పదేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నాడు. ఈ పదేళ్లలో ఆన్లైన్ సహా డేటింగ్ యాప్స్ వెతికినా అతన్ని ప్రేమించడానికి ఒక అమ్మాయి కూడా ముందుకు రాలేదు. దీంతో క్లేటన్ కొంచెం కొత్తగా ఆలోచించి.. నేను సింగిల్.. గుడ్ కండీషన్లో ఉన్నా అంటూ ఫేస్బుక్ పేజీలో తనను తాను అమ్మకానికి పెట్టుకున్నాడు. అంతేగాక క్లేటన్ ఇలా తనను తాను అమ్మకానికి పెట్టుకోవడం వెనుక కారణాన్ని కూడా వివరించాడు. ' హలో ఆల్ లేడీస్... నాపేరు క్లేటన్.. వయస్సు 30 ఏళ్లు.. గత పదేళ్లుగా సింగిల్‌గా ఉంటున్నా.. నాతో ప్రేమగా మాట్లాడే అమ్మాయి కోసం పదేళ్లుగా వెతుకున్నా.. అంతేగాక కొన్ని పెళ్లిళ్లకు వెళ్లాల్సి ఉన్నా సింగిల్‌గా ఉండడంతో వెళ్లలేకపోయా.. ఏ పెళ్లికి వెళ్లినా జంటగానే వెళ్లాలని నిశ్చయించుకున్నా. గత పదేళ్లుగా సరైన అమ్మాయి కోసం ఎన్నో డేటింగ్ యాప్స్ వెతికాను. నాకు అదృష్టం లేకపోవడంతో అది వర్కవుట్ కాలేదు. అందుకే ఈసారి కొత్తగా ఆలోచించి.. ఫేస్బుక్లో నన్ను నేను అమ్మకానికి పెట్టుకున్నా .. నన్ను ఒకసారి పరిశీలించండి 'అంటూ రాసుకొచ్చాడు.(చదవండి : కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు) తాజాగా క్లేటన్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లేటన్ షేర్ చేసిన ఫోటోలకు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. కాగా నెటిజన్లు అతను పెట్టిన పోస్టును చదివి 'క్లేటన్ మీ ఆశ తప్పక నెరవేరుతుందంటూ' మెసేజ్‌లు పెడుతున్నారు. కాగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న క్లేటన్ జీవితంలో తొందరగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన స్నేహితుల్లో కూడా చాలామందికే ఇప్పటికే పెళ్లిళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ క్లేటన్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. అయితే ఎప్పటికైనా తన జీవితంలోకి ఎవరో ఒకరు తప్పకుండా వస్తారని.. ఆమెతో తన జీవితం సంతోషంగా గడుపుతానని క్లేటన్ అంటున్నాడు. క్లేటన్ ఆశ నెరవేరాలని మనము కోరుకుందాం. -
మలబార్లో ఆన్లైన్ కొనుగోలు సౌకర్యం
కాప్రా: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో బంగారు ఆభరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏఎస్‌రావునగర్ స్టోర్స్ ఇన్చార్జి పీకె.షిహాబ్ తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రామిస్ టు ప్రొటెక్ట్’క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో మీ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆయన పేర్కొన్నారు. -
ఆన్లైన్లో ‘పందెం కోళ్లు’
డేగ... కాకి... రసంగి.. నెమలి..ఇవన్నీ పక్షులన్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ రకాల పందెం కోళ్లకు ఇవే పేర్లతో పిలుస్తారు. వీటికి ప్రత్యేకమైన పేర్లుండడమే కాదు..వేలల్లో ధరలు పలుకుతాయి. సంక్రాంతి దగ్గర పడడంతో పందెం కోళ్లకు గిరాకీ మొదలైంది. విక్రయాలు జోరందుకున్నా యి. ఇదే సమయంలో వీటి పెంపకందార్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తాము పెంచిన కోళ్లతో సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకొని ఆన్లైన్ విక్రయాలకు శ్రీకారం చుడుతున్నారు. తూర్పుగోదావరి, అమలాపురం: ‘సంక్రాంతి సమయంలో కోడి పందేలను జరగనిచ్చేది లేదు...ఉక్కు పాదంతో అణచివేస్తాం’ అని ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా...మరోవైపు పందేలకు నిర్వహకులు చిరు కత్తులు నూరే పనిలో పడ్డారు. సంక్రాంతి సమయం దగ్గర పడడంతో పందేల నిర్వహకులు బరులను సిద్ధం చేయడంతోపాటు పందేలకు కావాల్సిన కోళ్ల కొనుగోలుకు వేట ప్రారంభిస్తున్నారు. ఏడాది పొడవునా మేకమాంసం, నాటు గుడ్లు, పాలు, బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిని పందెం కోళ్లకు తినిపించి బలోపేతం చేస్తున్నారు. ఒక్కో పందెం కోడి ఆహారానికి అయ్యే ఖర్చు రోజుకు రూ.50కి పైబడి ఉంటుందని అంచనా. స్థానికంగా ఉన్న పందెం నిపుణులతోపాటు, బిహార్ నుంచి వచ్చే ప్రత్యేక ట్రైనీలు వీటికి శిక్షణ ఇస్తారు. ఇందుకోసం వీరికి నెలకు రూ.50 వేల వరకూ చెల్లిస్తారు. ఇంత ఖర్చు పెడతారు కాబట్టే వీటి ధర వేలల్లో ఉంటుంది. ఒక్కో కోడి రకాన్ని బట్టి రూ.6 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంటుందంటే వీటి డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలో పెంచే పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. మన జిల్లాలో రాజోలు దీవిలో చింతలపల్లి, సఖినేటిపల్లి, లక్కవరం, భట్టేలంక, శంకరగుప్తం, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, అల్లవరం మండలం గోడి, గోడిలంక పరిసర ప్రాంతాల్లో పెంచే పందెం కోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉంది. కాకినాడ నుంచి వచ్చిన కొంతమంది రాజోలు దీవిలో పందెం కోళ్లను పెంచుతుండడం విశేషం. సాధారణంగా ఈ కోళ్లను స్థానికంగా పెంచే పెంపకందార్ల వద్దనే కొనుగోలు చేస్తారు. కానీ గత కొన్నేళ్లుగా సామాజిక మాధ్యమాల పుణ్యమాఅని కొన్ని ప్రాంతాల్లో కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందుకు తగినట్టుగా పెంపకందారులు ఆన్లైన్ విక్రయాలకు తెరదీశారు. కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది పెంపకందారులు ‘నూజివీడు కాక్స్’, అనంతపురం జిల్లా పెంపకదారులు ‘జాతికోళ్ల పెంపకం’, నెల్లూరు పెంపకందారులు ‘జాతికోళ్ల పెంపకం సేల్స్’ పేర్లతో ఫేస్ బుక్‌లలో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో ఆయా కోళ్లు తలపడే సన్నివేశాలను, కోళ్లను ప్రదర్శనకు ఉంచుతున్నారు. కొంతమంది ఏకంగా కోళ్ల రకాలు.. వాటి ధరలనూ ప్రదర్శిస్తున్నారు. పనిలో పనిగా సెల్‌ఫోన్ నెంబర్లను పంపించి క్రయ, విక్రయాలకు తెరదీస్తున్నారు. దీంతో పందెం కోళ్ల మార్కెట్ కొత్త తరహాలో పరుగులు తీస్తోంది. -
ఆన్లైన్లో ఆదివాసీ పెయింటింగ్‌లు
సాక్షి, ఏటూరు నాగారం: ఆదివాసీల పెయింటింగ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. గతంలో పెయింటింగ్‌లు వేసి కావాల్సిన వారికి విక్రయించే వారు. ఇప్పుడు ఆన్లైన్ సదుపాయం పెరగడంతో ఆదివాసీ కళాకారులు వేసిన పెయింటింగ్‌లను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ట్రైబల్ పెయింటింగ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఇప్పటి వరకు పది చిత్రాలను అమెజాన్‌లో విక్రయానికి పెట్టగా ఆరు అమ్ముడుపోయాయి. హైదరాబాద్ ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ సారథ్యంలో ఆదివాసీ కళాకారులు వేసిన పెయింటింగ్‌లను విక్రయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా మేడారం మ్యూజియంలో కొంత మంది ఆదివాసీ కళాకారులకు పెయింటింగ్‌లు వేసేందుకు నిధులను సమకూర్చారు. దీంతో కొంత మంది కళాకారులు చిత్రాలు వేసి అమెజాన్‌లో విక్రయానికి పెట్టారు. ఒక్కో చిత్రానికి రూ.6,500 ధర నిర్ణయించారు. ఇలా వచ్చిన డబ్బును ఆదివాసీ కళాకారులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికొంత పెట్టుబడికి సహకరిస్తే మరిన్ని చిత్రాలు తయారు చేసి విక్రయిస్తామని కళాకారులు పేర్కొంటున్నారు. స్టాల్ ఏర్పాటుకు చర్యలు.. ఆదివాసీ, గిరిజన కళాకారులు రూపొందించిన చిత్రా లను వారే స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు జిల్లా, మండల, రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సంత (స్టాల్స్) వంటివి ఏర్పాటు చేసి వారే స్వయంగా వాటిని విక్రయించి వచ్చిన డబ్బును సమానంగా పంచుకు నేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
వెండి..రేటు బాగుందండీ..
అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానంలోని సుమారు 672 కిలోల వెండి అచ్చులను ప్రభుత్వ ఆన్లైన్ విక్రయ సంస్థ ‘ఎంఎంటీసీ’ ( హైదరాబాద్)ద్వారా ఈ–వేలంలో విక్రయించగా కిలో వెండికి అత్యధికంగా రూ.33,972 రేటు పలికినట్టు దేవస్థానం ఈఓ ఎం.జితేంద్ర శుక్రవారం తెలిపారు. గతంలో ఇదే వెండిని మరో సంస్థ ద్వారా విక్రయించేందుకు టెండర్లు కోరగా కిలో వెండికి రూ.32,500 మాత్రమే కోట్ చేశారు. దాంతో పోల్చితే ప్రస్తుతం వచ్చిన ధర అధికమైనందున ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ దృష్టికి తీసుకువెళ్లి ఆమె అనుమతి మేరకు విక్రయిస్తామని తెలిపారు. ఈ విక్రయం ద్వారా రూ.2.25 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ మొత్తంతో బంగారం కొనుగోలు చేసి ఆ బంగారాన్ని స్టేట్‌బ్యాంక్ గోల్డ్‌బాండ్ స్కీంలో డిపాజిట్ చేస్తామని వివరించారు. భక్తులు ఇచ్చిన కానుకలు కరిగించగా వచ్చిన వెండి.. భక్తులు సత్యదేవునికి సమర్పించిన సుమారు 700 కిలోల వెండి కానుకలను 2015 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని మింట్‌కు తరలించి కరిగించారు. ఆ కానుకల వెండిలో డస్ట్‌ను తొలగించి మిగిలిన వెండిని అచ్చులుగా వేయించారు. ఇలా కరిగించడం వల్ల 92 శాతం ప్యూరిటీ కలిగిన సుమారు 672 కేజీల వెండి లభించింది. అప్పటి నుంచి ఆ వెండిని ఆన్లైన్ విక్రయసంస్థల ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించగా ఇప్పటికి అత్యధిక రేటు వచ్చింది. -
రూ. 14లక్షల వాచ్‌ను తెలివిగా కాజేశారు
సింగపూర్ : మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా తెలివిగా చోరీలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులుగా నటించిన ఇద్దరు దొంగలు యజమాని కళ్లు గప్పి రూ. 14.3 లక్షల విలువైన వాచ్‌ను ఎత్తుకెళ్లిన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. టాంగ్ అనే వ్యక్తి తన రోలెక్స్ వాచ్‌ను కార్వోసేల్ అనే ఆన్లైన్ సెల్లింగ్ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. దాని విలువ రూ. 14.3 లక్షలు(29,500 సింగపూర్ డాలర్లు)గా పేర్కొన్నారు. అమ్మకానికి పెట్టిన వాచ్‌ను చూసిన వెన్‌పింగ్, జోష్వా అనే ఇద్దరు దొంగలు దాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. అచ్చూ ఆ వాచ్‌లానే కనిపించే నకిలీ రోలెక్స్ వాచ్‌ను కొనుగోలు చేశారు. వాచ్‌ను కొనుగోలు చేస్తామని యజమానిని సంప్రదించారు. టాంగ్ చెప్పిన అడ్రస్‌కు వెళ్లిన నిందితులు వాచ్‌ను చూపించమన్నారు. టాంగ్‌కు అనుమానం రాకుండా ఒరిజినల్ వాచ్ స్థానంలో నకిలీ వాచ్‌ను ఉంచి అక్కడి నుంచి ఉడాయించారు. దీన్ని ఆలస్యంగా గ్రహించిన టాంగ్ మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించాడు. సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
పందెంకోడి ఆన్లైన్
సాక్షి, అమరావతి: నెట్టింట్లో పందెం కోడి కూత పెడుతోంది. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే పుంజుల సందడి మొదలైంది. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన పుంజుల విక్రయం ఇప్పుడు ఆన్లైన్ స్థాయికి ఎదిగింది. పలు వెబ్‌పోర్టల్స్‌లో జాతి కోడి పుంజుల పేరుతో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. ఉభయ గోదావరితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతుంటాయి. 60 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో మొదలైన ఎడ్ల పందేలు క్రమంగా కోళ్ల డింకీ పందేల(కత్తుల కట్టకుండా) వైపు మళ్లాయి. 25 ఏళ్ల నుంచి పుంజులకు కత్తులు కట్టి బరిలోకి దించి డబ్బులు పందాలు వేసే పద్ధతి మొదలైంది. షామియానాలు వేసి ప్లడ్‌లైట్ల కాంతిలో కోడిపందాలు జాతరను తలపిస్తాయి. పహిల్వాన్లను తలపించే పుంజులు... పందాల కోసం కోడి పుంజులను ప్రత్యేక శిక్షణతో పెంచడం దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. ఉదయాన్నే ఈత, వేడి నీటి స్నానం, అల్పాహారంగా కోడిగుడ్డు, వేటమాంసం, బాదం, పిస్తా, చోళ్లు, గంట్లు మేత. ఆరోగ్యం కోసం విటమిన్ టాబ్లెట్లు, పశుసంవర్థక శాఖ డాక్టర్లతో వారానికో పర్యాయం వైద్య పరీక్షలు.. ఇలా వీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు చాలానే ఉన్నాయి. తరలివస్తున్న ప్రముఖులు మూడు రోజుల కత్తుల సమరం కోసం కోడి పుంజులను ఏడాదిపాటు పహిల్వాన్ల తరహాలో అపురూపంగా సాకుతారు. బరిలో పందెం కోడి కాలుదువ్వి గెలిస్తే దాని ఆసామి విజయగర్వంతో మీసం మెలేస్తాడు. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తుంటారు. గతేడాది క్యాష్‌లెష్.. ఈసారి ఆన్లైన్.. గతేడాది కోడి పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లకు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందికరంగా మారడంతో క్యాష్‌లెష్ పందాలు జరిగాయి. నేరుగా నగదు మార్చకుండా ఆన్లైన్లో నగదు బదిలీ, కాగితాల్లో పందాల మొత్తాలు రాసుకుని బ్యాంక్‌ల ద్వారా లావాదేవీలు సాగాయి. ఈసారి ఆన్లైన్లో కోడి పుంజుల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఓఎల్ఎక్స్, క్విక్కర్, జెడ్ఎజెడ్స్పాట్ డాట్‌కామ్, పిఒఎస్ఒటిడాట్క్లాస్ తదితర వెబ్సైట్లలో పుంజుల ఫొటోలతో సహా అమ్మకాలకు పెట్టడం విశేషం. ఒక్కో పుంజు ధర కనీసం రూ.3,500 నుంచి రూ.50 వేల వరకు ఉంది. పుంజు పెంపకం, జాతి, రంగు, ఎత్తు, బరువును ప్రస్తావిస్తూ ఆన్లైన్ వెబ్సైట్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. రెండు తరాలుగా అమ్మకాలే జీవనాధారం.. సంక్రాంతి సీజన్ కోసం ఏడాదిపాటు కష్టపడి కోడి పుంజులను పెంచుతాం. రెండు తరాలుగా కోడి పుంజుల అమ్మకాలపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మా నాన్న నుంచి మా అన్నదమ్ముల వరకు అంతా కోడి పుంజులను పెంచి అమ్ముకుంటున్నాం. ఈసారి పుంజులు కొనేవారి సంఖ్య తగ్గింది. – తోట నర్సింహారావు, మచిలీపట్నం(కృష్ణా జిల్లా) పందేలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు మా ప్రాంతంలో జాతరలా జరిగే కోడి పందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. కొందరు ముందుగానే పందెం కోళ్లు పెంచుతారు. మరికొందరు కొనుక్కుని పందాలు వేస్తుంటారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా కొంటున్నారు. – పుచ్చకాయల అబ్బులు, పెదగరువు(పశ్చిమగోదావరి) -
శాంసంగ్ షాప్: సూపర్ క్యాష్ డిస్కౌంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. వారం రోజులపాటు నిర్వహించనున్న అప్‌కమింగ్ ఆన్లైన్ సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్ట్లను , క్యాష్ బ్యాక్ తదితర ఆఫర్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం వివిధ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపింది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లో క్రిస్మస్ కార్నివాల్‌ను ప్రకటించింది. డిసెంబరు 8నుంచి 15 వరకు ‘శాంసంగ్షాప్’ పేరుతో ఆన్లైన్ సేల్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో పేటీఎం, బజాజ్, కేషీ ఫై, మొబీ క్విక్ లాంటి ఇతర సంస్థల ద్వారా క్యాష్‌బ్యాక్, ఎక్సేంజ్ ఆఫర్, డిస్కౌంట్లు, నో కాస్ట్ ఐఎంఐ ఆఫర్లు అందిస్తోంది. రూ.10వేలకు పైన అన్ని ఉత్పత్తుల కొనుగోళ్లపై బజాజ్ ఫిన్ నో కాస్ట్ ఇఎంఐ అందిస్తోంది. పేటీఎం ద్వారా గెలాక్సీ ఎస్8 , ఎస్8 ప్లస్ , గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తే రూ. 8వేల క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదేవిధంగా మొబీక్విక్ వాలెట్ ద్వారా ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్. కేషీ ఫై శాంసంగ్ డివైస్‌లపై 40శాతం బై బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. వీటితో పాటు ఇతర శాంసంగ్ మొబైల్ ఫోన్లు, స్పీకర్లు, ఆడియో యాక్సెసరీస్, టెలివిజన్లు లాంటి ఇతర పరికరాలు తగ్గింపు ధరలతో ఈ శాంసంగ్ షాప్ సేల్ లభిస్తాయని కంపెనీ తెలిపింది. శాంసంగ్ షాప్ ద్వారా ఒక వారం పాటు విక్రయాలను ఈ పండుగ సీజన్లో ఆనందించడానికి సంతోషిస్తున్నామని శాంసంగ్ ఇండియా ఆన్లైన్ ఉపాధ్యక్షుడు సందీప్ సింగ్ అరోరా చెప్పారు. -
వారం రోజుల బంద్‌కూ వెనకాడం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో మందుల విక్రయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలీకృతం కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ మందుల షాపుల బంద్‌కు పిలుపునిస్తామని ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోటిలోని తమ కార్యాలయంలో ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.శ్రీరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తాయని, దీనివల్ల నిషేధిత మందుల విక్రయాలు తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. పైగా నిద్ర మాత్రలు కూడా ఎక్కువగా విక్రయాలు అయ్యే అవకాశం ఉందని, అర్హత కలిగిన డాక్టర్ని సంప్రదించకుండా మందులను వాడటం జాతికే నష్టమన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ లో మందుల విక్రయాలను ఆపోలో ఆపేసిందని, కేవలం మెడ్‌ప్లస్ మాత్రమే విక్రయిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా మందుల వ్యాపారులు ఉండగా, వారిపై ఆధారపడిన వారు మరో 1.20 కోట్ల మంది ఉన్నారన్నారు. వీళ్లందరూ నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, చర్చలు సఫలమవుతాయని ఆశిస్తున్నామన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే మందుల షాపులు 3 రోజులు, ఆ పైన వారం రోజుల బంద్‌కు వెనుకాడమని స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 40వేలకు పైగా మందుల షాపులు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలోనే 6వేలకు పైగా ఫార్మసీ షాపులున్నట్టు చెప్పారు. బుధవారం జరిగిన మందుల షాపుల బంద్ విజయవంతమైందన్నారు. అక్టోబర్ 14న నిర్వహించిన బంద్‌కు నెలరోజుల ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చినట్టు ప్రతినిధులు చెప్పారు. -
ఆన్లైన్ షాపింగ్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ కామర్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆన్లైన్ షాపింగ్ 88 శాతం వృద్ధితో 1,600 కోట్ల డాలర్లకు చేరిందని అసోచామ్ తాజా సర్వే వెల్లడించింది. ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం, డబ్బులు చెల్లించే మార్గాలు విరివిగా ఉండడం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు వంటి కారణాల వల్ల ఆన్లైన్ షాపింగ్ జోరుగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్, రావత్ తెలిపారు. సర్వే ముఖ్యాంశాలు..., మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, యాక్సెసరీలు, ఎంపీ3 ప్లేయర్లు, డిజిటల్ కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలే కాక దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాలు, వాచీలు వంటి లైఫ్‌స్టైల్ యాక్సెసరీలు, పుస్తకాలు, సౌందర్యోత్పత్తులు, అత్తర్లు, చిన్న పిల్లల ఉత్పత్తులు గత ఏడాది కాలంలో బాగా అమ్ముడయ్యాయి. 2009లొ 250 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఈ కామర్స్ మార్కెట్ 2012లో 850 కోట్ల డాలర్లకు చేరింది, ఆన్లైన్ డిస్కౌంట్లు ఆకర్షణీయంగా ఉండడం, సమయం ఆదా కావడం వంటి కారణాల వల్ల ఆన్లైన్ షాపింగ్ జోరు పెరుగుతోంది. ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల విషయంలో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, కోల్‌కతాలు నిలిచాయి. ఆన్లైన్ వినియోగదారుల్లో 65% మంది పురుషులుండగా, 35% మంది మహిళలు ఉన్నారు.